MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • National
  • Narendra Modi : పవన్ రికార్డును బద్దలుగొట్టిన మోదీ... ఏంటో తెెలుసా..?

Narendra Modi : పవన్ రికార్డును బద్దలుగొట్టిన మోదీ... ఏంటో తెెలుసా..?

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. గుజరాత్ సీఎంగా, భారత ప్రధానిగా మొత్తం 8931 రోజులు అధికారంలో కొనసాగి సరికొత్త చరిత్ర సృష్టించారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును ఆయన బద్దలుకొట్టారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 23 2026, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోదీ రికొత్త రికార్డు.
Image Credit : Getty

మోదీ రికొత్త రికార్డు.

2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ, ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ప్రధానిగా తన పదవీకాలంతో కలిపి మొత్తం 8931 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో 8930 రోజులు సిక్కిం సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును మోదీ అధిగమించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాలకుడిగా మోదీ సిల్వర్ జూబ్లీ..
Image Credit : Getty

పాలకుడిగా మోదీ సిల్వర్ జూబ్లీ..

ప్రధాని నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో చారిత్రక మైలురాయిని అందుకున్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధిపతిగా నిలిచారు. గుజరాత్ సీఎంగా, ప్రధానిగా ఆయన పదవీకాలం 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దశాబ్దాలుగా మోదీ అందిస్తున్న ప్రజాసేవకు ఇది నిదర్శనం.

35
స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ప్రధాని..
Image Credit : Getty

స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ప్రధాని..

మోదీ తన పదవీకాలంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. గుజరాత్‌కు అత్యధిక కాలం పనిచేసిన సీఎం ఆయనే. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన అనుభవంతో ప్రధాని అయిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి భారత ప్రధాని కూడా ఆయనే. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించారు.

45
మూడుసార్లు ప్రధానిగా రికార్డు..
Image Credit : X

మూడుసార్లు ప్రధానిగా రికార్డు..

నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 21 వరకు ఆ పదవిలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు 13 ఏళ్లకు పైగా గుజరాత్‌ను నడిపించారు. ఆ తర్వాత 2014 మే 26న భారత 14వ ప్రధానిగా ప్రమాణం చేశారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించారు. రెండు టర్మ్‌లు పూర్తిచేసి, మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా మోదీనే.

55
సోషల్ మీడియాలోనూ మోదీ హవా
Image Credit : Getty

సోషల్ మీడియాలోనూ మోదీ హవా

ఈ రాజకీయ రికార్డుతో పాటు, డిజిటల్ రంగంలోనూ మోదీ ఈ ఏడాది పలు మైలురాళ్లను అందుకున్నారు. ఈ నెల ప్రారంభంలో, ఆయన యూట్యూబ్ ఛానెల్‌ 30 మిలియన్ల (3 కోట్లు) ఫాలోవర్లను సంపాదించుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నేతల్లో మోదీ ఒకరిగా నిలిచారు. ఇతర అంతర్జాతీయ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనే ముందున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్లను సాధించారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి నేత, రాజకీయ నాయకుడిగా ఆయన నిలిచారు. 2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పటి నుంచి ఆయన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయనకు 101 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక 'ఎక్స్' (ట్విట్టర్)లో మోదీకి 106.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
నరేంద్ర మోదీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
Recommended image2
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image3
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Related Stories
Recommended image1
Now Playing
Grand Welcome to PM Narendra Modi: కేరళలో అడుగుపెట్టిన మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
Recommended image2
Now Playing
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved