MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • LPG Booking: గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేయాలంటే 35 రోజులు ఆగాల్సిందేనా.? క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

LPG Booking: గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేయాలంటే 35 రోజులు ఆగాల్సిందేనా.? క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం

LPG Booking: దేశంలో ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయని ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ముఖ్యంగా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌కు కొత్త టైమ్ లిమిట్ పెట్టారని చెప్పడంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 25 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎల్పీజీ బుకింగ్‌పై వస్తున్న వార్తలు
Image Credit : Asianet News

ఎల్పీజీ బుకింగ్‌పై వస్తున్న వార్తలు

కొన్ని వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు కొత్త గడువులు అమల్లోకి వచ్చాయని ప్రచారం జరిగింది. పీఎంయూవై (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, డబుల్ సిలిండర్ కనెక్షన్లకు 35 రోజులు గడువు పెట్టారని సమాచారం వచ్చింది. అయితే ఈ వార్తలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి మార్పులు ఎక్కడా అమలు చేయలేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్పీజీ రీఫిల్ నిబంధనలు
Image Credit : X

ప్రస్తుతం అమల్లో ఉన్న ఎల్పీజీ రీఫిల్ నిబంధనలు

పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్‌కు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు కనీసం 25 రోజుల గడువు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా కొనసాగుతుంది. ఈ నిబంధనలు కనెక్షన్ టైప్‌తో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి
Related image2
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
35
దేశంలో ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయా?
Image Credit : Getty

దేశంలో ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయా?

ఎల్పీజీ సరఫరా గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. రిఫైనరీల్లో ప్రస్తుతం ఉత్పత్తి పెంచినట్లు అధికారులు వెల్లడించారు. అందువల్ల ఎల్పీజీ కొరత ఏర్పడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

45
పెట్రోల్, డీజిల్ నిల్వల పరిస్థితి
Image Credit : X

పెట్రోల్, డీజిల్ నిల్వల పరిస్థితి

ఇటీవల నెల‌కొన్న యుద్ధ పరిణామాలపై జరిగిన మంత్రిత్వ శాఖ సమావేశంలో కూడా అధికారులు దేశంలో ఇంధన నిల్వలపై వివరాలు వెల్లడించారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ మాట్లాడుతూ దేశంలోని అన్ని రిఫైనరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. క్రూడ్ ఆయిల్ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఆమె వివరించారు.

55
బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు
Image Credit : X

బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశంలోని సుమారు 32 రాష్ట్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు పని చేస్తున్నాయి. అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తున్నట్లు సమాచారం వచ్చిన చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బృందాలు కూడా సక్రియంగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 1500 సడెన్ ఇన్స్పెక్షన్లు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image2
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Recommended image3
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. దేశంలో తొలిసారి ఎయిర్ పోర్ట్ కింది నుంచి అండ‌ర్‌పాస్‌. ట్రాఫిక్ న‌ర‌కం నుంచి విముక్తి
Recommended image2
Philips: ఇంట్లో ఇదొక్క‌టి ఉంటే చాలు.. ఇక‌పై గ్యాస్ సిలిండ‌ర్ కొనాల్సిన ప‌ని ఉండ‌దు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved