MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రి పదవి ... ఎవరీ రివాబా?

టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రి పదవి ... ఎవరీ రివాబా?

Rivaba Jadeja : భారత స్టార్ క్రికెటర్ భార్య ఒకరు రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమెకు ఓ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటుదక్కింది. ఇంతకూ ఆ క్రికెటర్, ఆయన భార్య ఎవరు? ఏ రాష్ట్రానికి మంత్రిగా ఎంపికయ్యారు? 

2 Min read
Arun Kumar P
Published : Oct 17 2025, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మంత్రిగా టీమిండియా క్రికెటర్ భార్య ప్రమాణస్వీకారం
Image Credit : X/Rivaba Jadeja

మంత్రిగా టీమిండియా క్రికెటర్ భార్య ప్రమాణస్వీకారం

Ravindra Jadeja : ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వంటి బిజెపి హేమాహేమీల సొంతరాష్ట్రం గుజరాత్ లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్టేట్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రివర్గం మొత్తం ఇటీవల రాజీనామా చేసింది... ఇవాళ(శుక్రవారం) తిరిగి కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యింది. ఇవన్నీ కేవలం ఈ రెండురోజుల్లోనే చకచకా జరిగిపోయాయి. అయితే కొత్తగా మంత్రివర్గంలో చేరినవారిలో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు.

25
రివాబా జడేజా వ్యక్తిగత జీవితం
Image Credit : X/Rivaba Jadeja

రివాబా జడేజా వ్యక్తిగత జీవితం

రివాబా జడేజా రాజ్ కోట్ నగరంలో 1990 నవంబర్ 2న జన్మించారు. తల్లిదండ్రులు ప్రపుల్లాబా, హర్ దేవ్ సింగ్ సోలంకి. గుజరాతీ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరిగిన రివాబా చదువులో బాగా చురుకు... విద్యాభ్యాసమంతా రాజ్ కోట్ లోనే సాగింది. ఈమె ఆత్మీయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్సెస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. చదువు పూర్తికాగానే రివాబాను టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఇచ్చి పెళ్లిచేశారు తల్లిదండ్రులు. ఇలా 2016 ఏప్రిల్ 17న వీరి వివాహం జరిగింది... దీంతో రివాబా సోలంకి కాస్త రివాబా జడేజాగా మారిపోయారు.

Related Articles

Related image1
Ravindra Jadeja: ఇంగ్లాండ్‌లో రవీంద్ర జడేజా కొత్త‌ చరిత్ర.. గ్యారీ సోబర్స్, కోహ్లీ రికార్డులు బ్రేక్
Related image2
Ravindra Jadeja: జడేజా గుర్రపు స్వారీ వీడియో వైరల్.. మీరు చూశారా?
35
రివాబా జడేజా రాజకీయ జీవితం
Image Credit : X/Rivaba Jadeja

రివాబా జడేజా రాజకీయ జీవితం

భర్త రవీంద్ర జడేజా భార్యగా కంటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని రివాబా భావించారు. ఇందుకు రాజకీయాలే సరైన మార్గంగా ఆమె భావించారు... భర్త రవీంద్ర కూడా అంగీకరించడంతో 2019 లో అధికార భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు రివాబా జడేజా.

ఇలా బిజెపిలో వివిధ విభాగాల్లో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రివాబా.   ఆమె సేవలను గుర్తించిన బిజెపి అదిష్టానం 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నార్త్ సీటు కేటాయించింది. ఈ ఎన్నికల్లో భార్య తరపున రవీంద్ర జడేజా కూడా ప్రచారం నిర్వహించారు. దాదాపు 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో రివాబా తొలిసారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు... రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు.

45
మంత్రివర్గంలో రివాబా జడేజాకు చోటు
Image Credit : X

మంత్రివర్గంలో రివాబా జడేజాకు చోటు

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రివాబా జడేజా తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను అందేలా చూస్తున్నారు. అలాగే అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేగా సమర్ధవతంగా పనిచేస్తున్న ఆమె సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉపయోగించకోవాలని బిజెపి అదిష్టానం, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ భావించారు. దీంతో తాజాగా తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఇవాళ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. మరి భూపేంద్ర కేబినెట్ లో రివాబా జడేజాకు ఏ శాఖ దక్కుతుందో చూడాలి.

#WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0

— ANI (@ANI) October 17, 2025

55
గుజరాత్ నూతన మంత్రివర్గమిదే
Image Credit : Facebook

గుజరాత్ నూతన మంత్రివర్గమిదే

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు. ఆయన మంత్రివర్గ నూతనంగా చేరిన సభ్యులతో తాజాగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దక్కినవారు వీరే..

  1. త్రికమ్ బిజల్ ఛంగ
  2. స్వరూప్జి సర్దార్జి ఠాకూర్
  3. ప్రవీణ్ కుమార్ మలి
  4. రుశికేష్ గణేష్ భాయ్ పటేల్
  5. పిసి బరంద
  6. దర్శన ఎం వాఘేల
  7. కంత్రతలల్ శివలాల్ అమృతియ
  8. కున్వర్జిభాయ్ మోహన్ భాయ్ బవాలియ
  9. అర్జున్ భాయి దేవబాయి మోధ్వాడియా
  10. డా. ప్రద్యుమన్ వజ
  11. కౌశిక్ కంటిభాయి వెకారియా
  12. పురుషోత్తమ్ భాయి ఓ సోలంకి
  13. జితేంద్రభాయి సవ్జిభాయి వఘాని
  14. రమన్ భాయి భిఖాభాయి సోలంకి
  15. కమలేశ్ భాయి రమేష్ భాయి పటేల్
  16. సంజయ్ సిన్హ్ రాజయ్ సిన్హ్ మహిద
  17. రమేష్ భాయి భూరభాయి కతర
  18. మనిష్ రాజీవ్ భాయి వకీల్
  19. ఈశ్వర్ సిన్హ్ ఠాకోర్ భాయి పటేల్
  20. ప్రఫుల్ పన్సేరియా
  21. హర్ష్ సంఘ్వి
  22. డా. జయరామ్ భాయి చెంభాయి గమిట్
  23. నరేష్ భాయి మగన్ భాయి పటేల్
  24. కనుభాయి మోహన్ లాల్ దేశాయి
  25. రివాబా జడేజా

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
రాజకీయాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రికెట్
క్రీడలు
మహిళలు
ప్రసిద్ధ వ్యక్తులు
నరేంద్ర మోదీ
అమిత్ షా

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved