MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • New Year: ఈ దేశంలో జ‌న‌వ‌రి 1 సాయంత్రం న్యూ ఇయ‌ర్ మొద‌ల‌వుతుంది.? ఎందుకంటే..

New Year: ఈ దేశంలో జ‌న‌వ‌రి 1 సాయంత్రం న్యూ ఇయ‌ర్ మొద‌ల‌వుతుంది.? ఎందుకంటే..

New Year: మ‌రికొన్ని గంట‌ల్లో న్యూ ఇయ‌ర్ మొద‌లు కానుంది. అయితే ప్ర‌పంచంలో ప‌లు దేశాల్లో వివిధ స‌మ‌యాల్లో న్యూఇయ‌ర్ వేడుక‌లు జ‌రుగుతాయి. వేడుకలు జ‌రుపుకునే మొద‌టి, చివ‌రి దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 31 2025, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేర్వేరు వేళల్లో న్యూ ఇయర్ ఎందుకు?
Image Credit : Gemini AI

వేర్వేరు వేళల్లో న్యూ ఇయర్ ఎందుకు?

ప్రపంచం మొత్తం ఒకే క్షణంలో నూతన సంవత్సరాన్ని స్వాగతించదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండటంతో, ఒక్కో ప్రాంతంలో సమయం మారుతుంది. అదే టైమ్ జోన్ వ్యవస్థ. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనవరి 1 మొదలయ్యేలోపు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా డిసెంబర్ 31 కొనసాగుతూనే ఉంటుంది. అందుకే న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచం చుట్టూ దశలవారీగా జరుగుతాయి.

25
ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ జరుపుకునే ప్రదేశం
Image Credit : Getty

ప్రపంచంలో మొదట న్యూ ఇయర్ జరుపుకునే ప్రదేశం

ప్రపంచ పటంలో తూర్పు చివరగా ఉండే కిరితిమతి దీవి నూతన సంవత్సరానికి ముందుగా అడుగు పెడుతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న కిరిబాటి దేశానికి చెందిన ద్వీపం. ప్రపంచం ఇంకా డిసెంబర్ 31 రాత్రిలో ఉండగానే, ఇక్కడ అర్థరాత్రి 12 గంటలు దాటి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆసక్తికరంగా, ఈ దీవిలో పారిస్, లండన్, పోలాండ్ వంటి పేర్లతో గ్రామాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ.

Related Articles

Related image1
LIC: ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల గ్యారంటీ పెన్ష‌న్‌.. ఎల్ఐసీ నుంచి అద్భుత‌మైన స్కీమ్
Related image2
Zodiac sign: నిరుద్యోగుల రాత మార‌నుంది.. 2026లో ఈ 5 రాశుల వారికి ఉద్యోగం రావ‌డం ఖాయం
35
న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకూ సంబరాలు
Image Credit : X

న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకూ సంబరాలు

కిరితిమతి తర్వాత నూతన సంవత్సరం న్యూజిలాండ్ దీవుల్లో అడుగుపెడుతుంది. చాథమ్ దీవుల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3:45కే కొత్త ఏడాది మొదలవుతుంది. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లో కొద్దిసేపటి తర్వాత వేడుకలు మొదలవుతాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే బాణసంచా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రాంతంలో అక్కడ న్యూ ఇయర్ సంబరాలు గరిష్ఠ స్థాయికి చేరతాయి.

45
భారత్ న్యూ ఇయర్ టైమింగ్ ఇలా..
Image Credit : X

భారత్ న్యూ ఇయర్ టైమింగ్ ఇలా..

భారత్ డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తుంది. ఈ సమయానికి జపాన్, దక్షిణ కొరియా, చైనా ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు ముగించుకుంటాయి. భారత్ తర్వాత ఐరోపా దేశాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. లండన్ బిగ్ బెన్ గడియారం మోగిన తర్వాతే అక్కడ జనవరి 1 మొదలవుతుంది.

55
చివరగా న్యూ ఇయర్ చెప్పుకునే ప్రాంతం
Image Credit : wam

చివరగా న్యూ ఇయర్ చెప్పుకునే ప్రాంతం

ప్రపంచంలో అందరికంటే చివరగా న్యూ ఇయర్ జరుపుకునే ప్రాంతం అమెరికన్ సమోవా. ఇది UTC-11 టైమ్ జోన్‌లో ఉంటుంది. ప్రపంచమంతా ఇప్పటికే జనవరి 1 ఆనందాల్లో మునిగిపోయినా, ఇక్కడ మాత్రం ఇంకా డిసెంబర్ 31నే కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం జనవరి 1 సాయంత్రం 4:30 సమయానికి అక్కడ అర్థరాత్రి 12 గంటలు అవుతాయి. అంటే మనం మధ్యాహ్న భోజనం పూర్తిచేసే వేళ, వారు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Recommended image2
Now Playing
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Recommended image3
Now Playing
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu
Related Stories
Recommended image1
LIC: ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల గ్యారంటీ పెన్ష‌న్‌.. ఎల్ఐసీ నుంచి అద్భుత‌మైన స్కీమ్
Recommended image2
Zodiac sign: నిరుద్యోగుల రాత మార‌నుంది.. 2026లో ఈ 5 రాశుల వారికి ఉద్యోగం రావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved