- Home
- National
- విదేశాల నుండి తిరిగొచ్చిన భారత చరిత్ర... పురాతన విగ్రహాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
విదేశాల నుండి తిరిగొచ్చిన భారత చరిత్ర... పురాతన విగ్రహాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రధాని మోదీ
భారత దేశ ఔన్నత్యాన్ని చాటే భారత దేవతామూర్తుల పురాత విగ్రహాలు అక్రమంగా విదేశాలను తరలిన విషయం తెలసిందే. ఇలాంటి విగ్రహాలను తిరిగి దేశానికి తీసుకురావడంలో మోదీ సర్కార్ సఫలీకృతం అయ్యింది.

న్యూడిల్లీ: విదేశాలకు తరలిన దేశ చరిత్రను తిరిగి తీసుకురావడంతో మోదీ సర్కార్ సఫలీకృతం అవుతోంది. విదేశాలకు తరలిన పురాతన విగ్రహాలు, చారిత్రాత్మక వస్తువులను భారత ప్రభుత్వం దౌత్యపరమైన నిర్ణయాలతో తిరిగి ఇండియాకు తీసుకువస్తోంది.
తాజాగా మరో చారిత్రాత్మక చర్యలు తీసుకుంది. గతంలో అక్రమంగా ఆస్ట్రేలియాకు తరలిన 29 పురాతన విగ్రహాలను తిరిగి భారత్ కు చేరాయి. ఈ విగ్రహాలను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించి వాటి చరిత్రను తెలుసుకున్నారు.
పరమశివుడి విగ్రహాలు, విష్షుమూర్తి, అమ్మవారు, జైనులకు సంబంధించిన విగ్రహాలతో పాటు మరికొన్ని పురాతన విగ్రహాలు కూడా భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా నుండి తీసుకువచ్చింది. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ నుండి 9లేదా 10వ శతాబ్దంలో ఈ విగ్రహాలు విదేశాలకు అక్రమంగా తరలినట్లు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో భారత దేవతామూర్తుల విగ్రహాలు, చారిత్రక వస్తువులను గుర్తించి ప్రభుత్వం తిరిగి దేశానికి తీసుకురావడం కోసం ప్రయత్నించింది. దౌత్యపరంగా జాగ్రత్తగా వ్యవహరించిన మోదీ సర్కార్ ఈ విగ్రహాలను ఇండియాకు తీసుకురాగలిగింది. భారత చరిత్రను కాపాడేప్రయత్నం చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.