MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • IRCTC South India Temple Run: ఒక్క ప్యాకేజీ.. 5 పుణ్యక్షేత్రాలు.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ

IRCTC South India Temple Run: ఒక్క ప్యాకేజీ.. 5 పుణ్యక్షేత్రాలు.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ

IRCTC South India Temple Run: హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ 7 రోజుల టూర్‌లో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు. ఆ వివరాలు మీకోసం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2026, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఒక్క టికెట్‌తో సౌత్ ఇండియాలోని టాప్ టెంపుల్స్ చూసేయండి
Image Credit : gemini

ఒక్క టికెట్‌తో సౌత్ ఇండియాలోని టాప్ టెంపుల్స్ చూసేయండి

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' (South India Temple Run) పేరుతో ఈ ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. కేరళ, తమిళనాడులోని మోస్ట్ పాపులర్ టెంపుల్స్ చూసేందుకు ఇదొక బెస్ట్ ఛాన్స్. ఈ ప్యాకేజీ కోడ్ 'SHA23'. కంఫర్ట్ క్లాస్ కేటగిరీలో ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. 2026 ఆగస్టు 16న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు సాగే ఈ డివైన్ జర్నీలో ఏమేం చూడొచ్చు, ఖర్చులు ఎంత అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
షెడ్యూల్, ఇతర డీటెయిల్స్ ఇవే
Image Credit : Asianet News

షెడ్యూల్, ఇతర డీటెయిల్స్ ఇవే

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భక్తులు విమానంలో ప్రయాణిస్తారు. ఆగస్టు 16న ఉదయం 06:10 గంటలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఉదయం 07:55 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఆగస్టు 22న సాయంత్రం 17:10 గంటలకు మదురై ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కితే, రాత్రి 18:45 గంటలకు హైదరాబాద్ ల్యాండ్ అవుతారు. మొత్తం గ్రూప్ సైజ్ 29 మంది మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రయాణం చాలా కంఫర్టబుల్‌గా సాగుతుంది.

37
డే వైజ్ టూర్ వివరాలు ఇవే
Image Credit : nextstopwonderss Instagram

డే వైజ్ టూర్ వివరాలు ఇవే

  • డే 1: హైదరాబాద్ నుంచి బయలుదేరి త్రివేండ్రం చేరుకుంటారు. హోటల్‌కు పికప్ ఉంటుంది. హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత పూవర్ ఐలాండ్, అజిమల శివ టెంపుల్ విజిట్ ఉంటుంది. రాత్రికి త్రివేండ్రంలోనే డిన్నర్, స్టే ఉంటుంది.
  • డే 2: తెల్లవారుజామునే ఫేమస్ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెకౌట్ చేసి కన్యాకుమారికి బయలుదేరుతారు. మధ్యాహ్నానికి కన్యాకుమారి చేరుకుని సన్‌సెట్ పాయింట్ చూస్తారు. రాత్రికి కన్యాకుమారిలో స్టే ఉంటుంది.
  • డే 3: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ స్టాచ్యూ సందర్శిస్తారు. ఆ తర్వాత రామేశ్వరానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రికి రామేశ్వరం చేరుకుని అక్కడ బస చేస్తారు.
  • డే 4: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేశాక రామేశ్వరంలోని లోకల్ టెంపుల్స్, ధనుష్కోడి విజిట్ ఉంటుంది. అయితే ఇక్కడో చిన్న కండిషన్ ఉంది. రామేశ్వరం లోపలికి పెద్ద బస్సులను అనుమతించరు, అందుకే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సొంత ఖర్చులతోనే ఈ లోకల్ టెంపుల్స్ చూడాల్సి ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలోనే స్టే చేస్తారు.
  • డే 5: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అబ్దుల్ కలాం మెమోరియల్ విజిట్ ఉంటుంది. అనంతరం తంజావూరుకు బయలుదేరి ప్రసిద్ధ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆపై తిరుచిరాపల్లి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • డే 6: తెల్లవారుజామునే శ్రీరంగం ఆలయ దర్శనం ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ చెకౌట్ అయ్యాక మదురైకి బయలుదేరుతారు. సాయంత్రం టైంలో మదురైలో షాపింగ్ కోసం ఫ్రీ టైం ఇస్తారు. రాత్రికి మదురైలోనే స్టే ఉంటుంది.
  • డే 7: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా మదురై ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. అక్కడ ఫ్లైట్ ఎక్కి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ హ్యాపీగా ముగుస్తుంది.
47
ప్యాకేజీ ధరల వివరాలు ఇవే
Image Credit : Asianet News

ప్యాకేజీ ధరల వివరాలు ఇవే

ఈ టూర్ ప్యాకేజీలో మీరు సెలెక్ట్ చేసుకునే ఆక్యుపెన్సీని బట్టి రేట్లు మారుతుంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

• సింగిల్ ఆక్యుపెన్సీ (ఒక్కరే రూమ్ తీసుకుంటే): రూ. 52,550/-

• ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే: రూ. 39,850/-

• ముగ్గురు షేర్ చేసుకుంటే: రూ. 37,700/-

• పిల్లలు (5-11 ఏళ్లు, ఎక్స్‌ట్రా బెడ్‌తో): రూ. 33,000/-

• పిల్లలు (5-11 ఏళ్లు, బెడ్ లేకుండా): రూ. 28,700/-

• చిన్నపిల్లలు (2-4 ఏళ్లు, బెడ్ లేకుండా): రూ. 21,400/-

57
ప్యాకేజీలో ఏమున్నాయి? ఏవి లేవు?
Image Credit : AI

ప్యాకేజీలో ఏమున్నాయి? ఏవి లేవు?

ప్యాకేజీలో కలిపి ఉన్నవి..

హైదరాబాద్ టు త్రివేండ్రం, మదురై టు హైదరాబాద్ ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్లు ఉంటాయి. హోటల్ వసతి (1 నైట్ త్రివేండ్రం, 1 నైట్ కన్యాకుమారి, 2 నైట్స్ రామేశ్వరం, 1 నైట్ త్రిచి, 1 నైట్ మదురై) లభిస్తుంది. 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్లు ప్యాకేజీలోనే ఇస్తారు. ఐటీనరరీ ప్రకారం సైట్‌సీయింగ్ కోసం ఏసీ బస్సు అరేంజ్ చేస్తారు.

ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సర్వీసెస్, అన్ని రకాల ట్యాక్సులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. త్రివేండ్రంలో కేటీడీసీ చైత్రం లేదా సిమిలర్, కన్యాకుమారిలో విశ్వ గ్రాండ్, రామేశ్వరంలో హోటల్ వినాయక, త్రిచిలో బ్రీజ్ రెసిడెన్సీ, మదురైలో టీటీడీసీ యూనిట్ 2 లేదా వాటికి సమానమైన హోటళ్లలో వసతి కల్పిస్తారు. మిగతా ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.

67
రూల్స్ అండ్ క్యాన్సిలేషన్ పాలసీ
Image Credit : Asianet News

రూల్స్ అండ్ క్యాన్సిలేషన్ పాలసీ

ఈ టూర్ బుక్ చేసుకునే వారు కొన్ని రూల్స్ గుర్తుంచుకోవాలి. 75 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా ఒక యంగ్ ఫ్యామిలీ మెంబర్ లేదా ఎస్కార్ట్‌తో రావాలి. ఇది గ్రూప్ టూర్ కాబట్టి పర్సనల్ సర్వీసెస్ కుదరవు, గ్రూప్‌తో కలిసి నడుచుకోవాలి. ఎయిర్‌పోర్ట్‌కు ఫ్లైట్ టైమ్ కంటే 2 గంటల ముందే రీచ్ అవ్వాలి. లో కాస్ట్ క్యారియర్ ఫ్లైట్లలో ఫుడ్ ఛార్జబుల్ ఉంటుంది. హోటల్ చెకిన్ టైమ్ మధ్యాహ్నం 14:00 గంటలు, చెకౌట్ టైమ్ ఉదయం 11:00 గంటలు. ట్రిపుల్ షేరింగ్ తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్‌తో పాటు ఫ్లోర్‌పై ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ ఇస్తారు.

77
క్యాన్సిలేషన్ ఛార్జీలు
Image Credit : Gemini

క్యాన్సిలేషన్ ఛార్జీలు

ట్రిప్ ప్రారంభానికి 21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్‌లో 30% కట్ అవుతుంది. 15 నుండి 21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 55% డిడక్ట్ అవుతుంది. 8 నుండి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 80% డిడక్ట్ అవుతుంది. 7 రోజులు లేదా అంతకంటే తక్కువ టైమ్ ఉండి క్యాన్సిల్ చేస్తే లేదా రాకపోతే 100% అమౌంట్ కట్ అవుతుంది, పైసా తిరిగి రాదు.

బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్, 3వ ఫ్లోర్, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా, ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. లేదా మొబైల్ నంబర్: 8287932229, ఈమెయిల్: bsashidhar5605@irctc.com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ (9281030714), తిరుపతి రైల్వే స్టేషన్ (9281495853) ఇన్ఫర్మేషన్ సెంటర్లలోనూ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image2
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Recommended image3
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?
Related Stories
Recommended image1
Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
Recommended image2
Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved