MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • New Toll Policy : మే 1 నుండి కొత్త టోల్ పాలసీ ... మీ వాహనం ఏ టోల్ గేట్ వద్ద ఆగకూడదంటే ఇలా చేయండి

New Toll Policy : మే 1 నుండి కొత్త టోల్ పాలసీ ... మీ వాహనం ఏ టోల్ గేట్ వద్ద ఆగకూడదంటే ఇలా చేయండి

మనం జాతీయ రహదారులపై ప్రయాణిస్తుంటే తప్పకుండా టోల్ ఛార్జీలు కట్టాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ప్లాజాలు ఏర్పాటుచేస్తారు... కాబట్టి ప్రతిసారి ఫాస్టాగ్ ను రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై టోల్ ప్లాజాలతో పనిలేకుండానే సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు భారత ప్రభుత్వం నూతన టోల్ పాలసీని తీసుకువస్తోంది. దీంతో మనం  ప్రతిసారి టోల్ ఫీజు కట్టాల్సిన పని తప్పుతుంది... ఇందుకోసం ఏం చేయాలంటే... 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 16 2025, 04:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
New Toll Policy

New Toll Policy

New Toll Policy : మీరు కారులో లేదంటే ఏదయినా ఫోర్ వీలర్ పై రోడ్డెక్కారో ప్రయాణ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇందులో ప్రధాన ఖర్చు ఇంధనం మరియు టోల్ ఛార్జీలదే. దూర ప్రాంతాలకు ప్రయాణమంటే టోల్ ఛార్జీలే వేలలో ఉంటాయి... ప్రతి టోల్ గేట్ వద్ద వందలకు వందలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త టోల్ పాలసీని తీసుకువస్తోంది. మరో 15 రోజుల్లో ఈ కొత్త టోల్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.  

సామాన్యుల ప్రయాణ ఖర్చు తగ్గించేలా ఇకపై టోల్ వసూలు చేపట్టనున్నారు. ఇందుకోసం టోల్ చార్జీలపై భారీగా రాయితీలు ఇచ్చేందుకు కేంద్రం సిద్దమైంది. ప్రయాణ సమయంలో ప్రతిసారి ఫాస్టాగ్ రీచార్జ్ అవసరం లేకుండా ఏడాదికి ఒకేసారి టోల్ పాస్ అవకాశాన్ని కల్పించనున్నారు. కేవలం రూ.3 వేలు చెల్లిస్తే చాలు... ఏడాదిమొత్తం జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలపై నిరంతరాయంగా తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. 

ప్రస్తుతం ఒక్కసారి జాతీయ రహదారి ఎక్కితో చాలు రూ.100 కు పైగా టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. అంటే రోజులో ఒకే టోల్ గేట్ ను రెండుసార్లు దాటాల్సి వస్తే అంటే రానుపోను రూ.200 నుండి రూ.300 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక్క టోల్ గేట్ వద్దే 10 రోజులకు రూ.3000 ఖర్చు అవుతోంది. అలాంటిది ఏడాదిలో దేశంలోని ఏ టోల్ గేట్ ను అయినా, ఎన్నిసార్లయినా దాటేందుకు కేవలం రూ.3000 చెల్లించే సూపర్ ప్లాన్ ను తీసుకువస్తున్నారు. ఇది వాహనదారులకు భారీ ఊరట కల్పించనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
New Toll Policy

New Toll Policy

కొత్త టోల్ పాలసీతో ఎంత డబ్బు ఆదా? 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉన్నాయి. వీటిపై అనేకచోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటుచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కో టోల్ ప్లాజా వద్ద ఒక్కోలా చార్జీలు ఉంటాయి. ఇలా ప్రతిసారి టోల్ చెల్లించకుండా నిత్యం ఆ టోల్ గేట్ ద్వారా ప్రయాణం సాగించేవారు నెలవారి పాసులు పొందవచ్చు. నెలకు రూ. 340 టోల్ పాస్ కోసం చెల్లించాలి... అంటే ఏడాదికి రూ. 4,080 ఖర్చు అవుతుంది. అందులోనూ ఈ పాస్ కేవలం ఆ  ఒక్క టోల్ గేట్ లోనే పనిచేస్తుంది. 

అయితే కొత్త టోల్ పాలసీలో ఏడాదికి కేవలం రూ.3 వేలు చెల్లించి టోల్ పాస్ పొందవచ్చు. ఇది దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లో పనిచేస్తుంది. అంటే నెలవారి పాసులతో పోలిస్తే ఈ ఏడాది పాస్ తక్కువ ధరకు రావడమే కాదు ప్రయాణ సమయంలో డబ్బులను భారీగా ఆదా చేస్తుంది. 

ఏడాది టోల్ పాస్ లతో పాటు వెహికిల్ లైఫ్ టైమ్ టోల్ పాసుల జారీకి కూడా కేంద్రం సిద్దమవుతోంది. అంటే ఓ వాహనానికి 15 ఏళ్లపాటు టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.30 వేలు చెల్లించి పాస్ తీసుకోవాలన్నమాట. ఈ లైఫ్ టైమ్ పాస్ ను కూడా కొత్త టోల్ పాలసీ ద్వారా ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

33
New Toll Policy

New Toll Policy

మే 1 నుండి న్యూ టోల్ పాలసీ : 

భవిష్యత్ లో దేశంలోని హైవేలపై అసలు టోల్ ప్లాజాలే లేకుండా చేయాలన్న ఆలోచనతో కేంద్ర ముందుకు వెళుతోంది. అందుకోసం శాటిలైట్ ఆధారిత టోల్ వసూలుకు సిద్దమవుతోంది. అంటే ఏదయినా వాహనం ఆ రహదారికి ఎంత ఉపయోగిస్తుందో అంతే టోల్ కట్టాలి... కిలో మీటర్ కు రూ.2 చొప్పున టోల్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంటే 50 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల టోల్ ప్లాజాల అవసరం ఉండదన్నమాట. 

నంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాన్ని ట్రాక్ చేస్తారు. దీని ఆధారంగానే ఆటోమేటిక్ గా టోల్ కట్ అవుతుంది. మే 1 నుండి ఈ శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని కొన్ని రూట్లలో అమలు చేయనున్నారు... కొంతకాలం పరిశీలన తర్వాత అన్ని రహదారుల్లో దీన్ని అమలుచేస్తారు. అంటే ఇకపై గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదన్నమాట. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved