MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • National
  • Viral Video: న‌డి రోడ్డుపై ముద్దులు, హ‌గ్గులు.. స‌న్‌రూఫ్ కారులో క‌పుల్ ర‌చ్చ‌. వైర‌ల్ వీడియో

Viral Video: న‌డి రోడ్డుపై ముద్దులు, హ‌గ్గులు.. స‌న్‌రూఫ్ కారులో క‌పుల్ ర‌చ్చ‌. వైర‌ల్ వీడియో

సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన త‌ర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు చూడాల్సి వ‌స్తుందో అర్థం కావడం లేదు. కొంద‌రు చేస్తున్న ప‌నులు చూస్తుంటే అస‌లు స‌మజం ఏటు పోతోంద‌న్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

2 Min read
Narender Vaitla
Published : May 29 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
న‌డి రోడ్డుపై రొమాన్స్
Image Credit : (Screengrab) | X/Karnataka Portfolio

న‌డి రోడ్డుపై రొమాన్స్

బెంగళూరులోని ట్రినిటీ రోడ్‌ సమీపంలో ఓ యువజంట చేసిన హంగామా మాములుగా లేదు. హైవేపై ఓ కారు వేగంగా దూసుకెళ్తుంది. అదే సమయంలో ఓ కారు సన్‌రూఫ్‌ నుంచి బయటకు వచ్చిన యంగ్ కపుల్ హగ్ చేసుకుంటూ, కిస్ చేస్తూ కనిపించారు. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. చుట్టూ ఎవరున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయిన జంట రెచ్చిపోయింది.

24
వైరల్ అవుతోన్న వీడియో
Image Credit : (Screengrab) | X/Karnataka Portfolio

వైరల్ అవుతోన్న వీడియో

ఆ జంట చేస్తున్న ఘనకార్యాన్ని వెనకాల నుంచి వస్తున్న వాహనంలోని డ్రైవర్ కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై షేర్ చేయడంతో వేగంగా వైరల్ అయింది. కొంతమంది యూజర్లు ఈ వీడియోను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కామెంట్స్ చేశారు.

Related Articles

UPI: ఫోన్‌పేలో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారా.? ఆగ‌స్టు 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు
UPI: ఫోన్‌పేలో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారా.? ఆగ‌స్టు 1 నుంచి కొత్త నిబంధ‌న‌లు
Hyderabad: 100 ఎక‌రాల్లో రూ. 2580 కోట్ల ఖ‌ర్చుతో.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం.
Hyderabad: 100 ఎక‌రాల్లో రూ. 2580 కోట్ల ఖ‌ర్చుతో.. హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుత నిర్మాణం.
34
అలర్ట్ అయిన పోలీసులు
Image Credit : (Screengrab) | X/Karnataka Portfolio

అలర్ట్ అయిన పోలీసులు

ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ కావ‌డంతో పోలీసులు వారి గురించి తెలుసుకునేందుకు ఆరా తీశారు. కారు నెంబ‌ర్ ప్లేట్ ఆధారంగా గుర్తించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. రోడ్డు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇలా ప్ర‌వ‌ర్తించ‌డంతో వారికి ముమ్మాటికీ శిక్ష ప‌డుతుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

44
ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు
Image Credit : (Screengrab) | X/Karnataka Portfolio

ఫైర్ అవుతోన్న నెటిజ‌న్లు

ఈ సంఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య చేయాల్సిన ప‌ని ఇలా బ‌హిరంగంగా చేయ‌డానికి బుద్ధి ఉండాల‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాంట‌సీలు కోరుకోవ‌డం త‌ప్పు లేదు కానీ అది ప‌క్క‌వారికి ఇబ్బంది క‌లిగేలా ఉండ‌కూడ‌ద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. ఇలాంటి వారిని క‌చ్చితంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

వైరల్ అవుతోన్న వీడియో ఇదే..

Sunroof Shenanigans: Public Road Becomes Private Bedroom for Bengaluru Couple

What is truly happening to people these days? In yet another bizarre and concerning incident, a young couple was caught on camera engaging in highly inappropriate behavior through the sunroof of a… pic.twitter.com/p8bt7r1WX7

— Karnataka Portfolio (@karnatakaportf) May 27, 2025

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
వైరల్ న్యూస్
భారత దేశం
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved