MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • కేరళ లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫొటో షూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కేరళ లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫొటో షూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట వెడ్డింగ్ ఫోటోషూట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Bukka Sumabala
Published : Nov 30 2022, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కేరళ : కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి, అందమైన వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వీరు పెళికూతుర్లుగా ముస్తాభైన పొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. బీచ్ లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఇద్దరూ స్కూల్లో చదువుకునే సమయం నుంచి స్నేహితులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ, ఈ జంట ప్రేమ విషయం తెలిసినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో తమ పరువు ఏమౌతుందని ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మేలో ఇద్దరూ కోజికోడ్ పారిపోయారు. ఎల్ జీబీటీక్యూ సొసైటీ ఆశ్రయంలో ఉన్నారు.

35

అయితే, తల్లిదండ్రులు వారి వద్దకు వెళ్లి పెండ్లికి ఒప్పుకున్నానని చెప్పారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళను తీసుకువెళ్లారు. కానీ ఇంటికి వెళ్లాక పెళ్లి కుదరదని మాట మార్చారు. తమ ప్రేమను దక్కించుకునేందుకు నసరీన్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు అనుకూలంగా వచ్చింది. ఇద్దరికీ కలిసి జీవించే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

45

చట్టబద్దమైన చిక్కులు వీడడంతో ల్ జీబీటీక్యూ సొసైటీ వీరికోసం బీచ్ లో వేదిక ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో ఇద్దరు రింగులు మార్చుకుని ఒకటయ్యారు. లెహంగా ధరించి, పూలదండలు వేసుకుని... ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ జంట ఫోటోలను సనరీన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్ లో ఇలాంటి ఫోటో షూట్ లు నిర్వహించడం ఆసక్తిగా ఉందని నసరీన్ చెప్పింది. భవిష్యత్తులో తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని పేర్కొంది.

55

నసరీన్, ఫాతిమా కుటుంబాలు వీళ్లను దూరంగా పెట్టాయి. అయితే ఇంకా ఏమైనా ఫామ్స్ నింపేటప్పుడు తల్లిదండ్రుల పేర్లు ఉపయోగించాల్సి వస్తుందని.. ఇది తమకు ఇబ్బందిగా ఉందని నసరీన్ చెబుతోంది. ఇటీవల తామిద్దరం ఆస్పత్రిలో చేరినప్పుడు హాస్పిటల్ ఫాంలో తండ్రి పేరు అడిగారని చెప్పుకొచ్చింది. స్వలింగ సంపర్క వివాహాలకు భారత్లో ఇంకా చట్టబద్ధత లేదు. సేమ్ సెక్స్ రిలేషన్స్ నేరమని నిబంధనలు ఉన్నప్పటికీ 2018లో వాటిని నిలిపివేశారు. అయితే కొంతమంది స్వలింగ సంపర్కులు మాత్రం వేడుకలు నిర్వహించి.. అధికారికంగా ఒక్కటవుతున్నారు. ఘనంగా వివాహాలు కూడా చేసుకుంటున్నారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Recommended image2
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Recommended image3
రెండు రోజుల్లో ఆయ‌న రాజీనామా చేయ‌క‌పోతే మ‌రో పోరాటం.. కాక్రోచ్ పార్టీ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved