ఫిబ్రవరిలో విద్యార్థులకు సెలవులే సెలవులు !
School Holidays: ఫిబ్రవరి నెలలో చాలా పండుగలు వస్తున్నాయి. పిల్లల స్కూళ్లకు కూడా చాలా సెలవులే ఉన్నాయి. ఆ వివరాలు మీకోసం.

School Holiday
February holidays: శీతాకాలపు సెలవులు ముగుస్తున్నాయి. పిల్లలు ఇప్పుడు తమ పాఠశాలలకు తిరిగి వస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో, చలి కారణంగా సెలవులు పొడిగించబడ్డాయి, కానీ ఇప్పుడు చాలా పాఠశాలలు సాధారణంగా నడుస్తున్నాయి. అయితే, మరికొద్ది రోజుల్లో ఫిబ్రవరి నెలలోకి ప్రవేశిస్తాం. జ్ఞాన దేవత అయిన సరస్వతి అమ్మవారి ఆగమనంతో ఈ మాసం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. ఈ నెలలో మీకు ఒకటి రెండు రోజులు మాత్రమే కాకుండా చాలా సెలవులు వస్తాయి. మీరు ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులు పొందబోతున్నారో ఆ వివరాలు మీకోసం.
సాధారణ సెలవులు: ఫిబ్రవరి నెలలో 2, 9, 16, 23 లేదీల్లో ఆదివారం వస్తున్నాయి. ఈ రోజుల్లో సెలవులు ఉంటాయి. అలాగే, ఫిబ్రవరి 15న రెండో శనివారం కావడంతో మీకు ఈ రోజు కూడా సెలవుగా వస్తుంది. మిగతా సెలవుల విషయానికి వస్తే..
2 ఫిబ్రవరి: శ్రీ పంచమి / వసంత పంచమి
శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరుపుకుంటారు. అంటే ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు. సరస్వతీ దేవిని జ్ఞానం, సంగీతం, కళ, సైన్స్, తెలివితేటల దేవతగా భావిస్తారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
14 ఫిబ్రవరి: షబ్-ఎ-బరాత్
షబ్-ఎ-బరాత్ ముస్లింలు జరుపుకునే ఒక పండగ రోజు. ఇది పబ్లిక్ హాలీడేస్ లో అప్షనల్ సెలవుగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు దినంగా ఉంది.
19 ఫిబ్రవరి: శివాజీ జయంతి
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు, ఇది గొప్ప మరాఠా పాలకుడి జయంతి. ఈ ఏడాది మరాఠా చక్రవర్తి 395వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు పాఠశాలలకు సెలవుగా ఉండనుంది.
school holiday
24 ఫిబ్రవరి: గురు రవిదాస్ జయంతి
ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆయన జయంతి జరుపుకోనున్నారు. అతను 1398లో ఉత్తరప్రదేశ్‌లోని కాశీ (వారణాసి)లో జన్మించాడు. ఆ రోజు ఆదివారం, అందుకే అతనికి రవిదాస్ అని పేరు పెట్టారు. గురు రవిదాస్ జన్మదినం ఉత్తర ప్రదేశ్ తో ఆపటు అనేక ఇతర రాష్ట్రాల్లో సెలవుదినం.
26 ఫిబ్రవరి: మహాశివరాత్రి
మహాశివరాత్రి హిందూ మతం ముఖ్యమైన పండుగ, ఇది శివుడికి ప్రార్థనలు కోసం గొప్ప పండగ. ఈ పండుగ ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రాత్రి జరుపుకుంటారు. భారతదేశం అంతటా గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. విద్యార్థులు తమ రాష్ట్ర ప్రభుత్వం లేదా వారి పాఠశాల నుండి జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఈ సెలవులను నిర్ధారించవచ్చు.