MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Office Romance: ఆఫీస్ రొమాన్స్‌లో మనవాళ్లు తోపులు.. ఇంట్లో ఇల్లాలు ఆఫీస్‌లో ప్రియురాలు

Office Romance: ఆఫీస్ రొమాన్స్‌లో మనవాళ్లు తోపులు.. ఇంట్లో ఇల్లాలు ఆఫీస్‌లో ప్రియురాలు

Office Romance: డేటింగ్ ప్లాట్ ఫామ్ ఆష్లే మాడిసన్ కొత్త సర్వేను నిర్వహించింది. అందులో ఆఫీస్ రొమాన్స్ లో మన దేశం రెండవ స్థానంలో నిలిచింది. ఇంట్లో భార్యను పెట్టుకుని ఆఫీసులో రొమాన్స్ చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 14 2025, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
 మనదేశంలో ఆఫీస్ రొమాన్స్
Image Credit : pixabay

మనదేశంలో ఆఫీస్ రొమాన్స్

ఆఫీసు ప్రేమలు సాధారణమైనవే, ఆఫీసులో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంట్లో భార్య లేదా భర్త ఉన్నా కూడా ఆఫీస్ రొమాన్స్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ఓ సర్వే చెబుతోంది. ముఖ్యంగా మన దేశంలో ఈ సంస్కృతి మరీ అధికంగా ఉంది. ఆష్లే మాడిసన్ నిర్వహించిన అంతర్జాతీయ అధ్యయనంలో ఆఫీస్ రొమాన్స్ విషయంలో మన దేశం రెండవ స్థానంలో ఉన్నట్టు తేలింది. ఈ అధ్యయనాన్ని 11 దేశాల్లో నిర్వహించారు. ఇక మొదటి స్థానంలో నిలిచిన దేశం మెక్సికో. ఈ డేటాను బట్టి భారతదేశంలో పని ప్రదేశాలలో ప్రేమాయణాలు పెరిగిపోతున్నాయని అర్థమవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రతి పదిమందిలో నలుగురు
Image Credit : Pixabay

ప్రతి పదిమందిలో నలుగురు

ఈ అధ్యయనం ప్రకారం ప్రతి పదిమందిలో నలుగురు భారతీయులు సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నారు. దీన్నిబట్టి పని ప్రదేశాలలో ప్రేమాయణాలు సాధారణంగా మారిపోయాయని అర్థమవుతోంది. నిజానికి ఆఫీసుల్లో వృత్తిపరమైన సరిహద్దులు, ప్రవర్తన వంటి వాటికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వాటన్నింటిని దాటుకొని మరి ఆఫీస్ రొమాన్స్ విపరీతంగా పెరిగిపోయింది. మెక్సికోలో 43 శాతం మంది ఉద్యోగులు తమ సహోద్యోగితో ప్రేమలో ఉన్నామని చెబితే.. ఇక భారతదేశంలో 40 శాతం మంది ప్రేమలో ఉన్నట్టు చెప్పారు. ఇక అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో 30 శాతం మంది సహోద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు వివరించారు.

33
హైదరాబాద్ లో ఎక్కువే
Image Credit : Pixabay

హైదరాబాద్ లో ఎక్కువే

సహజ డేటింగ్ విషయానికి వస్తే మహిళలు కంటే పురుషులే ఎక్కువమంది ఉన్నారు. ఇంట్లో భార్య ఉన్నప్పటికీ నచ్చిన సహోద్యోగితో రొమాన్స్ చేసేందుకు ఎక్కువ మంది మగ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ కొత్త నివేదిక ప్రకారం భారత దేశంలోని కొన్ని నగరాల్లో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనదేశంలో ఇంట్లో జీవిత భాగస్వామిని ఉంచుకొని బయటవారితో ప్రేమలో పడుతున్న వ్యక్తులు అధికంగా కాంచీపురలో ఉన్నారు. తర్వాత స్థానంలో ఢిల్లీ నిలిచింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ 18వ స్థానంలో ఉంది. ఇంట్లో ఉన్న జీవిత భాగస్వామితో భావోద్వేగ దూరం పెరిగినప్పుడు, పని గంటలు అధికంగా ఉన్నప్పుడు ఇలా ఆఫీసు రొమాన్స్ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే డిజిటల్ డేటింగ్ కూడా భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈసారి చ‌లికాలం కూడా చ‌మ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయం.. వాతావ‌ర‌ణంలో పెను సంచ‌ల‌నాలు
Recommended image2
RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారనున్న ఆ 5 గండాలు.. రిజర్వ్ బ్యాంక్ బిగ్ అలర్ట్
Recommended image3
Amazon: అమెజాన్లో మరోసారి ఉద్యోగాల కోత.. మనదేశంలో కొంతమంది ఉద్యోగులను తీసేసిన దిగ్గజ సంస్థ
Related Stories
Recommended image1
Best Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది కొనాలో తెలియడం లేదా? బెస్ట్ స్కూటర్ లిస్ట్ ఇదిగో
Recommended image2
మీ దగ్గర అరెకరం పొలం ఉన్నా చాలు..లక్షల ఆదాయం ఇలా పొందవచ్చు, ఎలాగో తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved