July Bank Holidays: జూలైలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే...ఏకంగా 14 రోజులు బంద్..ముందే మీ పనులు ప్లాన్ చేస్కోండి..

బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా, అయితే జూలై నెలలో ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. తద్వారా మీరు బ్యాంకింగ్ పనులను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాదు సెలవు ముందే తెలుసుకుంటే మీ సమయం వృధా కాకుండా కాపాడుకోవచ్చు.

July Bank Holidays This is the list of bank holidays in July 14 days bandh plan your work in advance MKA

జూలై నెలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలలో బ్యాంకు సెలవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు.  ఆర్బిఐ విడుదల చేసిన సెలవుల జాబితాను అనుసరిస్తూ ఉంటాయి. జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇందులో  ఐదు ఆదివారాలు, అలాగే రెండవ, నాలుగవ శనివారం బ్యాంకులకు  సెలవు. అయితే పైన పేర్కొన్నటువంటి 14 సెలవుల్లో  చాలావరకు ఆయా రాష్ట్రాలకు పరిమితమై ఉంటాయి. స్థానిక పండుగలు అనుసరించి ఈ సెలవులను ఇస్తూ ఉంటారు.

కావున ఆయా పర్వదినం రోజున ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తారు. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ సేవలు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో చాలావరకు బ్యాంకు వెళ్లకుండానే చాలామంది చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ యాప్స్ కారణంగా బ్యాంకింగ్ సేవలు మరింత సులభం అయిపోయాయి.  ఇదిలా ఉంటే కొన్ని అత్యవసర సమయాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన పని పడటం సహజమే.  అయితే మీకు బ్యాంకు పనులు మాత్రం ఉంటే ఈ సెలవులను చూసుకొని ముందుగానే షెడ్యూల్ చేసుకుంటే మంచిది లేకపోతే మీరు బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడాల్సి ఉంటుంది కావున ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో మీ ప్రాంతంలో సెలవు ఉందో లేదో తెలుసుకోండి. 

జూలై నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఇదే..

జూలై 2, 2023: ఆదివారం
జూలై 5, 2023: గురు హరగోవింద్ సింగ్ జయంతి- (జమ్ము, శ్రీనగర్‌లో మాత్రమే)
జూలై 6, 2023: మిజో హ్మీచే ఇన్సుయిహ్‌ఖామ్ పాల్ (MHIP) డే- (మిజోరంలో మాత్రమే)
జూలై 8, 2023: రెండవ శనివారం
జూలై 9, 2023: ఆదివారం
జూలై 11, 2023: కేర్ పూజ (త్రిపురలో మాత్రమే)
జూలై 13, 2023: భాను జయంతి (సిక్కింలో మాత్రమే)
జూలై 16, 2023: ఆదివారం
జూలై 17, 2023: యు టిరోట్ సింగ్ డే (మేఘాలయలో మాత్రమే)
జూలై 21, 2023: ద్రుక్పా త్షే-జి (సిక్కింలో మాత్రమే)
జూలై 22, 2023: నాల్గవ శనివారం
జూలై 23, 2023: ఆదివారం
జూలై 28, 2023: అషూరా (జమ్మూ, కాశ్మీర్‌లో మాత్రమే)
జూలై 29, 2023: ముహర్రం
జూలై 30, 2023: ఆదివారం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios