యుద్ధ సమయంలో భారత సైన్యం వేల సంఖ్యలో కండోమ్‌లు ఎందుకు ఆర్డర్ చేసింది? అసలు వీటి అవసరం ఏంటి..
ప్రస్తుతం దేశ ప్రజలంతా సంతోషంగా, ధైర్యంగా ఉన్నారంటే కారణం భారత సైన్యమే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారత సైన్యం శౌర్యం, పోరాట పరాక్రమానికి ప్రసిద్ధి చెందింది. భారత్‌వైపు కన్నెత్తి చూసే శత్రు దేశానికి మన సైనికులు సమాధానం చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన గురించి తెలిస్తే షాక్‌కి గురికావడం ఖాయం. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధ సమయంలో భారత సైన్యం పెద్ద సంఖ్యలో కండోమ్స్‌ను ఆర్డర్ చేసింది. వేల సంఖ్యలో కండోమ్‌లను కొనుగోలు చేశారు.? అసలు ఇండియన్ ఆర్మీ కండోమ్‌లను ఎందుకు కొనుగోలు చేసింది.? శత్రువులను తరిమికొట్టేందుకు కండోమ్‌లను ఎలా ఉపయోగించారంటే..
ఈ సంఘటన 1971 డిసెంబర్ 3వ తేదీన జరిగింది. డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. చరిత్రలో ఈ సంఘటన ఎప్పటికీ నిలిచిపోతుతుంది. ఈ సమయంలో పాక్ ఆర్మీ భారత ఎయిర్ బేస్‌ను టార్గెట్ చేసింది. అయితే మరోవైపు భారత సైన్యం తన వ్యూహం ప్రకారం పాకిస్థాన్‌పై దాడి చేసింది. భారత సైన్యం అనేక వైపుల నుంచి పాక్ సైనికులపై దాడి చేసింది. ఈ సందర్భంగా వేల సంఖ్యలో కండోమ్‌లను ఆర్డర్ చేశారు.
యుద్ధ వ్యూహంలో భాగంగా భారత సైన్యం చిట్టగాంగ్ పోర్టును లక్ష్యంగా చేసుకుంది. పాక్ నౌకలను టార్గెట్ చేయాలన్నది భారత సైనికుల ప్లాన్. అయితే ఈ నౌకలను ప్రయోగించడం అంత సులభమైన విషయం కాదు. యుద్ధ సమయంలో, ఓడలను పేల్చివేయడానికి లింపెట్ మైన్ అని పిలిచే ఒక వస్తువును ఓడల కింద ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కానీ అది కేవలం 30 నిమిషాల్లోనే బద్దలైంది.
ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనిపెట్టిన సైన్యం లింపెట్ మైన్స్‌కు బదులుగా కండోమ్‌లను వాడాలని నిర్ణయించుకుంది. లింపెట్ మైన్ నీటిలో తడవడం వల్ల త్వరగా పేలుతుంది. దీంతో దీనిని కండోమ్‌లో ఉంచడం ద్వారా నీటిలో తడవకుండా సమయానికి పేలింది. ఇలా ఇండియన్ ఆర్మీ కండోమ్‌లను ఉపయోగించింది. ఈ మిషన్‌లో భాగంగా పాకిస్థాన్ నౌకలను ఇండియన్ ఆర్మీ పేల్చేసింది. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం కూడా కీలక పాత్ర పోషించింది.