MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక 'గంగా విలాస్'.. ప్ర‌ధాని చేతుల మీదుగా ప్రారంభం..

ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌక 'గంగా విలాస్'.. ప్ర‌ధాని చేతుల మీదుగా ప్రారంభం..

Varanasi: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ (సుదీర్ఘ ప్ర‌యాణం సాగించే న‌దీ ప‌ర్య‌ట‌క నౌక ) గంగా విలాస్ ను ను శుక్రవారం వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వారణాసి నుండి లగ్జరీ క్రూయిజ్ భారతదేశం, బంగ్లాదేశ్ లోని ఐదు రాష్ట్రాల్లోని 27 నదీ వ్యవస్థల గుండా 3,200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణిస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 13 2023, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

world's longest river cruise Ganga Vilas: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సుదీర్ఘ ప్రయాణం చేసే న‌దీ ప‌ర్య‌ట‌క నౌక 'గంగా విలాస్' ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. మ‌రికొద్ది క్ష‌ణాల్లో గంగా విలాస్ త‌న ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌నుంది. 

26

ఉత్తర ప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ క్రూయిజ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ కు ప్రయాణిస్తుంది. "ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరి 13న ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది యాత్ర చేసే రివ‌ర్   క్రూయిజ్ గంగా విలాస్ ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు.

36

ఈ క్రూయిజ్ వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ వరకు ప్ర‌యాణం చేస్తుంది. 50 రోజుల్లో దాదాపు 4,000 కిలో మీటర్ల దూరాన్ని ఈ క్రూయిజ్ క‌వ‌ర్ చేస్తుంది. ఈ క్రూయిజ్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఆగుతుంది. ప్ర‌పంచ వార‌త‌స్వ ప్ర‌దేశాలు, అనేక జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా ఈ క్రూయిజ్ ప్ర‌యాణం సాగిస్తుంది" అని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

46

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మెడీ ప్ర‌పంచంలోనే అతి పొడవైన రివ‌ర్ క్రూయిజ్-MV గంగా విలాస్‌ను జెండా ఊపి, జనవరి 13వ తేదీ ఉదయం 10.00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే, ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా వేయి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభించ‌డంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు.
 

56

గంగా విలాస్ క్రూయిజ్ వారణాసి నుండి బయలుదేరి ఘాజీపూర్, బక్సర్, పాట్నా మీదుగా కోల్ కతా చేరుకుంటుంది. ఇది పక్షం రోజుల పాటు బంగ్లాదేశ్ నదులపై ప్ర‌యాణం సాగిస్తుంది. తరువాత గౌహతి మీదుగా భారతదేశానికి తిరిగి వచ్చి దిబ్రూగఢ్ చేరుకుంటుంది. గంగా విలాస్ క్రూయిజ్ భారతదేశంలోని రెండు గొప్ప నదులైన గంగా, బ్రహ్మపుత్రపై ప్రయాణిస్తుంది.

66

గంగా విలాస్ త‌న ప్ర‌యాణ దారిలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 కి పైగా ముఖ్య‌ ప్రదేశాలలో ఆగుతుంది. ఇది సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్ సహా జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల గుండా కూడా వెళుతుంది. క్రూయిజ్ లో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్ వంటి అనేక ఇతర  అధునాత సౌకర్యాలు ఉంటాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
PM Modi Grand Roadshow: కేరళ పర్యటనలో మోదీకిగుర్తుండిపోయేలా ఘన స్వాగతం | Asianet News Telugu
Recommended image2
8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
Recommended image3
Now Playing
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. కానీ Raghav Chadha ఆప్ ఎందుకిలా చేసింది? | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved