ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌కు ఎంత జీతం వస్తుంది? ఫ్రీగా లభించే సౌకర్యాలు ఏంటి?
Vice President CP Radhakrishnan Salary: 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. భారీ వేతనంతతో పాటు ఆయన పింఛన్, ప్రభుత్వ భవనంలో వసతి, భద్రతా సిబ్బంది, వైద్య-ప్రయాణ సౌకర్యాలు ఇలా ఉచితంగా అందుకునే సౌకర్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపు
2025 సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి బీ. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించి ఓడిపోయారు. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన పదవిని రాధాకృష్ణన్ చేపట్టనున్నారు.
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ కు నెలకు లభించే జీతం ఎంత?
భారత ఉపరాష్ట్రపతికి నెలకు ₹4 లక్షల జీతం లభిస్తుంది. ఇది రాష్ట్రపతి, ప్రధాని వంటి రాజ్యాంగ పదవులకు సమానంగా ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాష్ట్రసభా ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ బాధ్యతల ఆధారంగానే ఆయన జీతం నిర్ణయించారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ జీతంతో పాటు ప్రత్యేక భత్యాలు కూడా అందుకుంటారు.
ప్రభుత్వ నివాసం, ప్రత్యేక భద్రత
ఉపరాష్ట్రపతికి ఢిల్లీలోని లుటియన్స్ జోన్‌లో ప్రత్యేక బంగ్లా కేటాయించారు. ఇది పూర్తిగా ఉచితం. నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు ఎల్లప్పుడూ ఉపరాష్ట్రపతి సేవలో ఉంటారు. భద్రతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడే సీపీ రాధాకృష్ణన్ ఉంటారు.
ఉపరాష్ట్రపతి కార్యాలయం, సిబ్బంది
ఉపరాష్ట్రపతికి ప్రత్యేక కార్యాలయంతో పాటు అక్కడ చాలా మంది సిబ్బంది ఉంటారు. కార్యదర్శులు, సహాయకులు, ఇతర సిబ్బంది రోజువారీ పనులను నిర్వహిస్తారు. అధికారిక సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఈ కార్యాలయం ద్వారా సజావుగా కొనసాగుతాయి.
వైద్య, అధికారిక ప్రయాణ సౌకర్యాలు
ఉపరాష్ట్రపతికి ప్రభుత్వ వ్యయంతో వైద్య సౌకర్యాలు లభిస్తాయి. ఇందులో రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, అత్యవసర వైద్యం, ఆసుపత్రిలో చేరిక వంటి అన్ని వైద్య ఖర్చులు ఉంటాయి.
దేశీయ, విదేశీ పర్యటనల కోసం ప్రయాణ భత్యాలు, ప్రభుత్వ వ్యయంతో విమాన, రైలు, రహదారి ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఇవి ఉపరాష్ట్రపతి అధికారిక పనుల భాగంగానే ఉంటాయి.
ఉపరాష్ట్రపతి పదవీ విరమణ పింఛన్
ఉపరాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసిన తర్వాత కూడా ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. నెలకు సుమారు ₹1.5 నుండి ₹2 లక్షల వరకు పింఛన్ లభిస్తుంది. అదనంగా ప్రైవేట్ కార్యదర్శి, సహాయక సిబ్బంది, కార్యాలయం, వైద్య సదుపాయాలు, దేశీయ విమాన ప్రయాణాలు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఈ పింఛన్, సౌకర్యాలు సమయానుకూలంగా పెరగవచ్చు.
భారత ఉపరాష్ట్రపతి పదవి కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమే కాదు, గౌరవం, భద్రత, సౌకర్యాలు, ఆర్థిక లాభాలు కలిగిన పదవి. అందువల్ల ఈ స్థానానికి రాజకీయ, సామాజిక వర్గాల్లో విశేష ప్రాధాన్యం ఉంటుంది.

