MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?

SIP Investment: రూ. 21,250తో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. 8-4-3 సీక్రెట్ రూల్ తెలుసా?

SIP Investment: నెలకు రూ. 21,250 ఎస్‌ఐపీ ఇన్వెస్ట్‌మెంట్‌తో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఎలా కోటి సంపాదించవచ్చో 8-4-3 కాంపౌండింగ్ రూల్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 02 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mutual Funds : మారుతున్న కలలు.. సులువైన మార్గాలు
Image Credit : Gemini

Mutual Funds : మారుతున్న కలలు.. సులువైన మార్గాలు

ఒకప్పుడు కోటీశ్వరుడు అవ్వడం అంటే కేవలం భారీగా సంపాదించే వాళ్లకు మాత్రమే సాధ్యమయ్యే ఒక పెద్ద కల. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మిడిల్ క్లాస్ వేతన జీవులు కూడా పక్కా ప్లానింగ్‌తో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా కోటీశ్వరులు అయిపోవచ్చు. దీనికి పెద్దగా రిస్క్ కూడా అవసరం లేదు.

మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP), కాంపౌండింగ్ పవర్ తోడుంటే చాలు, అనుకున్న టార్గెట్‌ను సులువుగా రీచ్ అవ్వొచ్చు. ఫైనాన్షియల్ ప్లానర్లు ఎక్కువగా రికమండ్ చేసే ‘8-4-3 కాంపౌండింగ్ రూల్’ దీనికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏంటి ఈ 8-4-3 కాంపౌండింగ్ రూల్?
Image Credit : Gemini

ఏంటి ఈ 8-4-3 కాంపౌండింగ్ రూల్?

ఈ 8-4-3 రూల్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 15 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా డిసిప్లిన్‌తో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలను ఇది చూపిస్తుంది. దీర్ఘకాలంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ ఇస్తాయనే అంచనాతో ఈ రూల్ పనిచేస్తుంది.

మార్కెట్ ఒడిదొడుకుల వల్ల రిటర్న్స్ మారే ఛాన్స్ ఉన్నప్పటికీ, లాంగ్ టర్మ్‌లో 12 శాతం రిటర్న్స్ అనేది రీజనబుల్ అంచనా. మీ ఇన్వెస్ట్‌మెంట్ కార్పస్ పెరిగే కొద్దీ, అది ఎంత వేగంగా డబుల్ అవుతుందో ఈ రూల్ చాలా క్లియర్ గా వివరిస్తుంది.

Related Articles

Related image1
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Related image2
8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50% పెరిగే ఛాన్స్ !
36
మొదటి మెట్టు: 8 ఏళ్ల ప్రయాణం
Image Credit : Gemini

మొదటి మెట్టు: 8 ఏళ్ల ప్రయాణం

రూ. 1 కోటి టార్గెట్‌ను రీచ్ అవ్వడానికి మీరు నెలకు రూ. 21,250 ఎస్‌ఐపీ స్టార్ట్ చేయాలి. 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తాయని అనుకుంటే, మొదటి 8 ఏళ్లలో మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ దాదాపు రూ. 34 లక్షలకు చేరుకుంటుంది. ఈ 8 ఏళ్లలో (96 నెలలు) మీరు సొంతంగా ఇన్వెస్ట్ చేసిన అసలు మొత్తం రూ. 20.4 లక్షలు మాత్రమే. మిగిలిన అమౌంట్ అంతా మీకు కాంపౌండింగ్ ద్వారా వచ్చిన లాభం. అంటే మీ డబ్బు మెల్లమెల్లగా పెరగడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది.

46
స్పీడ్ అందుకునే సమయం: తదుపరి 4 ఏళ్లు
Image Credit : Gemini

స్పీడ్ అందుకునే సమయం: తదుపరి 4 ఏళ్లు

ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఈ 8-4-3 రూల్‌లో తర్వాతి నంబర్ '4'. అంటే 8 ఏళ్ల తర్వాత, మరో 4 ఏళ్లు (మొత్తం 12 ఏళ్లు) ఇన్వెస్ట్‌మెంట్‌ను అలాగే కంటిన్యూ చేస్తే, మీ ఫండ్ వాల్యూ ఏకంగా రూ. 67.8 లక్షల నుండి రూ. 68.5 లక్షల వరకు పెరుగుతుంది. గమనించారా? మొదటి రూ. 34 లక్షలు సాధించడానికి మీకు 8 ఏళ్లు పడితే, ఆ అమౌంట్ డబుల్ అవ్వడానికి తర్వాతి కేవలం 4 ఏళ్లు మాత్రమే పట్టింది. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే.

56
లక్ష్యాన్ని చేరే చివరి 3 ఏళ్లు
Image Credit : Getty

లక్ష్యాన్ని చేరే చివరి 3 ఏళ్లు

రూల్‌లో చివరి నంబర్ '3'. 12 ఏళ్లు పూర్తయిన తర్వాత, కేవలం మరో 3 ఏళ్లు (మొత్తం 15 ఏళ్లు) మీ ఎస్‌ఐపీని కొనసాగిస్తే చాలు. మీ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఏకంగా రూ. 1.06 కోట్లను దాటేస్తుంది. మీరు 15 ఏళ్లలో (180 నెలలు) ఇన్వెస్ట్ చేసిన మొత్తం కేవలం రూ. 38.25 లక్షలు మాత్రమే. కానీ కాంపౌండింగ్ పుణ్యమా అని మీకు వచ్చిన లాభం అక్షరాలా రూ. 68 లక్షలు. స్థిరంగా 12 శాతం రిటర్న్స్, మంత్లీ కాంపౌండింగ్‌ను బేస్ చేసుకుని లెక్కించిన స్టాండర్డ్ కాలిక్యులేషన్ ఇది.

66
టైమింగ్ వద్దు.. కన్సిస్టెన్సీ ముఖ్యం
Image Credit : Meta AI

టైమింగ్ వద్దు.. కన్సిస్టెన్సీ ముఖ్యం

ఈ 8-4-3 రూల్ ఇచ్చే అతిపెద్ద మెసేజ్ ఏంటంటే, మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని టైమ్ చూసి ఇన్వెస్ట్ చేయడం కంటే, స్థిరంగా ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. ఎస్‌ఐపీల ద్వారా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ దక్కుతుంది.

మార్కెట్ పడినా, లేచినా మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గా ముందుకు వెళ్తుంది. జీతం తీసుకునే ఉద్యోగులకు నెలకు రూ. 21,250 ఇన్వెస్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ అంత అమౌంట్ లేకపోయినా తక్కువతో స్టార్ట్ చేసి, జీతం పెరిగే కొద్దీ ఎస్‌ఐపీ పెంచుకుంటూ పోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Savings Schemes: రూ.1 లక్ష పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో ఎంత వస్తుంది? ఏ పథకంలో ఎంతంటే.?
Recommended image2
Best EV Cars: మీ బడ్జెట్లో వచ్చే బెస్ట్ ఈవీ కార్లు.. భవిష్యత్తంతా ఈ కార్లదే
Recommended image3
Amazon Offers On Waterproof Bags: అమెజాన్‌లో బెస్ట్ వాటర్‌ప్రూఫ్ బ్యాగులపై భారీ ఆఫర్లు ఇవే !
Related Stories
Recommended image1
Telangana Tourism: హైదరాబాద్‌ కు దగ్గరలోనే.. వర్షాకాలంలో ఈ 6 ప్లేసెస్ కెళ్తే కిక్కే వేరప్పా.. !
Recommended image2
8th Pay Commission: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జీతాలు 50% పెరిగే ఛాన్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved