పారిపోయిందని బట్టలూడదీసి.. నగ్నంగా వీడియోలు.. చిత్రహింసలు..

First Published 10, Oct 2020, 3:21 PM

అతివలపై అకృత్యాలకు ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించింది అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఓ హేయమైన సంఘటన. ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ ఘటన జరిగిన పదిరోజులకు అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది ఈ దుర్మార్గం.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్‌లాంగ్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. సవిత, రాజన్ (పేర్లుమార్చాం) ఇద్దరు భార్యాభర్తలు. ఐదేళ్లుగా వీరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ రాజన్ సవితను తీవ్రంగా హింసించేవాడు.

గర్భవతిగా ఉన్న సమయంలో కూడా కడుపులో తన్నాడు. దాంతో గర్భస్రావం అయ్యింది. రెండుసార్లు ఇలాగే చేశాడు. ఆ తర్వాత అతడి ఆగడాలు శ్రుతిమించాయి. అతని దెబ్బలకు, హింసలకు శరీరం తట్టుకోలేక ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా సవిత అత్తగారు రాజన్ ను ఒక్కమాట అనేది కాదు. పైగా ఆయనకే వత్తాసు పలుకుతూ సవితనే నిందించేది.

ఈ విషయం గురించి అనేకసార్లు పంచాయితీ జరిగింది. కానీ అదే తంతు కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సవితకు రాహుల్ (పేరు మార్చాం)తో పరిచయం అయ్యింది. విడాకులు తీసుకుని, తనను పెళ్లి చేసుకోమని కోరాడు. అతనికి అప్పటికే పెళ్లైంది. వారికి గొడవలు జరుగుతున్నాయి. చివరికి ఎలాగో సవితను ఒప్పించాడు. ఇద్దరూ కలిసి అసోంలోని తిన్సుకియాకు పారిపోయారు.

కొద్ది రోజుల్లోనే రాహుల్ కుటుంబం వీరి జాడ కనుక్కున్నారు. ఇంటికి తిరిగి రావాలని, తప్పు సరిదిద్దుకుంటే క్షమిస్తామని చెప్పారు. దాంతో సెప్టెంబరు 25న కారులో ఊరికి వచ్చారు. వారు రాత్రి అక్కడికి చేరుకునే సమయానికి కొంతమంది పెద్ద మనుషులు ఎదురుచూస్తున్నారు. కారులో నుంచి సవితను బయటకు లాగి జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు.

ఆ తర్వాత నగ్నంగా మార్చి చన్నీళ్లతో స్నానం చేయించి, జుట్టు కత్తిరించారు. చేతులు అడ్డుపెట్టుకునైనా  కాపాడుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అసభ్య పదజాలంతో దూషిస్తూ, కొట్టి అవమానించారు. ఆడవాళ్లు నా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సమయంలో వాళ్ల కొడుకులు, భర్తలు ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.

ఆ తర్వాత సవితను ఓ స్కూళ్లోకి పంపించి అక్కడే నిద్రించాలని ఆదేశించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఆగలేదు ఆ తరువాతి రోజు సవిత కుటుంబసభ్యుల నుండి 40 వేలు జరిమానా కింద వసూలు చేశారు. సవితను గ్రామబహిష్కరణ చేశారు.

ఈ మొత్తం ఘటనలో రాహుల్ ను ఏమీ అనకపోవడం.. అతని తప్పేం లేదన్నట్టుగా వదిలేయడం విశేషం. ఈ విషయం గురించి తెలుసుకున్న లేకంగ్‌లోని వుమెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ నార్కొటిక్స్‌ సెల్‌ పోలీసులకు సమాచారమిచ్చింది. వీరు 38 మంది గ్రామస్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తొమ్మిది మంది మహిళలతో సహా 15 మందిని అరెస్టు చేశారు.

loader