- Home
- National
- Annamalai : తెలంగాణలో చేసిన తప్పే తమిళనాడులో చేస్తున్నారా? అన్నామలై తప్పుకున్నారా లేక తప్పించారా?
Annamalai : తెలంగాణలో చేసిన తప్పే తమిళనాడులో చేస్తున్నారా? అన్నామలై తప్పుకున్నారా లేక తప్పించారా?
సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి తీసుకున్న ఓ నిర్ణయం ఆపార్టీకి తీవ్ర నష్టాన్ని చేసిందనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయినా సేమ్ అలాంటి నిర్ణయమే తమిళనాడు ఎన్నికలకు ముందు తీసుకుంటోంది బిజెపి. మరి దీని ఫలితం అక్కడెలా ఉంటుందో చూడాలి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Annamalai
Annamalai : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది 2026 లో జరగనున్నాయి. ఈ సందర్భంగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి... ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అన్నామలై నాయకత్వంలో ఈ పార్టీ ఎన్నికలకు వెళ్లడంలేదు... ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు.
తమిళనాడు బిజెపి అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అన్నామలై ప్రకటించారు. త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. మరోసారి రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టబోనని... నూతన అధ్యక్షుడి రేసులో తాను లేనని అన్నామలై ప్రకటించారు. కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారో తనకు తెలియదు... ఇది బిజెపి జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని అన్నామలై తెలిపారు.
Annamalai BJP
అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నామలైని తప్పించడానికి కారణాలివేనా?
భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి... కానీ అన్నింటికన్నా తమిళనాడు రాజకీయాలు చాలా ప్రత్యేకం. అక్కడ స్థానిక పార్టీలదే హవా... జాతీయ పార్టీలకు చోటులేదు. అలాంటిరాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడానికి చాలా ప్రయత్నించాడు అన్నామలై. అతడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినతర్వాతే బిజెపి శ్రేణుల్లో ఊపు వచ్చింది. గత పార్లమెంట్ ఎన్నికలను కూడా ఇతడి నాయకత్వంలోనే తమిళ బిజెపి పోటీచేసింది.
అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి కనీపం ఒక్కసీటు కూడా సాధించలేకపోయింది. చివరకు ఆయనే పోటీచేసి ఓడిపోయారు. ఇదే ఆయనను అధ్యక్ష పదవినుండి తప్పించడానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది... ఆలోపు కొత్తవారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఎన్నికలవరకు కుదురుకునే సమయం ఇవ్వాలని బిజెపి అదిష్టానం భావిస్తున్నట్లుంది. అందుకే అన్నామలై తప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక అన్నామలై నుండి అధ్యక్ష పగ్గాలు లాక్కోడానికి ఏఐఏడిఎంకే (అన్నా డిఎంకే) కూడా ఓ కారణంగా తెలుస్తోంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అన్నా డిఎంకే కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి... ఇప్పటికే ఇరుపార్టీల ముఖ్యనేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అన్నాడిఎంకే నాయకుడు పళనిస్వామి బిజెపి అగ్రనేత అమిత్ షాతో భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా అన్నామలై ఉంటే పొత్తు కష్టమని ... ఆయనను తొలగించాలని అన్నాడిఎంకే కోరినట్లు తెలుస్తోంది. అందువల్లే అన్నామలైని తప్పుకోవాలని బిజెపి అదిష్టానం కోరింది... వారి ఆదేశాలతోనే ఆయన అధ్యక్ష పదవిని వదులుకుంటున్నట్లు సమాచారం.
బిజెపి రాష్ట్ర అధ్యక్ష రేసునుండి తప్పుకుంటున్నానని అన్నామలై ప్రకటించారు... కానీ ఈ పార్టీలోనే ఉంటారా లేక ఇతర పార్టీలో చేరతారా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. బిజెపికి ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని కోరుకుంటున్నానని అన్నారు. ఇలా ఆయన మాటలు కూడా బిజెపిలోనే ఉంటారా? లేక పార్టీ మారతారా? అన్నది ఊహించడానికి కూడా వీలులేకుండా ఉన్నాయి.
bandi sanjay kumar
తెలంగాణ ప్రయోగమే తమిళనాడులో చేస్తున్నారా?
తెలంగాణలో కూడా ఇలాగే సరిగ్గా ఎన్నికలకు ముుందు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చింది బిజెపి అదిష్టానం. అన్నామలై ఎలాగైతే తమిళనాడు బిజెపిలో ఊపు తెచ్చారో బండి సంజయ్ కూడా తెలంగాణ బిజెపిలో ఊపు తెచ్చారు. ఆయన నాయకత్వంలోనే దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి గెలిచింది... అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారీగా కార్పోరేటర్లను గెలుచుకుంది. ఇలాంటిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది బిజెపి.
సేమ్ టు సేమ్ తమిళనాడులో ఇదే జరుగుతోంది. పార్టీని బలోపేతం చేసి పోటీకి సిద్దయవుతున్న సమయంలో అన్నామలైను తప్పిస్తోంది బిజెపి అదిష్టానం. ఈ ప్రయోగం తెలంగాణలో మాదిరిగానే బెడిసి కొడుతుందా లేక తమిళనాడులో సక్సెస్ అవుతుందా చూడాలి. ఇక అధ్యక్ష పదవిని లాక్కున్నాక బండి సంజయ్ కు ప్రమోషన్ ఇచ్చి కేంద్ర పార్టీ బాధ్యతలు, ఆ తర్వాత ఎంపీగా గెలిచాక కేంద్ర మంత్రి పదవి అప్పగించింది. అలాగే అన్నామలైకి కూడా ఏమైనా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి.