MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !

IRCTC Char Dham Yatra: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. ఈ సూపర్ ప్యాకేజీ యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 04 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర: పుణ్యక్షేత్రాల దర్శనానికి అదిరిపోయే ప్యాకేజీ
Image Credit : Gemini

ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర: పుణ్యక్షేత్రాల దర్శనానికి అదిరిపోయే ప్యాకేజీ

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని దేవభూమిలో ఉన్న చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకోవడం జీవిత కాల స్వప్నంగా భావిస్తారు. భక్తుల కలలను నిజం చేస్తూ, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టూరిజం ఒక అద్భుతమైన చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. చాలా తక్కువ బడ్జెట్‌లోనే, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ను ప్లాన్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చార్ ధామ్ విశేషాలు ఇవే.. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే?
Image Credit : Istock

చార్ ధామ్ విశేషాలు ఇవే.. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే?

ఈ ప్యాకేజీలో హిమాలయాల్లోని నాలుగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలను దర్శించుకోవచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం, చార్ ధామ్ యాత్రను క్లాక్‌వైజ్ అంటే ప్రదక్షిణ దిశలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

• యమునోత్రి: హిమాలయాల్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం నుంచే చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక్కడి యమునోత్రి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

• గంగోత్రి: గంగా దేవి కొలువైన ఈ క్షేత్రం ఉత్తర భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.

• కేదార్‌నాథ్: గార్వాల్ హిమాలయాల్లో శివుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన కొండల మధ్య ఉండే ఈ ఆలయాన్ని ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో ప్రత్యేకంగా సందర్శించవచ్చు.

• బద్రీనాథ్: ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఈ ఆలయంలో మహావిష్ణువు కోలువై ఉన్నారు. గార్వాల్ కొండల్లో ఉన్న ఈ క్షేత్ర దర్శనంతో యాత్ర ముగుస్తుంది.

Related Articles

Related image1
Naga Durga Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ బోనాల పాట
Related image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
36
ప్యాకేజీ ధర, ప్రయాణ వివరాలు
Image Credit : stockphoto

ప్యాకేజీ ధర, ప్రయాణ వివరాలు

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ ఢిల్లీ లేదా హరిద్వార్ వంటి ప్రధాన ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ మొత్తం 11 నుండి 12 రోజుల పాటు సాగుతుంది. ఇందులో బడ్జెట్ కు అనుగుణంగా విధిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రయాణం పూర్తిగా రోడ్డు మార్గం ద్వారానే సాగుతుంది. కొండ ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఏసీ లేదా నాన్ ఏసీ వాహనాల్లో గ్రూప్ టూర్‌గా ప్రయాణికులను తీసుకెళ్తారు. బడ్జెట్ నుండి లగ్జరీ వరకు కస్టమర్ల ఛాయిస్ ప్రకారం హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి.

46
ప్యాకేజీలో ఏమేం లభిస్తాయి?
Image Credit : our own

ప్యాకేజీలో ఏమేం లభిస్తాయి?

ఈ ఆల్ ఇన్‌క్లూసివ్ ప్యాకేజీలో భక్తుల సౌకర్యం కోసం ఐఆర్‌సీటీసీ అన్ని ఏర్పాట్లను చూసుకుంటుంది. ప్యాకేజీలో భాగంగా లభించే ముఖ్యమైన సేవలు ఇవే..

• ట్విన్ లేదా ట్రిపుల్ షేరింగ్ పద్ధతిలో హోటల్ వసతి.

• యాత్ర మొత్తం స్వచ్ఛమైన శాకాహార భోజనం.

• స్థానిక ప్రాంతాల సందర్శన, ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ.

• ప్రయాణికుల రక్షణ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్.

• యాత్రలో సహాయం చేయడానికి ప్రత్యేక టూర్ ఎస్కార్ట్స్ / గైడ్లు.

• ట్రాన్స్‌పరెంట్ ట్రాన్సాక్షన్స్, 24/7 కస్టమర్ సర్వీస్ సపోర్ట్.

56
బుకింగ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్
Image Credit : ANI

బుకింగ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్

ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. మీరు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక పోర్టల్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై, శీతాకాలం కంటే ముందే ముగుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే స్టార్ అయింది. 

ఈ టూర్ చాలా కష్టమైన కొండ ప్రాంతాల్లో, ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అందుకే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను ఈ యాత్రకు తీసుకురావద్దని ఐఆర్‌సీటీసీ సూచిస్తోంది. అలాగే, కేదార్‌నాథ్ వెళ్లడానికి హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే, దాన్ని ప్యాకేజీ కాకుండా విడిగా బుక్ చేసుకుని సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

66
బుకింగ్ ప్రాసెస్ ఏమిటి?
Image Credit : our own

బుకింగ్ ప్రాసెస్ ఏమిటి?

చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఐఆర్‌సీటీసీ టూరిజం అత్యంత నమ్మకమైన పార్ట్‌నర్‌గా నిలుస్తుంది. మీరు కూడా ఈ పవిత్ర యాత్రను ప్లాన్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com లేదా వారి అఫీషియల్ మొబైల్ యాప్‌ని విజిట్ చేయవచ్చు. అక్కడ మీ బడ్జెట్‌కు సరిపోయే ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుని ఈజీగా బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి హిమాలయాల అందాల మధ్య ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకుంటే ఇప్పటికే మొదలైన చార్ ధామ్ యాత్ర సీట్లను రిజర్వ్ చేసుకోండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Recommended image2
ఇంద్రభవనాన్ని తలపించే నిర్మాణం.. నితా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో ఎన్ని అద్భుతాలో
Recommended image3
Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
Related Stories
Recommended image1
Naga Durga Song: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ బోనాల పాట
Recommended image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved