MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఆప్ అబద్ధాలను ఢిల్లీ ప్రజలు సహించరు.. అధికార మార్పు తథ్యం: న‌రేంద్ర మోడీ

ఆప్ అబద్ధాలను ఢిల్లీ ప్రజలు సహించరు.. అధికార మార్పు తథ్యం: న‌రేంద్ర మోడీ

Narendra Modi: ఆదివారం బసంత్ పంచమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఈ పండుగ సీజన్‌లో మార్పును సూచిస్తోందని, ఢిల్లీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఆప్ అబద్ధాలను ఢిల్లీ ప్రజలు సహించరని తెలిపారు.  

3 Min read
Mahesh Rajamoni
Published : Feb 02 2025, 04:18 PM IST| Updated : Feb 02 2025, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీలోని ఆర్కే పురంలో అసెంబ్లీ ఎన్నికలు 2025 ప్రచారం చేశారు. బహిరంగ సభలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు .

ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. "ఢిల్లీలో మాకు పోరాటాలు, గొడవలు కాకుండా, ఢిల్లీ ప్రజల సేవ చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. కారణాలు చూపించడానికి బదులు, ఢిల్లీని అందంగా తీర్చిదిద్దడంలో శక్తిని పెట్టాలి. మీరు వచ్చే 5 సంవత్సరాల కోసం కేంద్రంలో బీజేపీకి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఇక్క‌డ ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఆప్ ప్రభుత్వం రాకూడదు. అది ఢిల్లీని మ‌రింత నాశ‌నం చేస్తుంద‌ని" అన్నారు.

చిపురు క‌ట్ట చెల్లాచెదురు అవుతోంది అంటూ ఆప్ పై దాడి 

8 మంది ఎమ్మెల్యేలు ఆప్‌కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓటింగ్‌కు ముందు కూడా ఢిల్లీలో చీపురు గడ్డి ఎలా చెల్లాచెదురు అవుతున్నాయో మనం చూస్తున్నాం. చాలా మంది ఆప్ నాయకులు దానిని వదిలేస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు ఆప్ ఎలాంటి దారుణ పాల‌న అందిస్తున్న‌దో.. ఇప్పుడు అక్కాచెల్లెళ్ళూ, ఆటోవాళ్ళూ, మీరు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకే మ‌రోసారి ఆప్ ఆబ‌ద్దాలు చెబుతోంద‌నీ, మ‌ళ్లీ ప్ర‌జ‌ల నుంచి ఓట్లు ఆడుగుతోంద‌ని విమ‌ర్శించారు. 

23

హామీల‌కు నేను గ్యారంటీ :  ప్ర‌ధాని మోడీ 

మురికివాడల్లో నివసించే కుటుంబాలకు 5 రూపాయలకే పౌష్టికాహారం అందజేస్తామని, ఆటోడ్రైవర్లు, ఈ-రిక్షా పుల్లర్లు, ఇతరుల ఇళ్లలో పనిచేసే వారికి 5 రూపాయలకే పౌష్టికాహారం అందిస్తామని ఢిల్లీ బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లల ఫీజుల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రూ. 12 లక్షల వరకు సంపాదించే వారికి ఇంత ఉపశమనం లభించలేదని చెబుతూ.. ప్రజల కోసం బడ్జెట్ విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత స్నేహపూర్వక బడ్జెట్ ఇదని మధ్యతరగతి వర్గాలు చెబుతున్నాయని ప్ర‌ధాని మోడీ అన్నారు.

రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, దాని విధానాలు ఫ్యాక్టరీలను మూసివేసేలా చేశాయనీ, ప్రజలను లూటీ చేసిన వారు దానికి లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఒకవైపు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నఆప్ విధానాలు మ‌రోవైపు మోడీ హామీల మ‌ధ్య  తేడాల‌ను ప్ర‌జ‌లు గుర్తించాల్సిన స‌మ‌య‌మ‌ని అన్నారు. 

33
NIrmala Sitharaman Narendra Modi

NIrmala Sitharaman Narendra Modi

ఢిల్లీని నాశ‌నం చేసిన ఆప్ :  మోడీ  

కేంద్రంలోని తమ ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళలు అనే నాలుగు స్తంభాలను పటిష్టం చేసేందుకు కృషి చేస్తోంద‌నీ, మోడీ హామీలను నెరవేర్చే హామీ బడ్జెట్‌ అని ఆయన నొక్కి చెప్పారు. టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ఉపాధి కల్పన రంగాలపై బడ్జెట్‌లో దృష్టి సారించడం వల్ల యువతకు మేలు జరుగుతుందన్నారు.

జాతీయ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం వారికి అందించే ప్రయోజనాలను హైలైట్ చేయడానికి సీనియర్ సిటిజన్లు, మహిళలతో సహా బీజేపీ మేనిఫెస్టోలో చేసిన సంక్షేమ వాగ్దానాల గురించి ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి తన హృదయం, మనస్సు, ఆత్మను పెడ‌తాన‌ని అన్నారు. 

మధ్యతరగతి, జీతాలు తీసుకునే ఉద్యోగులతో సహా, గణనీయమైన సంఖ్యలో ఓటర్లను కలిగి ఉన్నందున, వారి కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాదనలపై మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏ జుగ్గీని కూల్చివేయబోమనీ, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఆగిపోవ‌ని తెలిపారు. 

బీజేపీ విజయంపై విశ్వాసం వ్యక్తం చేసిన మోడీ "ఫిబ్రవరి 8న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి మహిళలకు రూ.2,500 అందజేయడం ప్రారంభించ‌డం మీరు చూస్తార‌ని" అన్నారు. మహిళలు తనకు రక్షణ కవచంలా పనిచేశారని, కేంద్రంలో మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో తమవంతు కృషి చేశారని అన్నారు. ఢిల్లీ, ఆప్ ప్రభుత్వం కారణంగా భారీ మూల్యం చెల్లించుకుందని, దానిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ
కేంద్ర బడ్జెట్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved