MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Petrol: వాట‌ర్ బాటిల్స్‌లో పెట్రోల్ స్టోర్ చేస్తున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్ర‌త్త

Petrol: వాట‌ర్ బాటిల్స్‌లో పెట్రోల్ స్టోర్ చేస్తున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్ర‌త్త

Petrol: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై చర్చ మొదలైంది. దీంతో చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్‌ను నింపుకొని స్టోర్ చేసుకుంటున్నారు. అయితే ఇలా పెట్రోల్ నిల్వ చేయ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని మీకు తెలుసా.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 27 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెట్రోల్ విక్రయంపై భారతదేశంలో ఉన్న చట్టాలు
Image Credit : Gemini AI

పెట్రోల్ విక్రయంపై భారతదేశంలో ఉన్న చట్టాలు

భారతదేశంలో పెట్రోల్ విక్రయం, నిల్వ, రవాణా వంటి అంశాలు Petroleum Act 1934, Petroleum Rules 2002 ప్రకారం నిర్వ‌హిస్తారు. ఈ చట్టాల ప్రకారం పెట్రోల్ చాలా ప్రమాదకరమైన పదార్థంగా ప‌రిగ‌ణిస్తారు. అందువల్ల దాన్ని ఎక్కడ పడితే అక్కడ నిల్వ చేయడం లేదా ఏ డబ్బాలోనైనా నింపడం అనుమతించరు. పెట్రోల్ బంక్‌ల‌కు కూడా ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు, నీటి ట్యాంకులు వంటి అసురక్షిత పాత్రల్లో పెట్రోల్ ఇవ్వకూడదు. ఇది భద్రత పరంగా ప్రమాదకరంగా భావిస్తారు.

25
ఎలాంటి డబ్బాల్లో పెట్రోల్ నింపడానికి అనుమతి ఉంది?
Image Credit : ANI

ఎలాంటి డబ్బాల్లో పెట్రోల్ నింపడానికి అనుమతి ఉంది?

చట్టాల ప్రకారం పెట్రోల్ సాధారణంగా రెండు విధాలుగా మాత్రమే నింపడానికి అనుమతి ఉంది. నేరుగా వాహనాల ఇంధన ట్యాంకులో లేదా ఇంధన నిల్వ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లోహపు డబ్బాల్లో మాత్ర‌మే. ఈ డబ్బాలు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలతో తయారు చేస్తారు. వాటిలో ఒత్తిడి నియంత్రణ, అగ్ని ప్రమాదం నివారణ వంటి రక్షణ వ్యవస్థలు ఉంటాయి. అందువల్ల ప్రమాదం జ‌రిగే అవ‌కాశాలు తక్కువగా ఉంటాయి.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి
Related image2
జీవిత‌మంతా క‌ష్టాలు, వైఫ‌ల్యాలే అయినా రాముడు పురుషోత్త‌ముడు ఎలా అయ్యాడు? ఆయ‌న జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శం.
35
ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ ఉంచుకోవచ్చు?
Image Credit : ANI

ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ ఉంచుకోవచ్చు?

సాధారణ వ్యక్తులు ఇంట్లో పెట్రోల్ నిల్వ ఉంచుకోవాలంటే కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. సాధారణంగా వ్యక్తిగత వినియోగం కోసం 30 లీటర్ల వరకు పెట్రోల్ భద్రంగా నిల్వ ఉంచుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ పరిమితిని 100 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. అయితే ఇందుకు భద్రతా నిబంధనలు పాటించాలి. పెట్రోల్‌ను సురక్షితమైన, వేరుగా ఉన్న ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి. ఈ పరిమితికి మించి పెట్రోల్ నిల్వ చేయాలంటే ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ తప్పనిసరి.

45
సాధారణ డబ్బాల్లో పెట్రోల్ ఎందుకు ప్రమాదకరం?
Image Credit : ANI

సాధారణ డబ్బాల్లో పెట్రోల్ ఎందుకు ప్రమాదకరం?

సాధారణ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ నింపడం చాలా ప్రమాదకరం. పెట్రోల్ చాలా త్వరగా మంటలు అంటుకునే పదార్థం. సాధారణ డబ్బాల్లో ఒత్తిడి నియంత్రించే వ్యవస్థ ఉండదు. అలాగే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుంచి రక్షించే ఏర్పాట్లు కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న స్పార్క్ కూడా పెద్ద అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో పేలుడు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఇలాంటి నిల్వలను నిషేధించింది.

55
నియమాలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి?
Image Credit : ANI

నియమాలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి?

ఈ నియమాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. అసురక్షిత డబ్బాల్లో పెట్రోల్ ఇస్తున్నట్టు పెట్రోల్ బంక్‌లపై నిర్ధారణ అయితే వారి లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. అలాగే అనధికారంగా పెట్రోల్ నిల్వ చేయడం లేదా రవాణా చేస్తే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
యుద్ధం
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. డెడ్ లైన్ ఫిక్స్.. జీతాల పెంపు ఎంతంటే?
Recommended image2
పెట్రోల్ కు రేషన్... ఒక్క వాహనానికి నెలకు ఇంతే..!
Recommended image3
దేశ రాజధానిలో TV9 WITT సమ్మిట్‌.. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి
Recommended image2
జీవిత‌మంతా క‌ష్టాలు, వైఫ‌ల్యాలే అయినా రాముడు పురుషోత్త‌ముడు ఎలా అయ్యాడు? ఆయ‌న జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శం.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved