Love Fraud : స్కూల్ విద్యార్థిని వద్ద రూ.2.5 కోట్లు కొట్టేసాడా..!
బెంగళూరులో ఓ ధనిక కుటుంబానికి చెందిన స్కూల్ విద్యార్థినిని ట్రాప్ చేసి ఏకంగా రూ.2.5 కోట్లు దోచుకున్నాడో యువకుడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Bangalore
నేటి కాలంలో నిజమైన ప్రేమ కంటే నకిలీ ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా వుంటున్నాయి. తాజాగా ప్రేమ పేరిట ఆర్థిక మోసాలు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అలాంటి వ్యవహారమే కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. ఓ అమాయక స్కూల్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి కోట్ల రూపాయలు దోచుకున్నాడో కేటుగాడు.
Bangalore
బెంగళూరులో ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన బాలిక స్థానికంగా వున్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమెను ప్రేమ పేరుతో వెంటపడి ఎట్టకేలకు తన దారిలోకి తెచ్చుకున్నాడో ఆకతాయి యువకుడు. ఆ తర్వాత ఆమెతో లైంగిక కోరిక తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన అసలు రంగు బైటపెట్టాడు.
బాలికతో ప్రేమ విషయం ఆమె కుంటుంబసభ్యులకు చెప్పి డబ్బులు డిమాండ్ చేేసాడు. విషయం బైటికివస్తే పరువు పోతుందని ఆ కుటుంబం కూడా అతడు అడిగినంతా ఇచ్చేసారు. ఇలా అతడు ఏకంగా రూ.2.5 కోట్లు దోచుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది.
Bangalore
ఈ ఘటన బెంగళూరు శివారులో చోటుచేసుకుంది. ఇలా ప్రైవేట్ పాఠశాల విద్యార్థినిని ప్రేమ ఉచ్చులోకి లాగి డబ్బులు దోచుకున్న కేటుగాడు మోహన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అతను కూడా బెంగళూరు శివారులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2017-2022 వరకు చదివాడు. అప్పుడు ధనవంతుల కుటుంబానికి చెందిన ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆ పాఠశాల విద్యార్థినిని ప్రేమిస్తున్నట్లు నటించాడు.
Bangalore
పాఠశాలలో చదువుతున్నప్పుడే రిసార్ట్‌లు, పబ్బులు, పార్టీలు, సినిమాలు, పార్కులు ఇలా అన్ని చోట్ల తిప్పాడు. ఆ అమ్మాయి కుటుంబం కోటీశ్వరులని తెలుసుకున్న అతను ఆమె దగ్గర నుంచే డబ్బులు నీళ్లలా ఖర్చు చేశాడు. అంతేకాకుండా చాలాసార్లు లైంగికంగా వేధించాడు.
Bangalore
పాఠశాల చదువు పూర్తయ్యాక ఆ అమ్మాయిని గోవా, రిసార్ట్‌లు, పార్టీలు ఇలా చాలా రోజులు తిప్పాడు. ఆమెకు తెలియకుండానే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు తీసి దాచుకున్నాడు. ఆ తర్వాత తనకు కొంత డబ్బు అవసరం అని ఆ యువకుడు అడిగినప్పుడు ఆ అమ్మాయి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, నీ వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరించాడు.
Bangalore
ఇది ఊహించని ఆ అమ్మాయి షాక్ అయ్యింది. అయినా ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వలేనని తేల్చి చెప్పింది. దీంతో నేరుగా ఆమె కుటుంబ సభ్యులకు ఆమెకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు, వీడియోలు పంపించి బెదిరించాడు. అప్పుడు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి కొద్దికొద్దిగా రూ.2.5 కోట్లు దోచుకున్నాడు.
అంతేకాకుండా తన కోసం బైక్, నగలు, నగదు, ఖరీదైన వాచీలు వంటివి బహుమతులుగా తీసుకున్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆ అమ్మాయి బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.