స్టార్టప్ లో ఒక్క ఉద్యోగానికి 3వేల దరఖాస్తులు..!
జాబ్ పోస్టింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉందని మాత్రమే పెట్టానని, కనీసం అది ఏ పోర్టల్ లో ఉందో కూడా తాను మెన్షన్ చేయలేదని, అయినా అంత మంది అప్లై చేశారని అతను పేర్కొన్నాడు

Image: Getty
ఈ మధ్య స్టార్టప్ లు సత్తా చాటుతున్నాయి. పెద్ద కంపెనీలకంటే, స్టార్టప్ లలో ఉద్యోగాలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, ఓ స్టార్టప్ కంపెనీలో కేవలం ఒక్క ఉద్యోగం కోసం దాదాపు 3వేల మంది అప్లై చేయడం విశేషం. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
highest paying jobs
బెంగుళూరు స్టార్టప్‌కి చెందిన ఒక CEO తన కంపెనీలో ఉద్యోగం కోసం 48 గంటల్లో 3000 రెజ్యూమ్‌లను అందుకున్నాడు, అతను కంపెనీ వెబ్‌సైట్‌లో 'పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్' అని పోస్ట్ చేశాడు. షాక్ తిన్న కార్తిక్ మండవిల్లే ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బెంగుళూరుకు చెందిన టెక్ స్టార్టప్ స్ప్రింగ్‌వర్క్స్ CEO, 'జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉంది?' అని ట్విట్టర్‌లో అడిగారు.
Image: Getty
జాబ్ పోస్టింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉందని మాత్రమే పెట్టానని, కనీసం అది ఏ పోర్టల్ లో ఉందో కూడా తాను మెన్షన్ చేయలేదని, అయినా అంత మంది అప్లై చేశారని అతను పేర్కొన్నాడు. కేవలం ఈ ఒక్క నెలలో ఇన్ని అప్లికేషన్లు వచ్చాయని, కానీ, మొత్తం కలిపి ఈ ఉద్యోగం కోసం 12,500 మంది అప్లై చేశారట.
సిలికాన్ సిటీ బెంగుళూరులో ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎంత అధ్వాన్నంగా ఉందో అతనికి ఆశ్చర్యం కలిగించింది. లే ఆఫ్ సీజన్ వల్ల వేలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారని, ఇన్ని దరఖాస్తులు రావడానికి ఇది ఒక కారణమని చాలా మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు.
పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని మాత్రమే మెన్షన్ చేశారట. ఈ ఆఫర్ కూడా నచ్చి ఎక్కువ మంది అప్లై చేసి ఉండొచ్చు. బెంగళూరులోని ఐటీ కంపెనీలు 2023 ద్వితీయార్థం నుంచి తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చాలని, ఇక ఆఫీసులకు రమ్మని అడుగుతున్నాయి.
అందువల్ల, చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ఇష్టపడతారు. అదే పనిని అందించే ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. ఒక వినియోగదారుడు జాబ్ మార్కెట్ చెడ్డదని వ్యాఖ్యానించారు. తాను చూశానని, 20 ఉద్యోగాలకు 700మంది ఇంటర్వ్యూలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మరో వినియోగదారు "నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది . కళాశాలలో నేర్చుకున్న సబ్జెక్ట్‌తో సంబంధం లేకపోయినా యువకులు ఉద్యోగాల కోసం తహతహలాడుతున్నారు." అని కామెంట్ చేయడం విశేషం.