కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలీసాకు సినిమా ఛాన్స్ : ఏ మూవీ, ఏ పాత్రలో నటించనుంది?
మోనాలిసా... పేరుకు తగ్గ అందం ఆమెది. ఆ అందమే ఆమెను రోడ్డుపై రుద్రాక్ష మాలలమ్మే ఆమెను బాలీవుడ్ యాక్టర్ స్థాయికి చేర్చింది. ఆమెను సినిమా ఛాయిస్ ఇచ్చేందుకు బాలీవుడ్ డైరెక్టర్ ముందుకువచ్చారు. మరీ ఏ సినిమాలో, ఏ పాత్రలో ఆమె కనిపిస్తుందో?

Monalisa Bhosle
Monalisa Bhosle : ప్రయాగరాజ్ మహా కుంభమేళా ఓ నిరుపేద అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల హారాలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె అందానికి యావత్ దేశమే ఫిదా అయిపోయింది... సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ గా మారి చివరికి బాలివుడ్ ను చేరాయి. ఇలా కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా బోంస్లే బాలీవుడ్ సినిమా ఛాయిస్ కొట్టేసింది.
మోనాలీసాకు తన సినిమాలో ఛాయిస్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికన ప్రకటించారు. మోనాలీసాకు సినిమా ఛాన్స్ ఇవ్వాలన్న తన నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటని నెటిజన్లను ప్రశ్నించారు సరోజ్.
'గత కొద్దిరోజులుగా ప్రయాగరాజ్ కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నా. ఆమె అందమైన కళ్లు కలిగిన ఆ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. బాలీవుడ్ లోని మురికిని ప్రోత్సహించే బదులు ఇలాంటి అమ్మాయిలకు అవకాశం ఇస్తే బావుంటుంది. అందువల్లే ఈ నిరుపేద అమ్మాయికి తన తదుపరి సినిమాలో ఛాయిస్ ఇస్తున్నా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?' అంటూ సరోజ్ మిశ్రా ట్వీట్ చేసారు.

Monalisa Bhosle
మోనాలిసా నటించే సినిమా అదేనా?
కుంభమేళా వైరల్ గర్ల్ కు సినిమా ఛాన్స్ ఇస్తానని బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ ప్రకటించారు. త్వరలోనే మోనాలీసాను స్వయంగా కలిసి సినిమా గురించి మాట్లాడతానని తెలిపారు. ఆమెకు యాక్టింగ్ రాకపోవచ్చు ... అయినా ప్రత్యేకంగా నటనలో శిక్షణ ఇప్పించి సినిమాలో పెట్టుకుంటానని సనోజ్ తెలిపారు.
ఇలా మోనాలిసా బోంస్లే బాలీవుడ్ లో నటించే ఛాన్స్ రావడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే సినిమా ఛాన్స్ ఇస్తారా? లేక ఇప్పుడు ఆమెకున్న ఫేమ్ ను వాడుకుని వదిలేస్తారా? అన్న చాలామందిలో వుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం డైరెక్టర్ సనోజ్ ఏ సినిమాలు రూపొందిస్తున్నారు? అనేది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులోనే మోనాలీసాకు అవకాశం ఇస్తారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి వుంది.
సనోజ్ మిశ్రా ప్రస్తుతం 'డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇది మణిపూర్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా తెరకెక్కింది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావ్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమాలోనే మోనాలీసాకు సరిపోయే పాత్ర వుందని...అందుకోసమే డైరెక్టర్ ఆమెకు ఆఫర్ ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
డైరీ ఆఫ్ మణిపూర్ సినిమా ఓ రాజకీయ నాయకుడు, ఓ గ్రామీణ యువతి మధ్య నడిచే ప్రేమకథ. ఇందులో భాగంగానే మణిపూర్ లో కొనసాగుతున్న అల్లర్లను చూపించనున్నట్లు సినిమా బృందం చెబుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా అమిత్ రావ్, హీరోయిన్ గా మాన్సి గులాటిని ఎంపికచేసారు. మరి ఈ సినిమాలో మోనాలీసాకు అవకాశం ఇస్తే ఎలాంటి పాత్రను ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Monalisa Bhosle
రోడ్డుపై మాలలమ్మే స్ధాయినుండి బాలీవుడ్ ఛాయిస్ వరకు ... మోనాలీసా ప్రయాణం :
మోనాలీసా అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది లియోనార్డో డావిన్సీ పెయింటింగ్ లోని స్త్రీమూర్తి. కానీ ఇప్పుడు ఈ పేరు చెబితే ఓ నిరుపేద అందాలరాశి గుర్తుకువస్తోంది. ప్రయాగరాజ్ కుంభమేళాకు ముందు ఆమె ఎవరికీ తెలియదు... ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, దుమ్మూ దూళిని లెక్కచేయకుండా రోడ్డుపై రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి. కానీ కుంభమేళా ద్వారా చూపులు తిప్పుకోనివ్వని ఆ సహజ అందం ప్రపంచానికి పరిచయం అయ్యింది.
పిల్లి కళ్లు, ముక్కుకు పుడక, అందమైన నవ్వు... ఈ సహజ సౌందర్యానికే ప్రతిఒక్కరు ఫిదా అవుతున్నారు. పొట్టకూటికోసం రుద్రాక్ష మాలలు అమ్ముతున్న అమ్ముతున్న ఈ అమ్మడు స్వస్థలం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్. నిరుపేద కుటుంబానికి చెందిన ఈమె కుటుంబమంతా ఇలా రుద్రాక్ష, ముత్యాల మాలలు అమ్ముతుంటారు.
ఎక్కడ కుంభమేళాలు, హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్లి మాలలు అమ్ముతుంటారు. మరీముఖ్యంగా సన్యాసులు, సాధుసంతులు ఎక్కువగా హారజయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా వుంటుంది. ఇలా ప్రస్తుతం ప్రయాగరాజ్ కుంభమేళాలో ఈ కుటుంబం రుద్రాక్ష మాలల అమ్మకం చేపట్టింది. కుటుంబంతో కలిసి ఇక్కడికి వచ్చిన మోనాలీసా అందానికి ముగ్దులైనవారిలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఆమె సహజ అందం నెటిజన్లను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మోనాలిసా. దీంతో ఆమెకోసమే కుంభమేళాకు వెళ్లి వీడియోలు తీయడం ప్రారంభించారు యూట్యూబర్లు. అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ కూడా ఆమెపై ఫోకస్ పెట్టాయి. దీంతో ప్రయాగరాజ్ బ్యూటీ పేరుతో మోనాలిసా యావత్ దేశానికి పరిచయం అయ్యారు.
పేరుకు తగ్గ అందం ఆమెదంటూ మోనాలీసాను నెటిజన్లు కొనియాడుతున్నారు. అంతేకాదు ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇలా ఆమె అందం ఓ దశవరకు బాగానే వుంది... కానీ రానురాను పరిస్థితి మారిపోయి ఆమెకు ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఆమెను జనాలు ఎగబడటంతో కుటుంబం కూడా బరించలేకపోయింది.
ఇలా మోనాలిసాను చూసేందుకు వస్తున్నవారు కేవలం సెల్పీలు, వీడియోలకే పరిమితం అవుతున్నారు. ఆమెవద్ద మాలలు కొనేవారికంటే ఇలా ఊరికే చూసేందుకు వచ్చేవారే ఎక్కువయిపోయారు. దీంతో వ్యాపారం దెబ్బతినడమే కాదు కూతురు ఇబ్బంది పడుతోందని గమనించిన తండ్రి ఆమెను స్వస్థలానికి పంపించారు.
Monalisa Bhosle
సినిమాల్లో మోనాలీసా రాణిస్తుందా?
ఆమె అందం సినిమా ఛాన్స్ ఇప్పించడంవరకు పనిచేసింది. మరి సినిమాల్లో మోనాలీసా రాణించగలదా? నెపోటిజం ఎక్కువగా వుండే బాలీవుడ్ ఈ పేద అమ్మాయిని అక్కున చేర్చుకుంటుందా? అనే అనుమానాలు ఆమెను అభిమానించేవారికి వస్తున్నాయి. గతంలో భాలీవుడ్ లో చోటుచేసుకున్న ఇలాంటి సంఘటనలు కూడా మోనాలీసా భవిష్యత్ పై అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఎలాంటి నేపథ్యం లేని వ్యక్తిని ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారితే మొదట సినిమా ఛాన్సులు ఇచ్చి, ఆపై వారిని మధ్యలో వదిలివేయడం రంగుల ప్రపంచంలో కొత్త విషయం కాదు. టీఆర్పీ కోసం గతంలో కొందరు ఇలా చేసిన సంగతి మన కళ్ల ముందే ఉంది.
రోడ్డు పక్కన భిక్షాటన చేసే రాను మండేలాను తీసుకొచ్చి స్టార్‌ని చేసి మళ్లీ వీధిలో వదిలేశారని గుర్తు చేసుకుంటున్నారు ఇక మన తెలుగులోనూ కూర్చీ తాత పరిస్థితి అలాగే అయ్యింది. ఈ నేపథ్యంలో మోనాలిసా అభిమానులు. ఈమె పరిస్థితి ఇలా ఉండకూడదని కోరుకుంటున్నారు. ఆమె అందమైన జీవితాన్ని బాలీవుడ్ చెడగొట్టవద్దని అభిమానులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Monalisa : అందం అమ్మాయైతే ఇలాగే వుంటుందేమో! ఈ పిల్లికళ్ళ ముద్దుగుమ్మ స్వస్థలం, ఇతర డిటెయిల్స్
వీడియో Monalisa Viral Girl: Kumbh Mela Beauty Taking Social Media by Storm | Asianet Telugu