MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Vijay : విజయ్‌ సభలో విషాదం.. కరూరులో తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు

Vijay : విజయ్‌ సభలో విషాదం.. కరూరులో తొక్కిసలాట.. పెద్ద సంఖ్యలో మరణాలు

Vijay Thalapathy karur Rally: ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ సభలో తొక్కిసలాట జరిగింది. కరూరులో నిర్వహించిన సభలో తీవ్ర గందరగోళం, తొక్కిసలాట నేపథ్యంలో డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Sep 27 2025, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijay Thalapathy: టీవీకే విజయ్ కరూరులో సభలో తీవ్ర విషాదం
Image Credit : Asianet News

Vijay Thalapathy: టీవీకే విజయ్ కరూరులో సభలో తీవ్ర విషాదం

తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్‌ దళపతి ప్రజాసభలో తొక్కిసలాట జరిగింది. శనివారం (సెప్టెంబర్ 27, 2025) సాయంత్రం కరూరు జిల్లాలోని వేలుచ్చామిపురం వద్ద విజయ్ నిర్వహించిన సభలో పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. 

ఈ క్రమంలోనే తొక్కిసలాటతో ఊపిరాడక పిల్లలు, మహిళలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మొదట 10 మరణాలు మాత్రమే నిర్ధారించగా, తరువాత అధికారికంగా 29 మంది మృతి చెందినట్లు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

#WATCH | Tamil Nadu: A large number of people attended the campaign of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay in Karur

A stampede-like situation reportedly occurred here. Several people fainted and were taken to a nearby hospital. More details are awaited.… pic.twitter.com/4f2Gyrp0v5

— ANI (@ANI) September 27, 2025

25
కరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు
Image Credit : Asianet News

కరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు

ఈ ఘటనలో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలై కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది, అందులో ఇద్దరు పిల్లలు అత్యంత ఆందోళనకర స్థితిలో ఉన్నారు. తొక్కిసలాట క్రమంలో ఊపిరాడక, పలువురు మూర్ఛపోయి పడిపోయారు. గాయాలపాలైనవారిని అంబులెన్స్‌ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి, సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.

VIDEO | Karur: Former DMK leader V Senthil Balaji rushes to hospital to meet the rally victims.

At least 10 persons, including children, feared dead due to stampede-like situation in Vijay's heavily crowded rally in Karur, Tamil Nadu.

(Full video available on PTI Videos -… pic.twitter.com/hroApRKuMR

— Press Trust of India (@PTI_News) September 27, 2025

Related Articles

Related image1
IND vs PAK : ఆసియా కప్ 2025 ఫైనల్‌ పాకిస్తాన్ తో తలపడే భారత జట్టులో మార్పులు
Related image2
Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు
35
Vijay Thalapathy : ఆసుపత్రుల్లో ఉద్రిక్తత
Image Credit : X

Vijay Thalapathy : ఆసుపత్రుల్లో ఉద్రిక్తత

ఒకేసారి భారీ సంఖ్యలో బాధితులను ఆసుపత్రికి తీసుకురావడంతో కరూరు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారిపోయాయి. తక్కువ మంది వైద్యులు మాత్రమే డ్యూటీలో ఉండటంతో చికిత్సా ఏర్పాట్లు కష్టసాధ్యమయ్యాయి. దీంతో పాటు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా గాయపడిన వారిని చికిత్స కొసం తరలించారు.

45
Vijay Thalapathy karur Rally Tragedy: ఆధికారులకు సీఎం స్టాలిన్ ఆదేశాలు
Image Credit : ANI

Vijay Thalapathy karur Rally Tragedy: ఆధికారులకు సీఎం స్టాలిన్ ఆదేశాలు

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే స్పందించారు. కరూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బాధితులందరికీ అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణియన్, పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్వరన్లను కరూరుకు పంపించారు. అదనంగా ADGPకు ఫోన్ చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

స్టాలిన్ తన అధికారిక ప్రకటనలో, “కరూరులో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. బాధితులకు వెంటనే చికిత్స అందించాలంటూ మంత్రులు, జిల్లా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశాను. ప్రజలు వైద్య సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

55
Vijay Thalapathy karur Rally: విజయ్ సభలో ఏర్పాట్ల లోపాలు
Image Credit : X/Vani Mehrotra

Vijay Thalapathy karur Rally: విజయ్ సభలో ఏర్పాట్ల లోపాలు

ఈ సభ విజయ్ నేను వస్తున్నా ప్రచార యాత్రలో భాగంగా జరిగింది. విజయ్ ఉదయం నమక్కల్‌లో ప్రాచారం చేసిన తర్వాత కరూరులో సభ నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కానీ సరిపడా వైద్య సదుపాయాలు, ప్రథమ చికిత్సా కేంద్రాలు లేకపోవడం, భారీ జనంతో గందరగోళంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

ఈ ఘటన తరువాత ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. కరూరు, సమీప జిల్లాల నుంచి అదనపు వైద్య బృందాలను రప్పించారు. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు, అంబులెన్స్ సేవలు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తమిళ సినిమా
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved