MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Maoist: ఇక చాలు ఆపేస్తాం.. మావోయిస్టులు సంచ‌ల‌న నిర్ణ‌యం. కీలక లేఖ విడుద‌ల

Maoist: ఇక చాలు ఆపేస్తాం.. మావోయిస్టులు సంచ‌ల‌న నిర్ణ‌యం. కీలక లేఖ విడుద‌ల

Maoist: దేశంలో మావోయిస్టులను నిర్మూలించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌తో మావోయిస్టులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 17 2025, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మారుతున్న ఆలోచన
Image Credit : Asianet News

మారుతున్న ఆలోచన

ఎన్నో ఏళ్లుగా సాయుధ పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులకు, ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రుల అభ్యర్థనలకు స్పందిస్తూ చివరికి పార్టీ తమ ఆయుధాలను వదిలి శాంతి మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకుంది.

25
పార్టీ తరఫున లేఖ – శాంతి చర్చలకు సిద్ధం
Image Credit : Getty

పార్టీ తరఫున లేఖ – శాంతి చర్చలకు సిద్ధం

పార్టీ ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖలో ఈ కీలక నిర్ణయం స్పష్టం చేశారు. ఇకపై తుపాకీతో పోరాటం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాలను ఆశ్రయిస్తామని వెల్లడించారు. ప్రభుత్వం లేదా హోంశాఖ నియమించే ప్రతినిధులతో చర్చ‌ల‌కు సిద్ధమని కూడా తెలిపారు.

Related Articles

Related image1
Aloe Vera: కొరియ‌న్ అమ్మాయిల్లాంటి అందం కావాలా? క‌ల‌బంద‌తో ఇలా చేస్తే అద్భుతం
Related image2
Numerology: న్యూమరాలజీ ప్రకారం.. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.
35
ఒక నెల గడువు – కాల్పుల విరమణ విజ్ఞప్తి
Image Credit : getty

ఒక నెల గడువు – కాల్పుల విరమణ విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా ఉన్న తమ సహచరులు, జైళ్లలో ఉన్న సభ్యులతో సంప్రదించడానికి ఒక నెల సమయం కావాలని మావోయిస్టులు కోరారు. ఈ సమయంలో తాత్కాలిక సీజ్‌ఫైర్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు.

45
నాయకత్వ మార్పు – కొత్త దిశలో అడుగులు
Image Credit : our own

నాయకత్వ మార్పు – కొత్త దిశలో అడుగులు

పార్టీ సుప్రీం లీడర్ బసవరాజు మృతి తరువాత కొత్తగా తిప్పిరి తిరుపతి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మొదటిసారిగా మావోయిస్టు నేత ఫొటోతో పాటు అధికారిక లేఖ విడుదల కావడం పెద్ద చర్చనీయాంశమైంది.

55
గతం నుంచి పాఠాలు
Image Credit : PTI

గతం నుంచి పాఠాలు

మావోయిస్టులు తమ లేఖలో గతంలో జరిగిన సైనిక దాడులు, నాయకుల మరణాలను ప్రస్తావిస్తూ ఇకపై రక్తపాతం కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని సంకేతమిచ్చారు. గతంలో నిలిచిపోయిన శాంతి చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఇతర పార్టీలు, సంస్థలతో కలసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related Stories
Recommended image1
Aloe Vera: కొరియ‌న్ అమ్మాయిల్లాంటి అందం కావాలా? క‌ల‌బంద‌తో ఇలా చేస్తే అద్భుతం
Recommended image2
Numerology: న్యూమరాలజీ ప్రకారం.. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved