PM Modi: ప్రతీ మహిళా ఖాతాలోకి రూ. 10 వేలు జమ చేసిన ప్రభుత్వం.
PM Modi: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరుతో తీసుకొచ్చిన పథకంలో మహిళల ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ చేశారు.

బీహార్‌లో కొత్త మహిళా ఉపాధి పథకం ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌లోని ముఖ్యమంత్రీ మహిళా ఉద్యోగ యోజనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 75 లక్షల మహిళలకు ప్రతి ఒక్కరికీ రూ. 10,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ. 7,500 కోట్లు చేస్తోంది.
మహిళా సాధికారత పథకం ఉద్దేశం
మహిళల స్వీయ ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంపొందించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో కుటుంబం నుంచి ఒక మహిళకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని ప్రభుత్వం చెబతోంది.
రూ. 2 లక్షల వరకు
మొదటి దశలో ప్రతి లబ్ధి దారులకు రూ. 10,000 నేరుగా జమ చేస్తున్నారు. భవిష్యత్తులో అవసరమైతే రూ. 2 లక్షల వరకు అదనపు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ సాయం ద్వారా మహిళలు వ్యవసాయం, పశుపోషణ, హస్తకళ, నూలు, చిన్న వ్యాపారాలు వంటి రంగాల్లో ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు.
సామాజిక మద్దతుతో పాటు శిక్షణ
పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, స్వయం సహాయ గ్రూపుల ద్వారా శిక్షణ కూడా అందిస్తుంది. మహిళలు ప్రారంభించే వ్యాపారాలను గణనీయంగా మద్దతు ఇవ్వడానికి, గ్రామీణ హాట్ బజార్లును మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆనందంగా ఉంది: ప్రధాని మోదీ
ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవరాత్రి సందర్భంగా బిహార్ మహిళల సంతోషంలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. స్క్రీన్‌పై లక్షలాదిమంది మహిళలు కనిపిస్తున్నారన్న మోదీ.. వారి ఆశీర్వాదాలు గొప్ప బలమని అభివర్ణించారు.
बिहार की माताओं-बहनों और बेटियों के कल्याण के लिए डबल इंजन सरकार समर्पित भाव से कार्य कर रही है। इसी क्रम में आज ‘मुख्यमंत्री महिला रोजगार योजना’ का शुभारंभ करना मेरे लिए बहुत गर्व की बात है। https://t.co/pntJaWKPRm
— Narendra Modi (@narendramodi) September 26, 2025