MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • బెట్టింగ్ లో ఇంత డబ్బా..! నిర్వహకుడు వీరేంద్ర లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

బెట్టింగ్ లో ఇంత డబ్బా..! నిర్వహకుడు వీరేంద్ర లగ్జరీ లైఫ్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

బెట్టింగ్ వ్యవహారంలో కర్ణాటక ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర (పప్పి) అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు అతడి లగ్జరీ లైఫ్ గురించి చర్చ సాగుతోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 23 2025, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బెట్టింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
Image Credit : X/AARITRA GOSH

బెట్టింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్

Karnataka Betting Case : కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన ఘటన ఇవాళ(శనివారం) చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్ర 'పప్పీ'ని సిక్కింలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. చిత్రదుర్గ ఎమ్మెల్యేపై అక్రమ బెట్టింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక నుంచి గోవా క్యాసినోలు, దుబాయ్ వ్యాపారాల వరకు ఈ వ్యవహారం విస్తరించి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా పట్టుబడ్డాడంటే...
Image Credit : X

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా పట్టుబడ్డాడంటే...

కన్నడ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర తన సహచరులతో కలిసి సిక్కిం రాష్ట్రం గ్యాంగ్‌టక్‌ కు క్యాసినో లీజుకు సంబంధించిన చర్చల కోసం వెళ్ళారు. ఈ వ్యవహారంపై ఈడీకి సమాచారం అందింది... అక్రమ ఆర్థిక లావాదేవీలు, బ్లాక్ మనీ మార్పిడి జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈడీ అధికారులు ఎమ్మెల్యేతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.

ఈడి అధికారులు ఆగస్టు 23న గాంగ్‌టక్‌లో వీరేంద్ర పప్పీని అరెస్టు చేసి సిక్కిం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం అతన్ని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. అనంతరం బెంగళూరుకు తరలించి కోర్టులో హాజరుపరిచారు... ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

35
బెట్టింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దాడులు
Image Credit : X

బెట్టింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దాడులు

ఎమ్మెల్యే అరెస్ట్‌కు ముందు అంటే ఆగస్ట్ 22, 23 తేదీల్లో దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. కర్ణాటక, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. కర్ణాటకలోని చిత్రదుర్గ, హుబ్బళి... మహరాష్ట్ర రాజధాని ముంబై... రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈడీ తనిఖీలు జరిగాయి.

ఇలా దేశవ్యాప్తంగా 31 చోట్ల ఈడీ జరిపిన దాడులు దాదాపు రూ. 12 కోట్ల నగదు, రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు లభించాయి. అలాగు 17 బ్యాంక్ ఖాతాలు, రెండు లాకర్లను కూడా ఈడీ గుర్తించింది. వీటన్నింటిని స్వాధీనం చేసుకున్నారు.

45
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాసినో, బెట్టింగ్ సామ్రాజ్యం
Image Credit : Getty

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాసినో, బెట్టింగ్ సామ్రాజ్యం

చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర వ్యాపారాలు క్యాసినోలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వరకు విస్తరించి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. గోవాలోని పప్పీస్ క్యాసినో గోల్డ్, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ రివర్స్ క్యాసినో, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినోలపై దాడులు జరిగాయి. కింగ్567, రాజా567, పప్పీస్003, రత్న గేమింగ్ వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా వీరేంద్ర నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీరేంద్ర సోదరుడు కె.సి. తిప్పేస్వామి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్ట్‌టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ అనే మూడు కంపెనీలను నిర్వహిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌కు సంబంధించినవని అనుమానిస్తున్నారు.

55
ఎమ్మెల్యే వీరేంద్ర విలాసవంతమైన జీవనశైలి
Image Credit : Asianet News

ఎమ్మెల్యే వీరేంద్ర విలాసవంతమైన జీవనశైలి

నగదు, బంగారం, క్యాసినో లింకులతో పాటు వీరేంద్ర విలాసవంతమైన జీవనశైలిపై కూడా ఈడీ దృష్టి సారించింది. చిత్రదుర్గలోని అతని కార్ల కలెక్షన్, అంతర్జాతీయ క్యాసినో మెంబర్‌షిప్ కార్డులు, హై-లిమిట్ క్రెడిట్, డెబిట్ కార్డులు, 5-స్టార్ హోటల్ మెంబర్‌షిప్ కార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిలో ఎంజిఎం క్యాసినో, మెట్రోపాలిటన్ క్యాసినో, బెల్లాజియో క్యాసినో, మెరీనా క్యాసినో, క్యాసినో జ్యువెల్ సభ్యత్వ కార్డులు ఉన్నాయి. అలాగే తాజ్, హయత్, లీలా వంటి ప్రతిష్టాత్మక హోటళ్లకు లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు కూడా అతడివద్ద ఉన్నాయి.

వీరేంద్రను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అతడి ఆదాయం, ఆస్తులతో పాటు విదేశీ లింకులు, రాజకీయ సంబంధాలను పరిశీలిస్తుంది. కాబట్టి ఈ దర్యాప్తులో మరిన్ని సంచలనాలు భయటపడే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యే బెట్టింగ్ వ్యవహారం, అరెస్ట్ కర్ణాటక కాంగ్రెస్ లోనూ కలకలం రేపింది... మరి ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
వైరల్ న్యూస్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీలు ఆడి ఏటా ₹20,000 కోట్లు నష్టపోతున్న భారతీయులు, ఇకపైనా మిగులే
Recommended image2
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కెసి వీరేంద్ర అరెస్ట్.. పట్టుబడ్డ కోట్లాది నోట్ల కట్టలు, కిలోల బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved