పన్నెండేళ్ల బాలికపై మైనర్ కజిన్స్ గ్యాంగ్ రేప్.. గర్భం దాల్చడంతో...

First Published 9, Oct 2020, 1:37 PM

మైనర్లపై మైనర్లే లైంగిక దాడికి దిగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ లో పన్నెండేళ్ల చిన్నారిపై అన్న వరుసయ్యే ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భవతైంది. దారుణమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

గుజరాత్, అహ్మదాబాద్ లోని  నవ్‌సరి జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కజిన్ అయిన బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అంతటితో ఊరుకోకుండా ఈ విషయాన్ని తన మరో ఇద్దరు కజిన్లతో పంచుకున్నాడు. తనకేమీ భయం లేదని, తన గురించి వాళ్ల అమ్మానాన్నలకు చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించినట్లు చెప్పాడు. దీంతో వారు సైతం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయంతో వణికిపోయిన బాలిక నిజాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు.

అయితే కొన్ని రోజుల క్రితం బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిపారు. దీంతో షాక్ కు గురైన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

దీంతో బుధవారం ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. పోక్సో చట్టం కింద జువైనల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

loader