MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • మోడీ స‌ర్కారు చారిత్రాత్మ‌క ముంద‌డుగు.. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆమోదం.. త్వరలో పార్లమెంట్ కు బిల్లు

మోడీ స‌ర్కారు చారిత్రాత్మ‌క ముంద‌డుగు.. 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆమోదం.. త్వరలో పార్లమెంట్ కు బిల్లు

one nation, one election: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లు కోసం కొన్ని సంవ‌త్స‌రాలుగా క‌స‌ర‌త్తులు చేస్తున్న మోడీ స‌ర్కారు.. తన 8వ క్యాబినెట్ సమావేశంలో ముందడుగువేసింది. గురువారం 'ఒకే దేశం, ఒకే ఎన్నికల'కు ఆమోదం లభించింది. త్వరలో పార్లమెంట్ కు బిల్లు రానుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 12 2024, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

one nation, one election: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం తన ఎనిమిదో క్యాబినెట్ సమావేశంలో చారిత్రాత్మక అడుగు వేసింది. గురువారం (డిసెంబర్ 12) జరిగిన ఈ సమావేశంలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' (వన్ నేషన్, వన్ ఎలక్షన్) బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తుంది. దీంతో పాటు పలు పథకాలు, ప్రాజెక్టులపై కూడా మంత్రివర్గం చర్చించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆమోదం.. అస‌లు ఏంటిది? 

'ఒకే దేశం, ఒకే ఎన్నికల' బిల్లును ఆమోదించడం ద్వారా దేశంలో పెద్ద సంస్కరణ చేసే దిశగా మోడీ మంత్రివర్గం అడుగులు వేసిందని చెప్పాలి. ఈ బిల్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది. అంటే దేశంలో వివిధ రాష్ట్రాలు, పార్ల‌మెంట్ కు జ‌రిగే ఎన్నిక‌లు ఒకే సారి జ‌రుగుతాయి. దీనివల్ల సమయంతో పాటు ఖర్చు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

36

ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన ఒక ముఖ్యమైన చర్య "ఒక దేశం, ఒకే ఎన్నిక"కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలప‌డం చారిత్రాత్మ‌క ముంద‌డుగు. ఈ నిర్ణయాన్ని అనుసరించి సమగ్రమైన బిల్లు దేశవ్యాప్తంగా ఏకీకృత ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుంది. అంతకుముందు బుధవారం భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. ఒక దేశం, ఒకే ఎన్నికల పై  కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల‌నీ, ఈ సమస్య రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉందనీ, మొత్తం దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని నొక్కి చెప్పారు. 

46
One Nation One Election

One Nation One Election

ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనను ఆమోదించింది. ఇది 100 రోజుల వ్యవధిలో పట్టణ బాడీ, పంచాయతీ ఎన్నికలతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాజీ రాష్ట్రపతి కోవింద్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదికలో ఈ సిఫార్సులను వివరించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.

56

"ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు, విస్తృత శ్రేణిలో అంద‌రిని సంప్రదించినందుకు మా మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ జీని నేను అభినందిస్తున్నాను. ఇది మన ప్రజాస్వామ్యాన్ని రూపొందించడానికి ఒక ముఖ్యమైన అడుగు. మరింత చురుకైన, భాగస్వామ్యంలో ముంద‌డుగు" అని పిఎం మోడీ పేర్కొన్నారు.

66

ఇదిలా ఉండగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఇన్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రాష్ట్ర అసెంబ్లీలకు, లోక్‌సభకు ఏకకాల ఎన్నికలు, తరచుగా జరిగే ఎన్నికల వల్ల సమయం, ప్రజా నిధులు గణనీయంగా వృధా అవుతాయని అన్నారు. వ‌న్ నేష‌న్ వ‌న్ ఎలక్ష‌న్ తో ఇలాంటివి వుండ‌వ‌ని పేర్కొన్నారు. ‘‘నేను వ్యవసాయ శాఖ మంత్రిని కానీ ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ప్రచారం చేస్తూ.. ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగుల సమయాన్ని వృథా చేస్తున్నా.. అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి" అని చౌహాన్ అన్నారు.

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Recommended image2
Now Playing
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
Recommended image3
Now Playing
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved