పక్కింటివ్యక్తితో వివాహేతర సంబంధం.. భార్యను, ప్రియుడిని చంపిన భర్త.. అరెస్ట్..
పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడం తెలిసిన భర్త.. ఇద్దరినీ హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.

ఢిల్లీ : ఢిల్లీలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఒక వ్యక్తి వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడిని హత్య చేశాడు. అతడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇమ్రాన్ అనే నిందితుడిని అతని భార్య ఖుష్బూ, ఆమె ప్రేమికుడు రంజిత్ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇమ్రాన్‌కు ఖుష్బూతో పన్నెండేళ్ల క్రితం వివాహమయ్యింది.
వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతను ఇ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటిపక్కనే ఓ ఫ్యాక్టరీలో పనిచేసే రంజిత్ ఉండేవాడు. అలా ఇమ్రాన్ భార్యకు, రంజిత్ కు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధంగా మారింది.
ఇది తెలిసిన ఇమ్రాన్ వారిద్దరినీ హతమార్చాడు. ఇరుగు పొరుగు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
హత్యకు సంబంధించిన కాల్ అందుకున్న పోలీసులు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు. దీనిమీద తదుపరి విచారణ జరుగుతోంది.