Numerology: న్యూమరాలజీ ప్రకారం.. ఈ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.
Numerology: మన దేశంలో జ్యోతిష్యంతో పాటు సంఖ్యా శాస్త్రాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

న్యూమరాలజీ అంటే ఏంటి?
సంఖ్యల ఆధారంగా వ్యక్తుల స్వభావం, భవిష్యత్తు, జీవన విధానం గురించి చెప్పే శాస్త్రాన్నే న్యూమరాలజీ అంటారు. ఇది వేల ఏళ్ల క్రితమే ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. ఈ శాస్త్రంలో ముఖ్యంగా రాడిక్స్ నంబర్ (Radix Number) కి ప్రాధాన్యం ఉంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఈ సంఖ్యను లెక్కిస్తారు.
రాడిక్స్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి?
రాడిక్స్ నెంబర్ అంటే పుట్టిన తేదీలోని అంకెలను కలిపి ఒక అంకెల సంఖ్యకు వచ్చే సంఖ్య. ఉదాహరణకు
* ఒకరు 14 తేదీన పుట్టారని అనుకుందాం. 1 + 4 = 5 ⇒ రాడిక్స్ నంబర్ 5.
* 29 తేదీన పుట్టారని అనుకుందాం. 2 + 9 = 11 → 1 + 1 = 2 ⇒ రాడిక్స్ నంబర్ 2.
అంటే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారికి రాడిక్స్ నంబర్ 2 అవుతుంది.
రాడిక్స్ నంబర్ 2 ఉన్న అమ్మాయిల వ్యక్తిత్వం
ఈ సంఖ్య ఉన్న మహిళలు సున్నిత మనస్కులు. ఎక్కువగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. కానీ అదే సమయంలో తెలివితేటలు, ఆత్మవిశ్వాసం కూడా బలంగా ఉంటుంది. ఎవరితోనైనా బంధాలను విలువైనవిగా భావిస్తారు. కుటుంబంలో అందరితో మంచి అనుబంధం కలిగి ఉంటారు.
భర్త జీవితంలో చేసే ప్రభావం
రాడిక్స్ నంబర్ 2 ఉన్న అమ్మాయి పెళ్లి అయిన తర్వాత భర్త జీవితంలో పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుందని న్యూమరాలజీ చెబుతోంది. భర్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రోత్సహించి ధైర్యం చెప్తారు. కష్టసమయాల్లో భర్తను ఒంటరిగా వదిలిపెట్టదు. మద్దతు, సహకారం, ప్రేమతో మంచి భాగస్వామిగా నిలుస్తుంది.
కుటుంబ జీవితంలో పాత్ర
ఇంటి శాంతి, ఆనందం కాపాడటం వీరి ముఖ్య లక్షణం. గొడవలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను నిలబెడతారు. భర్త పట్ల విధేయత, అవగాహన, అనురాగంతో వ్యవహరిస్తారు. వీరి వల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.