- Home
- National
- Financial Changes: వామ్మో...జులైలో ఇన్ని మార్పులు రాబోతున్నాయా...ఏమేమి మారుతున్నాయో మీకు తెలుసా!
Financial Changes: వామ్మో...జులైలో ఇన్ని మార్పులు రాబోతున్నాయా...ఏమేమి మారుతున్నాయో మీకు తెలుసా!
ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఆరంభం కాని క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం కాని వేళల్లో కొన్ని ఆర్థిక నిబంధనల మార్పులు సాధారణంగా చూస్తాం.కానీ ఈసారి జులై నెల నుంచే కొన్ని ప్రధాన మార్పులు అమల్లోకి రానుండటం విశేషం.

ఆధార్ లేకుండా పాన్
ఆధార్ లేకుండా పాన్ ఇక లభ్యం కాదు జులై 1వ తేదీ నుంచి పాన్ కార్డు కోసం ఆధార్ తప్పనిసరి. ఇప్పటివరకు పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటి ఇతర డాక్యుమెంట్లతో పాన్ పొందే అవకాశం ఉండగా, ఇకపై ఆధార్ నంబర్ ఇవ్వడం, ధృవీకరించడం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే పాన్ ఉన్నవారు కూడా ఆధార్‌తో లింక్ చేయాల్సిందే. లింక్ చేయని పాన్ యాక్టివ్‌గా ఉండదు.
రైల్వే తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు
జులై 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్‌కి ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. అక్రమ బుకింగులను అడ్డుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 15 నుంచి ఓటీపీ ఆధారిత ధృవీకరణ కూడా అనివార్యం. ఇకపై ఏజెంట్లు టికెట్ బుకింగ్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే బుక్ చేయగలరు. ఉదాహరణకు, ఏసీ టికెట్లకు 10:30 తర్వాతే, నాన్-ఏసీ టికెట్లకు 11:30 తర్వాతే బుకింగ్ మొదలవుతుంది
రైల్వే టికెట్ ధరలు
రైల్వే టికెట్ ధరలు పెరుగుతాయి జులై 1 నుంచి మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టికెట్ల ధరలు పెరుగుతున్నాయి. నాన్-ఏసీ తరగతికి ప్రతి కిలోమీటర్‌కి 1 పైసా, ఏసీ తరగతికి 2 పైసాల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణాల్లో సెకండ్ క్లాస్ టికెట్ల ధరలు కూడా పెరుగుతాయి.
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
మారుతున్నాయి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జులై 1 నుంచి క్రెడిట్ కార్డ్ ఛార్జీలను సవరిస్తోంది.
రూ.10,000 కంటే ఎక్కువ వాలెట్‌లో జమ చేస్తే 1% ఫీజు
రూ.50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లులకు 1% ఫీజు
గేమింగ్, ఇంటి అద్దె, విద్యా ఫీజులు వంటి లావాదేవీలకూ అదే ఛార్జీలు
ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలపై ఇకపై రివార్డ్లు ఉండవు
ఎంజీ కార్ల ధరలు
ఎంజీ కార్ల ధరలు పెరుగుతాయి జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ జూలై 1 నుంచి తమ కార్ల ధరలను సగటున 1.5% వరకు పెంచుతోంది. ముడిపదార్థాల ధరల పెంపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇది కామెట్, హెక్టర్, అస్టర్, గ్లోస్టర్ వంటి అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.
ఐటీఆర్ ఫైలింగ్
ఐటీఆర్ ఫైలింగ్‌కు అదనపు సమయం కేంద్ర ప్రభుత్వం ఈసారి ఐటీఆర్ ఫారాల్లో మార్పుల నేపథ్యంలో ఫైలింగ్ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. మునుపటి గడువుతో పోలిస్తే 45 రోజులు అదనంగా లభిస్తున్నాయి. అయినప్పటికీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నవారు ముందుగానే ఫైల్ చేయడం మంచిది.
జులై నెల బ్యాంకు పని దినాలు
ఈ నెలలో ప్రధాన పండుగలు లేకపోవడంతో, బ్యాంకులు సాధారణంగా అన్ని వారాలు రెండవ, నాల్గవ శనివారాలు , ప్రతి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో యథావిధిగా పని చేస్తాయి. ప్రజలు తమ లావాదేవీలను ఏ ఆలస్యం లేకుండా నిర్వహించుకోవచ్చు.