Delhi exit poll 2025 : మార్పు వైపే డిల్లీవాలా తీర్పు ... ఆప్ ఇక స్విచ్చాఫ్ అవుతుందా!!
Delhi Exit Polls 2025 : డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవిఎంలకు చేరాయి. దీంతో డిల్లీ ఓటర్ల తీర్పు ఎలా వుండనుందో కొన్ని సర్వే సంస్థలు అంచనా వేసాయి... ఎవరి ఎగ్జిట్ పోల్స్ ఎలా వున్నాయంటే...
- FB
- TW
- Linkdin
Follow Us
)
arvind kejriwal
Delhi exit poll 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే కీలకమైన ప్రచారపర్వం ముగిసి ఇవాళ(బుధవారం) పోలింగ్ కూడా ముగిసింది. సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ కు సమయం ముగిసేంతవరకు 57.70 శాతం ఓటింగ్ నమోదయ్యింది. డిల్లీ ఓటర్ల తీర్పు ఈవిఎంలలో నిక్షిప్తం అయ్యాయి. ఫిబ్రవరి 8న అంటే వచ్చే శనివారం ఫలితాలు వెలువడనున్నాయి.
అయితే పోలింగ్ ప్రక్రియ ముగియగానే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వేలను విడుదలచేసాయి. ఇందులో బిజెపిదే అధికారమని చాలా సర్వేలు చెబుతున్నాయి... అంటే అధికార ఆప్ కు భంగపాటు తప్పదనేది మెజారిటీ సర్వేల ఫలితం. మరోసారి డిల్లీ సీఎం పగ్గాలు చేపట్టాలనుకుంటున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఎగ్జిట్ పోల్స్ కంగారుపెట్టాలా వున్నాయి.
ప్రముఖ సర్వే సంస్థలు చేసిన 10 ఎగ్జిట్ పోల్ ను పరిశీలిస్తే ఎనిమిదింటి మాట ఒకటే... ఢిల్లీలో అధికార మార్పు ఖాయమని. కేవలం రెండు పోల్స్ మాత్రమే ఆప్ కి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని సూచించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కాషాయ పార్టీలో హుషారు నింపితే ఆఫ్ కేడర్ ను స్విచ్చాఫ్ చేసాయి.
Delhi Asssembly Elections 2025
డిల్లీ ఎన్నికలపై టాప్ 10 ఎగ్జిట్ పోల్ ఫలితాలు:
1. మెట్రిజ్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 32-37 సీట్లు
బిజెపి - 35-40 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
2. పి-మార్క్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 21-31 సీట్లు
బిజెపి - 39-49 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
3. చాణక్య స్ట్రాటజిక్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25-28 సీట్లు
బిజెపి - 39-44 సీట్లు
కాంగ్రెస్ - 2-3 సీట్లు
4. జెవిసి సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 22-31 సీట్లు
బిజెపి - 39-45 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
5. పీపుల్స్ ఇన్సయిట్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25-29 సీట్లు
బిజెపి - 40-44 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
6. పీపుల్స్ పల్స్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 10-19 సీట్లు
బిజెపి - 51-60 సీట్లు
కాంగ్రెస్ - 0-2 సీట్లు
7. పోల్ డైరీ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 18-25 సీట్లు
బిజెపి - 42-50 సీట్లు
కాంగ్రెస్ - 0-2 సీట్లు
8. డివి రీసెర్చ్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 26-34 సీట్లు
బిజెపి - 36-44 సీట్లు
కాంగ్రెస్ - 0-0 సీట్లు
9. విప్రిసైట్ సర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 46-52 సీట్లు
బిజెపి - 18-23 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
10. మైండ్ బ్రింక్ మసర్వే :
ఆమ్ ఆద్మీ పార్టీ - 44-49 సీట్లు
బిజెపి - 21-25 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
BJP VS AAP
ఆప్ కి బిగ్ షాక్ తప్పదా?
ఈ పది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటిసారి పెద్ద షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. 2013 ఆవిర్భావం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజల ఆదరణ పొందుతూ వస్తోంది. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుండి వరుసగా విజయాలు సాధిస్తూనే వుంది. పదేళ్లకు పైగానే అధికారంలో వుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి మొదటిసారి చెడు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే క్రికెట్, రాజకీయ ఫలితాలను ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయలేం... ఎప్పుడూ తలకిందులు అవుతుంటాయి. ఈసారి కూడా అలాగే జరుగుతుందని ఆప్ ఆశాభావంతో వుంది.
కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ పొలిటికల్ కెరీర్ కి కష్టకాలం అవుతుంది.ఈ ఎన్నికలు దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కు కూడా మంచివి కావు. ఆప్ కి ముందు వరుసగా 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గత రెండుసార్లుగా కనీసం ఒక్క సీటు కూడా సాధించలేని పరిస్థితిలో వుంది. ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ లో కూడా దానికి అనుకూలంగా ఎలాంటి సంకేతాలు లేవు.
Delhi Asssembly Elections 2025
అవినీతి ఆరోపణల వల్ల ఆప్ పై వ్యతిరేకత?
బీజేపీ ఈ ఎన్నికల్లో తన ప్రచారాన్ని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న అవినీతి ఆరోపణలపై కేంద్రీకరించింది. గాంధేయవాది అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన ఆప్ పై బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా దాడి చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ పలువురు ప్రముఖ నాయకులు జైలుకు వెళ్లడం కూడా ఆప్ ను దెబ్బతీసింది. ముఖ్యమంత్రిగా వుండగానే అరవింద్ కేజ్రీవాల్, ఆయన సన్నిహితుడు మనీష్ సిసోడియా మరియు పార్టీలోని ప్రముఖ నాయకులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అసలు ఫలితాల మధ్య స్వల్ప తేడా లేదంటే భారీ తేడా ఉండవచ్చు. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయా లేదా అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ అందరినీ ఆశ్చర్యపరచడానికి సిద్ధంగా ఉన్నారా? అని. మరి ఫలితాల కోసం ఫిబ్రవరి 8వరకు ఆగాల్సిందే.