MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • New Rules : గ్యాస్ సిలిండర్ నుంచి యూపీఐ, ఏటిఎం వరకు .. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

New Rules : గ్యాస్ సిలిండర్ నుంచి యూపీఐ, ఏటిఎం వరకు .. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్

ఇవాళ్టి ( జూన్ 1) నుంచి ఎల్పీజీ, యూపీఐ, ఏటీఎం లావాదేవీలు, ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారి ఖర్చులతో పాటు, డిజిటల్ లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 01 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జూన్ 1 నుంచి మారిన రూల్స్
Image Credit : Getty

జూన్ 1 నుంచి మారిన రూల్స్

జూన్ 1 నుంచి దేశంలోని పలు కీలక సేవల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వంటగది ఖర్చుల నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితం, నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు (సోమవారం) నుంచి అమలవుతున్న ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎల్పీజీ కనెక్షన్ కట్..
Image Credit : Getty

ఎల్పీజీ కనెక్షన్ కట్..

ఇకపై పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ ఉన్న ఇళ్లకు ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పు చేశారు. కొత్త రూల్ ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్ యాక్టివేట్ అయిన 30 రోజుల్లోగా పాత ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌ను సరెండర్ చేయాలి. అయితే ఇండేన్, భారత్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలు 'కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ వోచర్' విధానాన్ని తెచ్చాయి. దీని ద్వారా భవిష్యత్తులో మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

36
ఎల్పిజి సిలిండర్ ధరలు పెంపు
Image Credit : Getty

ఎల్పిజి సిలిండర్ ధరలు పెంపు

ప్రతి నెలా మాదిరిగానే ఎల్పీజీ, కమర్షియల్ సిలిండర్ల ధరల సవరణ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి.. దీంతో ప్రజలపై భారం పడుతోంది. తాజాగా మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగాయి.. నేటి నుంచే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ.52 పెరిగింది.. దీని ధర రూ.3,367 కి చేరింది. ఇక ఢిల్లీలో రూ.42 పెరిగి రూ.3,113.50... కోల్‌కతాలో రూ.3,255.50 కి చేరింది.

5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్‌ పైనా రూ.11 పెరిగింది. అయితే డొమెస్టిక్ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం ప్రకటించింది. అంటే సామాన్యులపై భారం లేదన్నమాట. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ లో ఏవైనా మార్పుచేర్పులు ఉండవచ్చు.

46
యూపీఐ కొత్త రూల్
Image Credit : Getty

యూపీఐ కొత్త రూల్

డిజిటల్ భద్రతను పెంచేందుకు యూపీఐ లావాదేవీల్లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చారు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్‌లో డబ్బు పంపే ముందు, అవతలి వ్యక్తి బ్యాంకులో రిజిస్టర్ అయిన అధికారిక పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. తప్పుడు లావాదేవీలు, మోసాలను తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం.

56
ఏటీఎం రూల్స్..
Image Credit : Getty

ఏటీఎం రూల్స్..

బ్యాంకింగ్ సేవలలో కూడా కొన్ని మార్పులు అమలవుతున్నాయి. చాలా బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని కఠినంగా అమలు చేయడం ప్రారంభించాయి. పరిమితి దాటితే డబ్బు విత్‌డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి సేవలకు అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చు. కొన్ని సడలింపులు ప్రకటించినప్పటికీ, అధిక విలువైన లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా కొనసాగుతుంది.

66
ఆదాయపు పన్ను మార్పులు
Image Credit : Gemini

ఆదాయపు పన్ను మార్పులు

ముందుగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన వారికి ఈ జూన్ 15 కీలకమైన తేదీ. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఒకేసారి పన్ను కట్టకుండా నాలుగు వాయిదాలలో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి 15 తేదీల్లోగా) ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
LPG Fraud : సిలిండర్ పేరుతో కొత్త మోసం..: Indane, HP కస్టమర్లు బిఅలర్ట్
Recommended image2
Viral News : పేరు సుల్తాన్, బరువు 200 కిలోలు, ధర రూ.8 లక్షలు..: ఇది ఓ మేక ఇంట్రెస్టింగ్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved