రాజస్థాన్‌లో పరువుహత్య : ప్రేమ వ్యవహారం నచ్చక కూతురిని గొంతు కోసి హత్య చేసిన తండ్రి..
రాజస్థాన్‌లో ఓ వ్యక్తి కన్నకూతురి గొంతుకోసి హత్య చేశాడు. కూతురు ఎవరినో ప్రేమిస్తుందని.. అది ఇష్టలేని తండ్రి ఈ ఘాతుకానికి ఒడి గట్టాడు.

రాజస్థాన్ : రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలో పరువహత్య కలకలం రేపింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చని ఓ వ్యక్తి తన 23 ఏళ్ల కుమార్తెను గొంతు కోసి చంపాడు.
దీనిమీద సూరత్‌గఢ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. దీని గురించి పోలీసులు వివరాలు తెలియజేశారు. తండ్రి మీద కేసు నమోదు చేశారు.
"హీనా బానో అనే యువతి.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. సర్దార్‌ఘర్‌లో నివాసం ఉంటున్న లుక్కా మాన్ ఖాన్‌తో గత కొన్ని రోజులుగా ఆమె రిలేషన్‌షిప్‌లో ఉంది.
ఇది ఆమె తండ్రి ఘుమా ఖాన్‌కు కోపం తెప్పించింది. కూతురిని వారించినా ఆమె వినలేదు. దీంతో చంపేయాలనుకున్నాడు" అని ఇన్‌ఛార్జ్ సుభాష్ బరాలా తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఘుమా ఖాన్ నిద్రిస్తున్న హీనాను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో డీఎస్పీ కిషన్‌కుమార్ బిజారణ్య, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా విచారణ జరిపించారు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. ఇదిలావుండగా, ఘుమా ఖాన్ తన కూతురిని హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.