పదేళ్లలో ఎంత మార్పు..! భారతీయులు వాడే ప్రతి మొబైల్ తయారయ్యేది ఇక్కడే
ప్రస్తుతం సెల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది... కూడు,గూడు, గుడ్డ జాబితాలో మొబైల్ చేరింది. ఇలా భారతీయులు ఉపయోగించే కోట్లాది మొబైల్స్ ఇప్పుడు ఎక్కడ తయారవుతున్నాయో తెలుసా?
Made in India Mobiles
భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. మరీముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సాంకేతికత, టెక్నాలజీ వినియోగం మరింత పెరిగింది. అయితే గతంలో భారత్ లోని మార్కెట్ ను దృష్టిలో వుంచుకుని విదేశీ కంపనీలు ఎక్కడో తయారుచేసి మొబైల్స్ ను ఇక్కడికి సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్వయంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు.
భారతదేశం ప్రస్తుతం మొబైల్స్ తయారీ విషయంలో రికార్డులు సృష్టిస్తోంది... దేశప్రజలు ఉపయోగించే ఫోన్లలో 99 శాతం దేశీయంగా తయారైనవేనని మంత్రి వెల్లడించారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో అభివృద్ది చెందిందని... దీని ఫలితంగానే ప్రస్తుతం మొబైల్ తయారీలో ముందున్నామని అన్నారు. దేశంలో మొబైల్స్ వినియోగం చాలా ఎక్కువ... అయినా అందుకు తగ్గట్లుగా అన్ని రకాల ఫోన్లు అందుబాటులో వుంటున్నాయి. ఇలా ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం సాధించిన అభివృద్ది గురించి కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ పార్లమెంట్ వేదికన వివరించారు.
Made in India Mobiles
ఎలక్ట్రానిక్స్ రంగంలో పదేళ్ళలోనే ఇంత మార్పా..!
2014-15 పైనాన్సియల్ ఇయర్ లో భారతదేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్స్ విలువ కేవలం రూ.9,52,00 కోట్లు మాత్రమే. కానీ పదేళ్లు గడిచేసరికి అంటే 2023-24 ఫైనాన్సియల్ ఇయర్ లో దేశీయంగా తయారయ్యే ఎలక్ట్రానిక్స్ విలువ రూ.9,52,000 కు పెరిగింది.
మొబైల్ ఫోన్ల తయారీ విషయంలో మరింత పురోగతి సాధించింది భారత్. గతంలో దిగుమతి చేసుకుంటుంటే ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఫైనాన్సియల్ ఇయర్ 2014-15 లో ఇండియాలో అమ్ముడయ్యే 74 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్నవే. అంటే దేశీయంగా తయారైనవి కావన్నమాట. కానీ ఇప్పుడు భారతీయులు ఉపయోగించే 99 శాతం మొబైల్స్ దేశీయంగా తయారైనవే. ఇలా ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడమే కాదు విదేశాలకు కూడా మొబైల్స్ ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది.
Made in India Mobiles
ఎలక్ట్రానిక్ రంగంలో ఉద్యోగాలెన్నో తెలుసా?
కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాదు భారీగా ఉద్యోగాలను కల్పిస్తోంది ఎలక్ట్రానిక్స్ రంగం. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా ఈ రంగంపై చాలామంది ఆధారపడ్డారు. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ దాదాపు 25 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిందని కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రంగం అభివృద్దికి గత పదేళ్లలో ఎంతో కృషి చేసింది. ఫలితంగానే ఇప్పుడు ఈ రంగంలో దేశం దూసుకుపోతోంది. ఇటీవల సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా రూ.76,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రొడక్షన్ లింకుడ్ ఇన్సెటివ్ (PLI), స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆప్ ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్స్ ఆండ్ సెమి కండక్టర్స్ (SPECS) వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రానిక్ ఆండ్ ఐటీ రంగ అభివృద్దికి కృషిచేస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం.
Made in India Mobiles
భారత ఎలక్ట్రానిక్స్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు :
భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ది ఊహించని స్థాయిలో వుంది... ఇదే సమయంలో సవాళ్లు కూడా అలాగే వున్నాయి. కొన్ని దేశాలతో పోలిస్తే భారత్ లో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాదు క్వాలిటీ, ధరల విషయంలోనే విదేశీ కంపనీలతో దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగం గట్టి పోటీ ఎదుర్కొంటోంది. భారత్ లో మానవ వనరుల కొరత లేకపోయినా ఎలక్ట్రానిక్స్ రంగం పూర్తిగా టెక్నాలజీ, మిషనరీకి సంబంధించింది... కాబట్టి ఈ సవాళ్లు ఎదురవుతున్నాయి.
అయితే అన్ని సవాళ్లను ఎదుర్కొని మరీ భారత్ గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటుతోందని మంత్రి జితిన్ ప్రసాద్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డిఏ ప్రభుత్వం గత పదేళ్ళలో దేశ ఎలక్ట్రానిక్స్ రంగం ముఖచిత్రాన్నే మార్చేసింది.