MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • భారత్ లో స్లీపర్ బస్సులను నిషేధిస్తారా? : ఇండియన్ ఆయిల్ మాజీ ఛైర్మన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్ లో స్లీపర్ బస్సులను నిషేధిస్తారా? : ఇండియన్ ఆయిల్ మాజీ ఛైర్మన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bus Accident : నిన్న కర్నూల్, నేడు రాజస్థాన్… వరుస ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బస్సులను నిషేంధించాలనే డిమాండ్ మొదలయ్యింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 28 2025, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం...
Image Credit : Generated by google gemini AI

మరో ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదం...

Bus Accident : కర్నూల్ బస్సు ప్రమాద ఘటనను మరిచిపోకముందే మరో ట్రావెల్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోని జైపూర్-డిల్లీ జాతీయ రహదారిపై బస్సు మంటల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు సజీవదహనం అయ్యారు... మరో 10 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జైపూర్ కు తరతించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రమాదం ఎలా జరిగింది?
Image Credit : Asianet News

ప్రమాదం ఎలా జరిగింది?

ఉత్తర ప్రదేశ్ నుండి కొందరు ఇటుక బట్టీ కార్మికులను తరలిస్తుండగా జైపూర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు హైటెన్షన్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... వెంటనే కొందరు కార్మికులు అప్రమత్తమై బస్సులోంచి దిగిపోయారు. కానీ కర్నూల్ అగ్నిప్రమాదం మాదిరిగా క్షణాల్లో బస్సు మొత్తాన్ని మంటలు అంటుకున్నాయి... దీంతో కొందరు ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

35
ట్రావెల్స్ బస్సులను నిషేధించాలి : ఇండియన్ ఆయిల్ మాజీ ఛైర్మన్
Image Credit : X

ట్రావెల్స్ బస్సులను నిషేధించాలి : ఇండియన్ ఆయిల్ మాజీ ఛైర్మన్

వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో ఇందులో ప్రయాణమంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. మరి ఇన్ని ఘటనలు జరుగుతున్నా... ఇంతమంది ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదు? ట్రావెల్స్ యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? రక్షణ చర్యలు ఎందుకు చేపట్టడంలేదనే ప్రశ్నలు తలెతున్నాయి. ఈ క్రమంలో దేశంలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించాలని మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య ఆసక్తికరమైన డిమాండ్ చేస్తున్నారు.

45
బస్సు ప్రమాదాలకు 130 మంది బలి
Image Credit : Linkedin

బస్సు ప్రమాదాలకు 130 మంది బలి

మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య లింక్డ్‌ఇన్‌లో వరుస బస్సు ప్రమాదాలపై స్పందించారు. “భారత్‌లో స్లీపర్ బస్సులు ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేశాయి. గత కొన్నేళ్లుగా వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలే దీనికి నిదర్శనం. ఇది పూర్తిగా బాధ్యతారహితమైన బస్సుల డిజైన్ ఫలితమే” అని పేర్కొన్నారు.

''ఇటీవల కొద్ది కాలంలోనే జరిగిన బస్సు ప్రమాదాల్లో 41 మంది చనిపోయారు. కర్నూలులో 19 మంది, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో 20 మంది. గత 10 ఏళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో 130 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దురదృష్టం కాదు… బస్సుల డిజైన్‌ వల్ల జరిగిన పెద్ద తప్పు'' అని శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

55
చైనా మాదిరిగా భారత్ ఎందుకు చేయడంలేదు?
Image Credit : Shrikant M Vaidya/linkedin

చైనా మాదిరిగా భారత్ ఎందుకు చేయడంలేదు?

''ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాలు ప్రయాణికుల భద్రత కోసం ట్రావెల్స్ బస్సుల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నాయి. చైనాలో 2012లోనే స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించారు. వియత్నాంలో భద్రతా నియమాలను, ఎగ్జిట్ సిస్టమ్‌లను మార్చారు. జర్మనీలో తక్కువ సామర్థ్యంతో కూడిన నియంత్రిత డిజైన్లను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఈ ఘటనలు జరిగిన తర్వాత విచారణ జరపడం మాత్రమే కొనసాగిస్తోంది. పూర్తిస్థాయి భద్రతా చర్యలు ఇప్పుడు అవసరం. 1.6 మిలియన్ బస్సులు, ప్రైవేట్ ఆపరేటర్ వ్యవస్థ వల్ల ప్రయాణికుల భద్రతకు పర్యవేక్షణ లేకుండా పోయింది'' అంటూ మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

''అధిక రద్దీ, అక్రమ విద్యుత్ కనెక్షన్లు వంటి అనేక కారణాలతో స్లీపర్ బస్సులు ప్రయాణికులను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి ఏకైక పరిష్కారం ప్రస్తుత రూపంలో ఉన్న స్లీపర్ బస్సులను భారత్‌లో పూర్తిగా నిషేధించడమే” అని మాజీ ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ శ్రీకాంత్ ఎం వైద్య పేర్కొన్నారు. దీనికి మద్దతుగా చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
కర్నూల్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఈ ట్రాఫిక్ ఫైన్సే నిదర్శనం, ఇన్నివేలా?
Recommended image2
స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి.? బస్సు ఎక్కే ముందు వీటిని చెక్ చేసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved