MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Jayalalitha Assets: హైదరాబాద్‍లో జయలలిత ఆస్తులు ఎవరు చూస్తున్నారు?

Jayalalitha Assets: హైదరాబాద్‍లో జయలలిత ఆస్తులు ఎవరు చూస్తున్నారు?

Jayalalitha Assets: దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయినా...ఆమె ఆస్తుల గొడవ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. దానికి సంబంధించిన విషయంపై ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరో ఆస్తి వివాదం బయటపడింది. 

2 Min read
Author : Nandini Arava
Published : Apr 02 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జయలలిత ఆస్తులు సీజ్
Image Credit : chatgpt

జయలలిత ఆస్తులు సీజ్

దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత చనిపోయినా...ఆమె ఆస్తుల గొడవ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. దానికి సంబంధించిన విషయంపై ఏదో ఒక్క రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ మరో ఆస్తి వివాదం బయటపడింది.

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జయలలిత పేరు మీద ఉన్న భవనాన్ని GHMC అధికారులు జప్తు చేశారు. ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి చెల్లించకపోవడంతో సీల్ చేశారు. గతంలో జయలలితకు సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.83 లక్షలు బకాయిలు ఉండిపోయినట్లు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ మాల్యాకు భవనం లీజుకు
Image Credit : Getty

విజయ్ మాల్యాకు భవనం లీజుకు

అయితే ఇది నివాస భవనమే అయినా...విజయ్ మాల్యాకు చెందిన కంపెనీకి లీజుకివ్వడంతో క మర్షియల్ కేటగిరిలోకి మారింది. కానీ ఆ కంపెనీ 2017లోనే భవనాన్ని ఖాళీ చేసేసింది. మొత్తం కోటి 60 లక్షలున్న ఆస్తి పన్నును...వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం ప్రకారం వడ్డీ మాఫీ చేసి ₹83 లక్షలకు తగ్గింది. 

35
ఓనర్స్ ఎవరూ లేరు..అంతా కేర్ టేకర్సే
Image Credit : Getty

ఓనర్స్ ఎవరూ లేరు..అంతా కేర్ టేకర్సే

తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఇంటిని ఇలా సీజ్ చేయడం తమిళ ప్రజలను షాక్‌కు గురిచేసింది. అయితే సాయంత్రానికి ఇంటిని సీజ్ తీసేశారు. టైం ఇస్తే త్వరలో కడతామని బిల్డింగ్ కేర్ టేకర్ చెబుతున్నారు. ఈ ఇంటికి ఓనర్స్ ఎవరూ లేరని హైదరాబాద్ శ్రీనగర్ బిల్డింగ్ కేర్ టేకర్ తెలిపారు. ఉన్నవాళ్లు ఎవరైనా సరే దీపక్, దీప, శశికళ అయినా కూడా కేర్ టేకర్స్ మాత్రమేనని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు తానే చూస్తానని ఆయన తెలిపారు. 

45
వీలునామా రాయకపోవడంతో అసలు చిక్కు
Image Credit : Getty

వీలునామా రాయకపోవడంతో అసలు చిక్కు

జయలలిత తన ఆస్తులపై ఎలాంటి వీలునామా రాయకపోవడంతో అసలు చిక్కొచ్చింది. అయితే జయలలిత మేనల్లుడు, మేనకోడలు దీపక్, దీపలను చట్టబద్ధ వారసులుగా కోర్టు తీర్పిచ్చింది. కానీ ఆస్తి బదిలీ ప్రక్రియ జరగలేదు. దానికితోటు ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. భవనం సీజ్ చేసిన విషయం తెలియడంతో వారసులు స్పందించి బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పడంతో భవనానికి వేసిన సీల్ తొలగించారు. అయితే మొత్తం మీద హైదరాబాద్ లో జయలలితకు ఈ పెద్ద భవనంతో పాటు జీడిమెట్లలో ద్రాక్షతోట మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

55
జయలలిత ఆస్తుల విలువ రూ.4వేల కోట్లకుపైనే!
Image Credit : Asianet News

జయలలిత ఆస్తుల విలువ రూ.4వేల కోట్లకుపైనే!

మరోవైపు, జయలలిత మొత్తం ఆస్తుల విలువపై కూడా అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించిన ఆస్తులు సుమారు రూ.113 కోట్ల వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇవి వేల కోట్లకు చేరవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఉన్న ఆస్తుల విలువ భారీగా పెరగడంతో మొత్తం విలువ రూ.4000 కోట్లకు పైగా ఉండొచ్చన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారికంగా నిర్ధారించబడిన సంఖ్యలు కావు.

మొత్తంగా చూస్తే, జయలలిత ఆస్తులపై స్పష్టత లేకపోవడం, వారసత్వ బదిలీ పూర్తికాకపోవడం వల్ల ఇలాంటి వివాదాలు తరచూ బయటపడుతున్నాయి. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం రావాలంటే చట్టపరమైన ప్రక్రియలు వేగంగా పూర్తి కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అప్పటివరకు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?
Recommended image2
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved