గర్భవతులను చేస్తే రూ. 10 లక్షలు ఇస్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటన.. అసలు కథ తెలిస్తే షాక్
సమజంలో రోజురోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వింత క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా క్రైమ్, ఎక్కడ జరిగింది లాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
మన అత్యాశే నేరగాళ్లకు వరంగా మారుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి. పనిలేకుండా డబ్బు రావాలి.? ప్రజలకు ఉండే ఇలాంటి అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని కొందరు నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
అసలు ఊహకు కూడా అందని విధంగా నేరాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు హనీట్రాప్, స్టాక్‌మార్కెట్, డిజిటల్ అరెస్ట్‌లు, ఓటీపీ ఫ్రాడ్స్ లాంటివి మాత్రమే విన్నాం అయితే తాజాగా బిహార్‌లో సరికొత్త మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది.
సంతానం లేని మహిళలను గర్భవతులను చేస్తే డబ్బులు ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి నిండి ముంచేశారు. బిహార్‌లోని నవడా జిల్లాలో ఈ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెంది ఓ ముఠా.. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’, ‘ప్లేబాయ్ సర్వీస్’ల పేరిట ఫేస్‌బుక్‌లో ప్రకటనలు పోస్ట్ చేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న స్త్రీలను గర్భవతులను చేస్తే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
ఒకవేళ ఈ ప్రయంత్నంలో విఫలమైనా రూ. 50వేల నుంచి రూ. 5 లక్షల వరకు కనీస మొత్తాన్ని ఇస్తామని ఆశ చూపారు. ఈ ప్రకటనలు చూసిన ఆకర్షితులైన కొందరు వ్యక్తులు ఫేస్ బుక్ ద్వారా ముఠా సభ్యులను సంప్రదించారు. బాధితుల నుంచి తొలుత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ఫీ వంటి వివరాలను సేకరించారు. అనంతరం రిజిస్ట్రేషన్, హోటల్ రూమ్స్ బుకింగ్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారు.
ఒకవేళ డబ్బులు ఇవ్వడమని ఎవరైనా వాదిస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారు. తీరా డబ్బులు చెల్లించాక తెలిసిందే. ఇదంగా పచ్చి మోసమని. దీంతో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారం కాస్త బయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
పోలీసుల విచారణలో భాగంగా ప్రిన్స్ రాజ్, భోలా కుమార్, రాహుల్ కుమార్‌లు ఈ ముఠాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద బాధితుల వాట్సప్ ఛాట్, కస్టమర్ ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.