ప్రతి నెలా రూ.50,000 పెన్షన్ ... ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం జాతీయ పింఛను పథకాన్ని రూపొందించింది. ఇందులో చేరి మీరు ప్రతినెలా కొంత డబ్బు చెల్లిస్తే రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి డబ్బులు, నెల నెలా పెన్షన్ పొందవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి వివరంగా చూద్దాం.
జాతీయ పెన్షన్ స్కీమ్
మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా 60 ఏళ్ళ తర్వాత రిటైర్ కావాల్సిందే. అప్పటివరకు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కూడబెడితే హాయిగా జీవించవచ్చు. ఇందుకోసమే కేంద్ర ప్రభత్వం జాతీయ పెన్షన్ స్కీం (National Pension System) తీసుకువచ్చింది.
వృద్దాప్యంలో ఆదాయం లేకపోయినా భారీ మొత్తం పెన్షన్ పొందాలంటే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం లో చేరాల్సిందే. దీనివల్ల 60 ఏళ్ల తర్వాత వేరే ఆదాయం లేకపోయినా రోజువారీ ఖర్చులకు ఇబ్బంది పడకుండా వుంటారు.
కేంద్ర ప్రభుత్వ ఎన్‌పిఎస్ పథకంలో టైర్ 1, టైర్ 2 అనే రెండు రకాల ఖాతాలు ఉన్నాయి. టైర్ 1 ఖాతాను ఎవరైనా తెరవవచ్చు. టైర్ 2 ఖాతా తెరవాలంటే తప్పకుండా టైర్ 1 ఖాతా ఉండాలి.
ఎన్‌పిఎస్ నెలవారీ పెన్షన్
ఈ పథకం ప్రకారం ఒకరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్ల తర్వాత ఈ పెట్టుబడి పెట్టిన మొత్తంలో 60% వారికి ఒకేసారి లభిస్తుంది. మిగిలిన 40% వార్షికంగా లెక్కించబడుతుంది. ఈ వార్షిక మొత్తాన్ని బట్టి మీకు పెన్షన్ వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ పథకం
ఉదాహరణకు ఒకరు తన 35వ ఏట నుంచి నెలకు రూ.15,000 ఎన్‌పిఎస్ పథకంలో పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. 60 ఏళ్లు వచ్చేవరకు అంటే 25 ఏళ్లపాటు ఇలా చెల్లించారనుకుందాం. నెలకు రూ.15,000 చొప్పున మొత్తం పెట్టుబడి రూ.45,00,000 అవుతుంది. దీనికి వచ్చే వడ్డీ రూ.1,55,68,356. రెండూ కలిపి రూ.2,00,68,356 అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ పథకం
ఈ మొత్తంలో 60% అంటే రూ.1,20,41,013 వారికి 60 ఏళ్ల వయసులో ఒకేసారి లభిస్తుంది. మిగిలిన 40% అంటే రూ.80,27,342 వార్షికంగా ఉంటుంది. దీనికి 8% వడ్డీ కలిపితే నెలకు రూ.53,516 పెన్షన్ వస్తుంది.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మీరు నెలకు ఎంత పెట్టుబడి పెడతారో దాన్ని బట్టి మీకు ఒకేసారి వచ్చే 60% మొత్తం, నెలకు వచ్చే పెన్షన్ లెక్కించబడుతుంది.