MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • National: పెళ్లైన రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. అసలేం జరిగిందంటే.

National: పెళ్లైన రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. అసలేం జరిగిందంటే.

అందరిలాగే ఆ పెళ్లి కొడుకు కూడా ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి రోజంతా సందడిగా జరిగింది. మర్నాడు ఉదయం వరకూ అంతా బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పెళ్లి కూతురుకు కడుపు నొప్పి వచ్చింది. ఏంటా అని ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ చెప్పిన విషయానికి పెళ్లి కొడుక్కి ఒక్కసారిగా ఫ్యూజుల్‌ అవుట్‌ అయ్యాయి..  

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2025, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

ఎవరైనా పెళ్లి చేసుకునేది కుటుంబం నిలబడాలని. కుటుంబం ఉంటేనే సమాజం, దేశం బాగుంటాయి. ఈ సమాజానికి రేపటి తరాన్ని అందించే గొప్ప కార్యం వివాహం. ఇక పెళ్లైన తర్వాత జంటలు పిల్లల్ని ప్లాన్‌ చేయడం సర్వసాధారణమైన విషయం. కొందరు కాస్త టైం తీసుకుంటే మరికొందరు వెంటనే ప్లాన్‌ చేసుకుంటారు. అయితే పెళ్లైన రెండో రోజే భార్య బిడ్డకు జన్మనిస్తే. వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి సంఘటన నిజంగానే జరిగింది. 
 

22

ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహా కుంభమేళతో ఫేమస్ అయిన ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన జస్రా అనే గ్రామంలో ఫిబ్రవరి 24వ తేదీన ఓ యువకుడికి వివాహం జరిగింది. చాలా గ్రాండ్‌గా వివాహం జరిపారు. రాత్రంతా డ్యాన్స్‌లతో జోష్‌ మీదున్న కొత్త జంట ఉదయం ఆలస్యంగా నిద్ర లేచారు. అనంతరం వధువు ఇంట్లో ఏదో పనులు చేస్తూ అటు ఇటు తిరిగింది. 

దీంతో సాయంత్రం ఆమెకు ఒక్కసారిగా కడుపు నొప్పి మొదలైంది. వెంటనే కడుపు నొప్పి మందులు ఏవో వేసుకుంది. అయినా నొప్పి భరించలేకపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. నవ వధువును పరీక్షించిన డాక్టర్‌ షాకింగ్ న్యూస్‌ చెప్పారు. ఆ అమ్మాయి గర్బంతో ఉందని, నెలలు నిండాయని వెంటనే సర్జరీ చేయాలని తెలిపారు. అనంతరం బంధువుల అనుమతితో ఆపరేషన్‌ చేయగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 

ఇక అసలు గొడవ అక్కడి నుంచి మొదలైంది. పెళ్లైన రెండో రోజే బిడ్డకు జన్మనివ్వడంతో అబ్బాయి తరఫు వాళ్లు గొడవకు దిగారు. ఒకరినొకరు కొట్టుకునే వరకు పరిస్థితి వచ్చింది. అయితే మే నెలలో వివాహం నిశ్చయమైందని పెళ్లికి ముందే అమ్మాయి, అబ్బాయి కలుసుకున్నారని ఆ బిడ్డకు తండ్రి అతడే అంటూ అమ్మాయి తరఫు వారు వారించడం మొదలు పెట్టారు. కానీ వరుడు మాత్రం ఆ వాదనలు అబద్ధమని తోసిపుచ్చాడు. తన వివాహ నిశ్చయం అక్టోబర్‌లో జరిగిందని. ఆ బిడ్డకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పంచాయతీ కాస్త పెద్ద మనుషుల వరకు వెళ్లింది. చాలా సేపు వాగ్వాదం తర్వాత నవ వధువు పుట్టిన బిడ్డతో తన తల్లిగారి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సంఘటన స్థానికంగా చర్చకు దారి తీసింది. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Indians Return Safely from Dubai: దుబాయ్ నుడి క్షేమంగా తిరిగి వస్తున్న భారతీయులు | Asianet Telugu
Recommended image2
Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే
Recommended image3
Now Playing
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved