MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • దేశంలో ఏ ధనవంతునికి సాధ్యం కాలేదు.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన సాధారణ రైతు

దేశంలో ఏ ధనవంతునికి సాధ్యం కాలేదు.. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన సాధారణ రైతు

Farmer become shatabdi express train owner : భారతదేశంలోని ధనవంతులైన వ్యాపారవేత్తల్లో చాలా మంది ప్రైవేట్ జెట్‌లు, లగ్జరీ పడవలు, కోట్ల రూపాయల విలువైన ఇతర వాహనాలను కలిగి ఉన్నారు కానీ వీరివద్ద ఒక్క సొంత రైలు మాత్రం లేదు. కానీ, వీరందరిని పక్కనబెట్టి ఒక సామాన్య రైతు రైలుకు యజమాని అయ్యాడు. అది కూడా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ ఆసక్తికరమైన కథనం మీకోసం..  

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 30 2024, 12:27 PM IST| Updated : Aug 30 2024, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Farmer become shatabdi express train owner : రైల్వేలు భారత ప్రభుత్వానికి చెందినవి. దేశంలో ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనవంతులైనా ఎవరూ కూడా రైలును కొనుగోలు చేయలేరు. ప్రైవేట్ జెట్‌లు, హెలికాప్టర్లు, ఓడలు సహా ఇతర వాహనాలను కొనుగోలు చేయవచ్చు. దేశంలోని అత్యంత ధనవంతులకు సాధ్యం కానీది ఒక రైతు అందుకున్నారు. ఒక సాధారణ రైతు దేశంలో పెద్ద రైలుకు యజమాని అయ్యాడు. ఆ రైలు మాములుది కూడా కాదు.. శతాబ్ది ఎక్స్ ప్రెస్. ఆ రైలు-ఆ రైతు కథ ఇలా ఉంది.. 

26

ఒక సాధారణ రైతు అతి పెద్ద రైలుకు యజమాని అయిన సంఘటన 2017లో జరిగింది. సాధారణ రైతు సంపూర్ణ సింగ్.. దేశరాజధాని ఢిల్లీ-అమృత్‌సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. భారతీయ రైల్వేలో జరిగిన తప్పిదం కారణంగా ఇది జరిగింది. పంజాబ్‌కు చెందిన రైతు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయ్యాడు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఏకైక సంఘటన. 2007లో లుధియానా-చండీగఢ్ మధ్య రైలు మార్గ నిర్మాణం ప్రారంభమైంది. రైల్వే శాఖ భూసేకరణ ప్రారంభించింది. లుధియానాలోని కటాన్ గ్రామానికి చెందిన సంపూర్ణ సింగ్ భూమిని కూడా సేకరించారు.

36

రైల్వే శాఖ సంపూర్ణ సింగ్‌కు ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించింది. తర్వాత రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, సంపూర్ణ సింగ్‌కు ఒక విషయం తెలిసి షాక్ అయ్యాడు. తన గ్రామానికి సమీపంలోని మరొక గ్రామంలో, పట్టణం నుండి దూరంగా, తక్కువ సారవంతమైన భూమిని రైల్వే శాఖ ఎకరాకు రూ.71 లక్షలు చెల్లించి సేకరించింది.

46

తనకు మాత్రం ఎకరాకు అందులో సగం కూడా చెల్లించలేదని ఆగ్రహించిన సంపూర్ణ సింగ్ తనకు చాలా తక్కువగా పరిహారం ఇచ్చారనీ, ఇది న్యాయం కాదని కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా రైల్వే శాఖ పరిహారాన్ని ఎకరాకు రూ.50 లక్షలకు పెంచింది. కానీ, పక్కవారి ఎంత ఇచ్చారో తనకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కిన రైతు సంపూర్ణ సింగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈసారి రైల్వే శాఖ పరిహారాన్ని రూ.1.47 కోట్లకు పెంచింది. 2015 లోపల పరిహారం మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

56

2017 వరకు రైల్వే రూ.42 లక్షలు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1.05 కోట్లు బకాయి ఉంది. దీంతో కోర్టు లుధియానా స్టేషన్‌లో రైలును జప్తు చేయాలని ఆదేశించింది. అంతేకాదు, స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా జప్తు చేయాలని ఆదేశించింది. రైలు జప్తు, స్టేషన్ మాస్టర్ కార్యాలయం జప్తు చేశారు. 

66

ఈ కోర్టు ఆదేశంతో, రైతు సంపూర్ణ సింగ్ అమృత్‌సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలును జప్తు చేశాడు. ఈ విధంగా అతను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమాని అయిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. అయితే, రైల్వే అధికారులు మళ్లీ కోర్టును ఆశ్రయించి రైలును విడుదల చేయాలని ఆదేశాలు పొందారు. రైతు స్వాధీనంలో ఉన్న రైలును విడుదల చేశారు. అయితే, ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉండటం గమనార్హం. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
Recommended image2
Now Playing
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu
Recommended image3
ఇదేం చలిరా నాయనా..! చివరకు గోవులకు కూడా దుప్పట్లా..!!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved