MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సాధారణ ఉద్యోగిగా మొదలై.. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తిగా. మన్మోహన్‌ జీవిత చరిత్ర అసాధారణం.

సాధారణ ఉద్యోగిగా మొదలై.. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన వ్యక్తిగా. మన్మోహన్‌ జీవిత చరిత్ర అసాధారణం.

భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. తన వెలకట్టలేని సేవలతో దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన పోయిన మన్మోహన్‌ సింగ్‌ 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోన్న మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం కన్ను మూశారు. ఈ నేపథ్యంలో మన్మోహన్‌ సింగ్ జీవితంలో కొన్ని కీలక ఘట్టాలు, దేశానికి ఆయన అందించిన అపూర్వ సేవలను ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 26 2024, 11:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జననం

జననం

మన్మోహన్‌ సింగ్ 1932 సెప్టెంబర్‌ 26వ తేదీన పంజాబ్‌లోని (ఇప్పటి పాకిస్థాన్‌) గాహ్‌ గ్రామంలో జన్మించారు. మన్మోహన్‌ సింగ్ 1952లో తన బ్యాచిలర్‌ డిగ్రీని పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి, 1954లో మాస్టర్‌ డిగ్రీని ఛండీగడ్‌ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. ఆ తర్వాత 1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీని ఆ తర్వాత 1962లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను పూర్తి చేశారు. ఇలా రాజకీయాల్లో అత్యంత విద్యావంతులైన నాయకుల్లో ఒకరిగా పేరుగా సంపాదించుకున్నారు మన్మోహన్. 
 

25
ఉద్యోగం..

ఉద్యోగం..

మన్మోహన్‌ సింగ్ సాధారణ లెక్చరర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1957 నుంచి 1959 మధ్య ఆర్థిక శాస్త్రంలో సీనియర్ లెక్చరర్‌గా సేవలందించారు. ఆ తర్వాత పంజాబ్‌, ఛండీగడ్‌ వంటి విశ్వవిద్యాలయాల్లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అలాగే 1976లో జవహర్‌ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీలో గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలను నిర్వహించారు. ఆ తర్వాత ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా  సేవలందించారు. ఇలా సాధారణ ఉద్యోగిగా మొదలైన మన్మోహన్‌ జీవిత ప్రయాణం ప్రధాని స్థాయికి చేరడం ఎంతో స్పూర్తిదాయకం. 
 

35
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..

భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మన్మోహన్ చేసిన కృషి వెలకట్టలేనిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన వినూత్న ఆలోచనలు, సరళీకృత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాయి. 1991-96 మధ్య పీవీ నర్సింహరావు హయాంలో ఆర్థికమంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్‌ సింగ్‌దే. భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో మన్మోహన్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేం లేదు. 
 

45
భారత ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ చేసిన సేవలు..

భారత ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ చేసిన సేవలు..

1991లో ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ ఎన్నో ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. ఆర్థిక సంస్కరణలతో ఎగుమతులు పెంచడం, దిగుమతులపై నియంత్రణలను సడలించడం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలను పెంచడం వంటి చర్యలు చేపట్టారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభతరం చేసి, వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకతను తీసుకువచ్చారు. 1991 నాటి సంస్కరణల తర్వాత భారత జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. 1980లలో 3-4% వృద్ధి రేటు ఉండగా, 1990ల మధ్యన 6% దాటింది. ఇక విదేశీ పెట్టుబడులకు కూడా మన్మోహన్ సింగ్ అవకాశం కల్పించారు. 
 

55
మన్మోహన్‌ సాధించిన మరికొన్ని ఘనతలు..

మన్మోహన్‌ సాధించిన మరికొన్ని ఘనతలు..

* అత్యధిక జీడీపీ 10.8 శాతం వృద్ధిరేటు మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనే నమోదు కావడం విశేషం. 

* ఫోర్బ్స్‌ అత్యంత శక్తిమంతుల జాబితాలో కూడా మన్మోహన్‌కు చోటు దక్కింది. 

* ప్రధానికగా ఎన్నికైన తొలి హిందూయేతర వ్యక్తిగా కూడా మన్మోహన్‌ రికార్డు సృష్టించారు. 

* 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహన్‌ సింగ్. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved