MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • National
  • Delhi CM: ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా బీజేపీ నాయ‌కురాలు రేఖా గుప్తా

Delhi CM: ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా బీజేపీ నాయ‌కురాలు రేఖా గుప్తా

Delhi CM Rekha Gupta: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025లో అఖండ విజయం సాధించిన దాదాపు రెండు వారాల తర్వాత, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బుధవారం దేశ రాజధానికి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో జరుగుతుంది.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 19 2025, 09:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Delhi CM: 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ సాధించిన బీజేపీ తాజాగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది.  ఫిబ్రవరి 19న బుధవారం జరిగిన‌ శాసనసభా పక్ష సమావేశం తర్వాత బీజేపీ త‌మ‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేఖ గుప్తాను ప్ర‌క‌టించింది. పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. రేఖా గుప్తా బీజేపీ (భారతీయ జనతా పార్టీ)కి చెందిన ప్రముఖ నేత. ఆమె ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. రేఖా గుప్తా వివిధ రాజకీయ, సామాజిక కార్యకలాపాలలో పాల్గొని పార్టీని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించేశారు. ఆమె 2015లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలల్లో మంచి గుర్తింపు పొందారు. రేఖ గుప్తా 1974లో జింద్ జిల్లాలోని జులానాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. 1976 లో మొత్తం కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. రేఖ గుప్తా తన మొత్తం విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. ఈ సమయంలో ఆమె ABVP (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)లో చేరి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. షాలిమార్ బాగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 
 

ఫిబ్రవరి 20న ఉదయం 11.00 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరిగాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించారు. చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఆప్ కు షాకిస్తూ బీజేపీ 48 స్థానాలను గెలుచుకుని ఢిల్లీలో అధికారంలోకి వ‌చ్చింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 22 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ మరోసారి తన ఖాతాను తెరవలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ

2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 48 స్థానాలను గెలుచుకుని అధికార పీఠం దక్కించుకుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంది బీజేపీ. ఇక అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఢిల్లీ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. మరోసారి వారికి అధికారం కట్టబెట్టడానికి ఇష్టపడలేదు. ఆప్ కేవలం 22 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఘోర ప్రదర్శన చేసింది. ఈ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

ఢిల్లీ ఎన్నికల ఓట్ల శాతాలు గమనిస్తే.. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025 ప్రకారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 48% ఓటర్లు అండగా నిలిచారు. ఇక రెండో స్థానంలో ఉన్న మాజీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు 43% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి  7 శాతం ఓట్లు పడ్డాయి కానీ, ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలు బీజేపీకి ఢిల్లీలో అధికారంలోకి రావడానికి అవకాశం కల్పించాయి. దాదాపు 27 ఏళ్ల త‌ర్వాత ఢిల్లీ ప్ర‌జ‌లు బీజేపీకి అవ‌కాశ‌మిచ్చారు. ఆప్‌కు ఈ ఎన్నికల్లో భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు స‌హా చాలా మంది కీల‌క నేత‌లు ఓట‌మిపాల‌య్యారు. 

33
BJP richest party

BJP richest party

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క‌నిపించిన ప్ర‌ధాన మార్పులు 

కేంద్రంలో ఎన్డీయే కూట‌మి అధికారంలో ఉన్న రాజ‌ధాని ఢిల్లీలో మాత్రం చాలా కాలం నుంచి అధికారం ద‌క్కించుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతోంది. కానీ, 2025 అసెంబ్లీ ఎన్నికల‌తో ఢిల్లీలో బీజేపీ త‌న గ‌త వైభ‌వాన్ని అందుకుంది.  దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులను చూపిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వ‌చ్చింది. మొత్తం 70 స్థానాల్లో, బీజేపీ 48 స్థానాలు సాధించి అధికార‌పీఠం ద‌క్కించుకుంది. 

ఢిల్లీలో బీజేపీ గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణాల్లో మైనారిటీ ఓట‌ర్లు అనుకూలంగా ఉండ‌టం. దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులు మైనారిటీలను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలో విజ‌యం సాధించిన బీజేపీ దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కూడా ఈ విష‌యంలో స‌క్సెస్ అయింది. ఆప్ వైనారిటీల‌ను ఆక‌ర్షించ‌డంలో విఫ‌లం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర ఫ‌లితాలు రాబ‌ట్టింది. వారి స్థానాలు సున్నాకు ప‌డిపోయాయి. చాలా కాలం ఢిల్లీని పాలించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఢిల్లీ ప్ర‌జ‌లు పూర్తిగా తిర‌స్క‌రించ‌డంతో ఒక్క స్థానంలో కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముంబై, బెంగళూరు కాదు బాసు.. ఇండియాలో ఇప్పుడు జాబ్స్ ఎక్కువగా ఇస్తున్న టాప్ 10 నగరాల ఇవే
Recommended image2
Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Recommended image3
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved