MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK : ఆసియా కప్ 2025 ఫైనల్‌ పాకిస్తాన్ తో తలపడే భారత జట్టులో మార్పులు

IND vs PAK : ఆసియా కప్ 2025 ఫైనల్‌ పాకిస్తాన్ తో తలపడే భారత జట్టులో మార్పులు

Asia Cup 2025 Final India : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ తో భారత జట్టు తలపడనుంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధంగా ఉంది. పాక్ తో తలపడే భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఇప్పుడు తెలసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 27 2025, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ ఫైనల్ : భారత్ vs పాకిస్తాన్
Image Credit : X/BCCI

ఆసియా కప్ ఫైనల్ : భారత్ vs పాకిస్తాన్

ఆసియా కప్ 2025 ఫైనల్ కు పోరుకు సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28, 2025న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ తో టైటిల్ పోరులో తలపడనుంది. ఇది ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మధ్య తొలి ఫైనల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.

ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎలా వుంటుంది అనే చర్చ సాగుతోంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టులో ఉంటాడా? లేదా? అనేది ఆసక్తిని పెంచుతోంది. అలాగే, అర్షదీప్ సింగ్ శుక్రవారం శ్రీలంకతో సూపర్ ఓవర్‌లో చూపిన అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ప్లేయింగ్ 11 ఎంపిక ఆసక్తిని పెంచుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IND vs PAK : భారత జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ & శుభ్‌మన్ గిల్
Image Credit : Insta/indiancricketteam

IND vs PAK : భారత జట్టు ఓపెనర్లు అభిషేక్ శర్మ & శుభ్‌మన్ గిల్

యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతను పాక్ తో జరిగే ఫైనల్‌ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయనున్నాడు. మరోసారి పాక్ బౌలర్లపై తన ధైర్యవంతమైన ఆరంభాన్ని కొనసాగించడానికి చూస్తున్నాడు. అతనితో కలిసి శుభ్‌మన్ గిల్ కూడా ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉన్నాడు. గిల్‌కు ఈ టోర్నమెంట్‌లో మిక్స్ ఫార్మ్ ఉన్నా, ఫైనల్‌లో తనదైన ముద్రవేయాలని చూస్తున్నాడు.

35
IND vs PAK : భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దుబే
Image Credit : Getty

IND vs PAK : భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివం దుబే

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ స్ట్రోక్ ప్లేతో జట్టు నేతృత్వం వహిస్తాడు. ఫైనల్‌లో సూర్యకుమార్, బ్యాట్స్‌మన్‌గా, అలాగే కెప్టెన్‌గా ఆసియా కప్‌ను విజయవంతంగా ముగించాలనుకుంటున్నాడు. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. మరోసారి అద్భుతమైన నాక్ ఆడాలని టార్గెట్ పెట్టుకున్నాడు. వికెట్ కీపర్ సంజూ శాంసన్ నంబర్ 5 లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడనున్నాడు. శివం దుబే హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి రానున్నాడు.

45
IND vs PAK : భారత ఆల్‌రౌండర్స్, స్పిన్నర్లు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్
Image Credit : Getty

IND vs PAK : భారత ఆల్‌రౌండర్స్, స్పిన్నర్లు.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్

హార్దిక్ పాండ్యా గాయంతో తాత్కాలికంగా అనిశ్చితి నెలకొంది. అతను జట్టులోకి వస్తాడా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, కీలకమైన ఫైనల్ మ్యాచ్ కావడంతో పాండ్యా సేవలు కీలకం కానున్నాయి. పెద్దగాయం లేదు కాబట్టి భారత ఆటలో కీలక పాత్ర పోషించగలడు. అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు మరింత బలం అందిస్తాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.

55
IND vs PAK : బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా & అర్షదీప్ సింగ్
Image Credit : ANI

IND vs PAK : బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా & అర్షదీప్ సింగ్

జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకపై సూపర్ 4 మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్నాడు. ఫైనల్‌లో బౌలింగ్ అటాక్‌లో అతనికి ప్రధాన బాధ్యత ఉంటుంది. అర్షదీప్ సింగ్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే, ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోవడం అంత ఈజీకాదు.

పాక్ తో జరిగే ఫైనల్ పోరుకు భారత ప్లేయింగ్ XI:

1. అభిషేక్ శర్మ

2. శుభ్‌మన్ గిల్

3. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)

4. తిలక్ వర్మ

5. సంజూ శాంసన్ (వికెట్ కీపర్)

6. శివం దుబే

7. హార్దిక్ పాండ్యా

8. అక్షర్ పటేల్

9. జస్ప్రీత్ బుమ్రా

10. వరుణ్ చక్రవర్తి

11. కుల్‌దీప్ యాదవ్

ఈ 11 మంది ఆటగాళ్లతో భారత్‌ ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించి మరోసారి ఛాంపియన్ గా నిలవాలని టార్గెట్ పెట్టుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image2
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image3
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Related Stories
Recommended image1
ఆసియా కప్ ఫైనల్ : భారత్‌కు షాక్.. హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఔట్.. ?
Recommended image2
Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన వార్తలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved