MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Diwali: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చండి, సుప్రీం ఆదేశాలు.. అస‌లేంటీ గ్రీన్ క్రాక‌ర్స్‌, వీటి నుంచి నిజంగానే పొగ రాదా.?

Diwali: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చండి, సుప్రీం ఆదేశాలు.. అస‌లేంటీ గ్రీన్ క్రాక‌ర్స్‌, వీటి నుంచి నిజంగానే పొగ రాదా.?

Diwali: దీపావళి అంటేనే దీపాల పండగా. దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈసారి ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీం తేల్చి చెప్పింది. 

3 Min read
Author : Narender Vaitla
Published : Oct 16 2025, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పండుగ ముందు గుడ్ న్యూస్
Image Credit : Getty

పండుగ ముందు గుడ్ న్యూస్

దీపావళి పండగ ముందు దేశ రాజధాని ప్రజలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో హరిత బాణసంచా విక్రయం, కాల్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతికి పలు షరతులు కూడా విధించింది. పర్యావరణం పరిరక్షణ, ప్రజారోగ్యం, సంప్రదాయాల మధ్య సమతుల్యత ఉండేలా తీర్పు ఇచ్చామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్ గవాయ్, జస్టిస్‌ వినోద్ చంద్రన్ ధర్మాసనం పేర్కొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
హక్కులు, సంప్రదాయాల మధ్య సమతుల్యత
Image Credit : Asianet News

హక్కులు, సంప్రదాయాల మధ్య సమతుల్యత

కోర్టు తీర్పులో జీవించే హక్కు, వృత్తి స్వేచ్ఛ, మతపరమైన ఆచారాల సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజల ఆనందం, వాణిజ్య హక్కులు, పర్యావరణ పరిరక్షణ – ఈ మూడు మధ్య సమతుల్యత ఉండేలా తీర్పు ఇచ్చిందని ధర్మాసనం పేర్కొంది. గతంలో వాయు కాలుష్యం పెరగడంతో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించగా, ఈసారి పండుగ సందర్భాన సడలింపు ఇచ్చింది.

37
కీలక మార్పులు
Image Credit : our own

కీలక మార్పులు

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం.. అక్టోబర్ 18 నుంచి 21 వరకు మాత్రమే హరిత బాణసంచా విక్రయాలు జరగాలి. బాణసంచా కాల్చడానికి దీపావళి ముందు రోజు, పండగ నాడు పరిమిత సమయాలు నిర్ధారించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల లోపు మాత్రమే బాణసంచా కాల్చడానికి అనుమతి ఇచ్చారు.

47
ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం
Image Credit : google

ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం

బాణసంచా అమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ లేదా ఇ-కామర్స్‌ ద్వారా జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం అధికారిక అనుమతితో ఉన్న స్థానిక విక్రేతలు మాత్రమే హరిత బాణసంచాను విక్రయించాలని తీర్పునిచ్చారు. ఈ అనుమతి పూర్తిగా తాత్కాలికం, ఈ దీపావళి పండుగకే పరిమితమని స్పష్టం చేసింది.

పర్యావరణానికి ముప్పుగా మారుతోన్న బాణసంచా

దీపావళి పండుగ వెలుగుల పండుగ మాత్రమే కాదు, శబ్దాల పండుగగా కూడా మారిపోయింది. కానీ ఈ ఆనందం వెనుక ఉన్న వాస్తవం పర్యావరణానికి పెద్ద ముప్పు. ప్రతి ఏడాది దీపావళి రాత్రి ఆకాశం రంగుల కాంతులతో మెరవగా, మరుసటి రోజుకే నగరాలు పొగతో కప్పుకుపోతాయి.

57
బాణసంచా కాలుష్యానికి కారణం
Image Credit : our own

బాణసంచా కాలుష్యానికి కారణం

పటాకులు వెలిగించినప్పుడు సల్ఫర్, నైట్రేట్‌లు, లోహపు కణాలు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాసకోశ సమస్యలు, కంటి చికాకులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గాలి నాణ్యత సూచిక (AQI) తీవ్రంగా పడిపోతుంది. దీపావళి శీతాకాలానికి దగ్గరగా రావడం వల్ల వాతావరణంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో పటాకుల పొగ గాలిలో ఎక్కువసేపు నిలిచి, పొగమంచు, పొగ కలిపి మరింత కాలుష్యానికి దారితీస్తాయి.

బాణసంచాలో ఉన్న రసాయనాలు

బాణసంచా తయారీలో యాంటిమోనీ సల్ఫైడ్, బేరియం నైట్రేట్, లిథియం, రాగి, స్ట్రోంటియం వంటి లోహాలు ఉపయోగిస్తారు. ఇవి మండినప్పుడు విషపూరిత వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు కేవలం గాలినే కాదు, నేలపై, నీటిలోనూ కాలుష్యాన్ని పెంచుతాయి. పటాకుల నుంచి వచ్చే సూక్ష్మ కణాలు (PM 2.5, PM 10) ఊపిరితిత్తుల్లో చేరి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.

67
నగరాల్లో పెరుగుతున్న ప్రమాదం
Image Credit : Getty

నగరాల్లో పెరుగుతున్న ప్రమాదం

ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా పెరుగుతాయి. వాతావరణ శాఖలు, వైద్య నిపుణులు ప్రతీ ఏడాది హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, పటాకుల వినియోగం తగ్గడం లేదు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ కాలం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. పక్షులు, పెంపుడు జంతువులు కూడా శబ్దం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

గ్రీన్ క్రాకర్స్ – కొత్త ప్రత్యామ్నాయం

పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసిన “గ్రీన్ క్రాకర్స్” కాలుష్యాన్ని తగ్గించే మార్గంగా నిలుస్తున్నాయి. ఇవి సాధారణ పటాకుల మాదిరిగా హానికరమైన రసాయనాలు ఉండవు. బదులుగా తక్కువ ఉద్గార పదార్థాలను ఉపయోగిస్తాయి. గ్రీన్ క్రాకర్స్ శబ్దం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి, పొగ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాంప్రదాయ పటాకుల కంటే కొంచెం ఖరీదైనప్పటికీ, పర్యావరణం కోసం ఇవి మంచి ఎంపికగా చెప్పొచ్చు.

77
బాధ్యతాయుతమైన సంబరాలు
Image Credit : our own

బాధ్యతాయుతమైన సంబరాలు

దీపావళి ఆనందం బాణసంచాలో కాకుండా వెలుగుల్లో ఉంది. తక్కువ శబ్దంతో, తక్కువ పొగతో పండుగ జరుపుకోవడం పర్యావరణానికి రక్షణ. కుటుంబంతో, స్నేహితులతో దీపాలను వెలిగించడం, పూలతో దీపాలను అలంకరించడం ద్వారా పండుగను మరింత ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు. గ్రీన్ క్రాకర్స్ వాడటం లేదా పటాకులు పూర్తిగా మానేయడం.. ఇవే భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే నిజమైన బహుమతి, సందేశం కూడా.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
దీపావళి
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
Rain Alert: ఇక కాస్కోండి.. ఈ ప్రాంతాల్లో ఆగ‌మాగం, ఆకాశంలో అల్ల‌క‌ల్లోలం. భారీ వ‌ర్షాలు ఖాయం
Recommended image2
Proverb: గతికితే అతకదు.. సామెత వెన‌కాల ఉన్న అస‌లు అర్థం ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved