MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • దేశంలోని ఈ తీరప్రాంత నగరాలు భవిష్యత్ లో మునిగిపోతాయా? వైజాగ్ పరిస్థితి ఏంటి?

దేశంలోని ఈ తీరప్రాంత నగరాలు భవిష్యత్ లో మునిగిపోతాయా? వైజాగ్ పరిస్థితి ఏంటి?

ముంబై నుండి సూరత్ వరకు భారత్ లోని అనేక నగరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. IPCC తన నివేదికలో ఈ నగరాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో వైజాగ్ వుందా? లేదా? 

2 Min read
Arun Kumar P
Published : Sep 02 2024, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Mumbai

Mumbai

తీరప్రాంత నగరమైన ముంబై సముద్ర మట్టం పెరుగుదల వల్ల తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం పెరుగుతూ వస్తోంది. ఇదే స్థాయిలో అరేబియా సముద్రమట్టం పెరుగుతూ ఉంటే 2050 నాటికి ముంబై నగరంలోని అధికభాగం నీట మునిగిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇండియాలోని సముద్రతీర నగరాలకు భవిష్యత్ లో ప్రమాదం పొంచివవుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) తెలిపింది. ఇలా ప్రమాదం పొంచివున్న నగరాల్లో ముంబైతో పాటు మరికొన్ని తీరప్రాంతాలు వున్నాయి. 
 

 

26
Kolkata

Kolkata

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా కూడా సముద్ర మట్టానికి దగ్గరగా ఉంది. అలాగే అనేక నదులు ఈ నగరాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ నగరానికి సముద్ర మట్టం పెరుగుదల, నదుల వరదల కాారణంగా ప్రమాదం ఉంది. సుందర్‌బన్స్, కోల్‌కతా చుట్టూ ఉన్న ఇతర దిగువ ప్రాంతాలు తరచుగా వరదలకు గురవుతుంటాయి... ఇదే పరిస్థితి కొనసాగితే కోల్‌కతాలోని అధికభాగం నీట మునిగిపోతుందని హెచ్చరించారు. .

36
Chennai

Chennai

చెన్నై కూడా సముద్ర మట్టం పెరుగుదల ముప్పును ఎదుర్కొంటోంది. తీరప్రాంత కోత, పెరుగుతున్న వరదలు ఈ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇటీవల భారీ వర్షాల కారణంగా చెన్నై నగరమంతా నీటమునిగింది, భూగర్భ జలాలను అతిగా తోడడం, నీటి నిర్వహణ పద్ధతులు సరిగా లేకపోవడం వల్ల ఈ నగరం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. 

 

 

 

46
Pandichery

Pandichery

కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి ఉనికి కూడా ప్రమాదంలో పడింది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల ఈ ప్రాంతం పాక్షికంగా ప్రభావితమవుతోంది. ఇసుక తవ్వకం వంటి మానవ కార్యకలాపాల వల్ల ముప్పు వాాటిల్లుతోంది.  తుఫానులకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం వినాశకరమైన అనేక తుఫానులు , వరదలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనివల్ల ఇది మునకకు గురవుతుందట. 

56
Surat

Surat

గుజరాత్‌లోని ప్రముఖ నగరమైన సూరత్ తాప్తి నది ఒడ్డున ఉంది. ఈ నగరం నది కోత, వరద ముప్పును ఎదుర్కొంటోంది. ఈ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది.

 

66
Vizag

Vizag

ఆంధ్ర ప్రదేశ్ లోని సముద్ర తీర నగరం విశాఖపట్నంకు కూడా ప్రమాదం పొంచివుందట. మొత్తంగా  ముంబై, చెన్నై, పాండిచ్చెరి, సూరత్, విశాఖ నగరాలతో పాటు కొచ్చి, భావ్ నగర్, మంగుళూరు, ట్యుటికోరన్, కాండ్లా, ఓఖా, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్  వంటి 12 నగరాలు మునిగిపోయే ప్రమాదం వుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ హెచ్చరించింది. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved