IRCTC సేవలకు అంతరాయం : నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదు.
IRCTC Down
IRCTC : భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ సర్వీస్ లో ఇబ్బందులు తలెత్తాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ చేపట్టే ఈ టికెటింగ్ సర్వీస్ వెబ్ సైట్, యాప్ ఇవాళ (సోమవారం) ఉదయం పనిచేయడం లేదు. అయితే మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతున్నందున ఈ అంతరాయం ఏర్పడినట్లు ఐఆర్ సిటిసి ప్రకటించింది.
IRCTC
''నిర్వహణ వ్యవహారాల్లో భాగంగా e-ticketing(ఈ-టికెటింగ్) సర్వీసులు నిలిచిపోయాయి. మరో గంటసేపటి వరకు ఈ సేవలు అందుబాటులో వుండవు. కాబట్టి టికెట్ బుకింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నవారు తర్వాత ప్రయత్నించండి. టికెట్ రద్దు కోసం కస్టమర్ కేర్ నంబర్ 14646, 0755-6610661 లేదా 0755-4090600 కు పోన్ చేయండి. లేదా etickets@irctc.co.in కు మెయిల్ చేయండి' అని ఐఆర్‌సీటీసీ సూచించింది.
IRCTC
ఇండియన్ రైల్వే సూపర్ యాప్ :
భారతీయ రైల్వే వినియోగదారులకు మరింత మెరుగైన సేవల కోసం 'సూపర్ యాప్' ను తీసుకువస్తోంది. ఈ ఆల్ ఇన్ వన్ యాప్ ను ఈ డిసెంబర్ లోనే తీసుకువచ్చే ప్రయత్నాల్లో వుందట. టికెట్ బుకింగ్స్ తో పాటు ప్లాట్ ఫారం పాస్ ల జారీ, ట్రైన్ ట్రాకింగ్ వంటి సేవలన్నింటిని ఈ ఒక్క యాప్ ద్వారా అందించనుంది రైల్వే.
ఈ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) డెవలప్ చేస్తోంది. ఈ సూపర్ యాప్ ఐఆర్‌సీటీసీ మాదిరిగానే పనిచేస్తూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించనుందని అధికారులు చెబుతున్నారు.