MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఒకే ఒక్క ఓటుతో ఏకంగా మంత్రినే ఓడించిన సామాన్యుడు.. ఇది కదా అసలైన విజయం..!

ఒకే ఒక్క ఓటుతో ఏకంగా మంత్రినే ఓడించిన సామాన్యుడు.. ఇది కదా అసలైన విజయం..!

Tamilnadu Assembly Elections Result 2026 : కేవలం ఒకే ఓటుతో ఓ సామాన్యుడు ఏకంగా మంత్రిని ఓడించాడు. మొదటిసారి పోటీచేసిన వ్యక్తి వరుసగా 4 సార్లు విజయం సాధించిన నాయకున్ని ఓడించాడు.

3 Min read
Author : Arun Kumar P
Published : May 05 2026, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తమిళనాడులో ఆసక్తికర పలితాలు..
Image Credit : Asianet News

తమిళనాడులో ఆసక్తికర పలితాలు..

Tamilnadu Assembly Elections Result 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. ఈ ఎన్నికల్లో టీవీకే 10-20 సీట్లు గెలవడమే కష్టమన్నారు... సర్వేలు కూడా అదే చెప్పాయి. కానీ నిన్న (సోమవారం, మే 4న) వచ్చిన ఫలితాలు అన్ని అంచనాలను తలకిందులయ్యాయి... టీవీకే ఏకంగా 108 స్థానాల్లో గెలిచి ఏకంగా ప్రభుత్వం ఏర్పాటుకే సిద్ధమవుతోంది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే 34.95 శాతం ఓట్లు సాధించి టీవీకే రికార్డు సృష్టించింది. ఈ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర ఘటనలు జరిగాయి. అందులో ఒకటి టీవీకే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలవడం.

25
ఒక్క ఓటుతో గెలుపు...
Image Credit : Asianet News

ఒక్క ఓటుతో గెలుపు...

శివగంగ జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున పోటీ చేసిన శ్రీనివాస సేతుపతి, డీఎంకే మంత్రి కే.ఆర్.పెరియకరుప్పన్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 30 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపు జరిగింది... చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరకు టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఈయనది కదా అదృష్టమంటే.. ఒక్క ఓటుతో ఎమ్మెల్యే అయ్యాడు.

తిరుపత్తూరు డీఎంకేకు కంచుకోట. అక్కడ డీఎంకే 8 సార్లు గెలిచింది. 2006 నుంచి వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్‌ను ఈసారి టీవీకే అభ్యర్థి ఓడించారు. శ్రీనివాస సేతుపతి (TVK) కి 83375 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి (DMK) పెరియకరుప్పన్ కు 83374 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరంగా ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి తికెమరన్ కు 29054 ఓట్లు వచ్చాయి.

Related Articles

Related image1
TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?
Related image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
35
తక్కువ మెజారిటీతో గెలిచిన స్ధానాలివే..
Image Credit : X

తక్కువ మెజారిటీతో గెలిచిన స్ధానాలివే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ టఫ్ పైట్ సాగింది. దీంతో అతితక్కువ మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి అసెంబ్లీ స్థానాలు ఏవంటే...

1. పోలూరు అసెంబ్లీ

తిరువణ్ణామలై జిల్లా పోలూరులో తక్కువ ఓట్లతో విజయం TVK విజయం సాధించింది. ఈ పార్టీ పోటీలో నిలిపిన అభ్యర్థి అభిషేక్ 227 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.. ఇతడికి 67,961 ఓట్లు రాగా DMDK కు 67,734 ఓట్లు వచ్చాయి.

2. వెప్పనహల్లి అసెంబ్లీ

క్రిష్ణగిరి జిల్లాలోని వెప్పనహల్లిలో DMK అభ్యర్థి శ్రీనివాసన్ 138 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ డిఎంకేకు 74,691 ఓట్లు పోలవగా AIADMK అభ్యర్థి మునుస్వామికి 74,553 ఓట్ల వచ్చాయి. ఈ అసెంబ్లీలో టివికె అభ్యర్థి సంపంగికి 63907 ఓట్లు వచ్చాయి.

3. కన్యాకుమారి అసెంబ్లీ

కన్యాకుమారిలో AIDMK అభ్యర్థి తలవై సుందరం కేవలం 214 ఓట్లతో విజయం సాధించాడు. ఇతడికి 75045 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి (DMK అభ్యర్థి) మహేష్ కు 74831 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టివికే అభ్యర్థి మాధవన్ కు 72977 ఓట్లు వచ్చాయి

4. తిరుక్కోయిలూరు అసెంబ్లీ

విళుపురం జిల్లీ తిరుక్కోయిలూరులో AIDMK అభ్యర్థి పళనిస్వామి 285 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇతడికి 73033 ఓట్లు రాగా TVK అభ్యర్థి విజయ్ ఆర్ భరణిబాలాజీకి 72748 ఓట్లు వచ్చాయి.ఇక్కడ డిఎంకే అభ్యర్థి పోన్ గౌతమ్ సింగమని 62452 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

45
టివికే అధినేత విజయ్ మెజారిటీ ఎంత..?
Image Credit : X

టివికే అధినేత విజయ్ మెజారిటీ ఎంత..?

తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని అందుకుంది టివికే. ఈ పార్టీ అధినేత విజయ్ కూడా పొటీచేసిన రెండు స్థానాల్లో విజయం సాధించాడు పెరంబూర్ నియోజకవర్గంలో 53,715 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక తిరుచ్చి (తూర్పు) నియోజకవర్గంలోనూ 27416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఇక తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో టీవీకే 108 చోట్ల గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇతర పార్టీల సపోర్ట్ విజయ్‌కు లభించే అవకాశం ఉంది... దీంతో సొంతంగానే ఆయన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేలా కనిపిస్తున్నారు.

55
స్టాలిన్ కు తప్పని ఓటమి...
Image Credit : ChatGPT

స్టాలిన్ కు తప్పని ఓటమి...

ఈ ఎన్నికల్లో అధికార డీఎంకేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఓడిపోవడం కాదు స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన కంచుకోట కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఇక్కడ టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ 7140 స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు... దీంతో ఈయననే శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
టీవీకే విజయ్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay : పాస్ మార్కులు రాకున్నా స్టేట్ టాపర్.. టివికే విజయ్ విజయం ఇలాంటిదే..!
Recommended image2
Thalapathy Vijay: విజయ్ క్రిస్టియన్ అయినా తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించాడు
Recommended image3
Now Playing
Vijay & Trisha Marriage Rumours: నెక్స్ట్ ఇక త్రిష విజయ్ పెళ్లేనా? | Asianet News Telugu
Related Stories
Recommended image1
TVK Vijay : సీఎంగా విజయ్ తొలి సంతకం దానిపైనేనా..?
Recommended image2
TVK Vijay: పెళ్లిలో విజయ్‌కి దారుణమైన అవమానం, దళపతికి రాజకీయ బీజం.. స్టాలిన్‌ కొంపముంచింది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved